🔱 శబరిమల వనయాత్ర - 68 ⚜️ సహస్రకలశాభిషేకం ⚜️

P Madhav Kumar

⚜️ సహస్రకలశాభిషేకం ⚜️

శబరిమలలో అత్యున్నత పూజగా ఈ సహస్రకలశాభిషేకం ఎంచబడుచున్నది.

మిక్కిలి కష్టసాధ్యమైన పూజగా ఎంచబడు ఇది ఏడాదిలో రెండు పర్యాయములు మాత్రమే చేయుదురు. ఏలనగా శబరిమలపై ఎప్పుడు చాలా రద్దీ యుంటుంది. సహస్రకలశాభిషేకం చేయుటకు రెండుదినములు కావలసియుండును. మొదటి దినము కలశములన్నిటిని శుద్ధిచేసి మంత్రోచ్చారణ జలము నింపాలి. తదుపరి దినము ఉదయం కలశములన్నింటికి పూజలు చేసి ఆ కలశములన్నింటిని స్వామివారి గర్భాలయములోకి తీసికెళ్లి అభిషేకము చేయాలి.


ఆ సమయమున తంత్రివర్యులు, మేల్ శాంతి , కీల్ శాంతి మరియు వారి అనుచరులందరూ కలసికట్టుగా పనిచేసినను సుమారు 6 నుండి 8 గంటల సమయము పడుతుంది. అంతసమయము రద్దీ నిండిన వేళలో కేటాయించుకుంటే భక్తుల దర్శనము ఇబ్బంది అవుతుందని ఈ సహస్రకలశ అభిషేక పూజను సంవత్సర మద్యలో అనగా జూన్ జూలై నెలలో నిర్వహిస్తారు. ఇందుల కొరకు దేవస్థానము వారికి ఒక లక్ష పదివేలు చెల్లించాలి. శబరిమల ప్రదాన తంత్రి పూజారివర్యులు దీన్ని స్వయాన నిర్వహిస్తారు. పూజలో కూర్చునేది డబ్బుచెల్లించినవారే అయినప్పటికి సహస్ర కలశాభిషేకమును మాత్రం సర్వులు దర్శించి తరించవచ్చును. అభిషేకము జరుగుతూ యున్నను దర్శనము జరుగుచూనే యుండును.


🙏🌺ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌷🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat