💥పరిచయం
గరుత్మంతుడు హిందూ పురాణాలలో ఒక గరుడ పక్షి (గ్రద్ద). శ్రీమహావిష్ణువు వాహనంగా గరుత్మంతుడు ప్రసిద్ధి. ఇతడు మహాబలశాలి. కాని వినయశీలి. ఆర్త్రత్రాణపరాయణుడైన శ్రీమహావిష్ణువు ఎక్కడికి వెళ్లాలనుకున్నా గరుత్మంతుదు సిద్ధంగాఉంటాడు. వెంటనే విష్ణువు గరుడారూఢుడై వెళ్లి ఆపన్నులను రక్షిస్తూ ఉంటాడు..
🦅గరుత్మంతుని_జననం:
(గరుడారూఢుడైన విష్ణువు, వ్యావహారిక 6-7 శతాబ్దికి చెందిన ఇసుక రాయి శిల్పం. లలాట తోరణం పై చెక్కినది. వేంగి చాళుక్యుల నాటిది. పెదవేగి గ్రామం త్రవ్వకాలలో బయల్పడింది. శివాలయంలో ఉంచబడింది.)
కొన్ని రోజులకు గరుత్మంతుడు పుడతాడు. గరుడుడిని చూసి కద్రువ, "వినతా! నువ్వు దాసీ వి కాబట్టి నీ కుమారుడు కూడా నా దాసుడే అని గరుడుడిని కూడా దాసీవాడు గా చేసుకొంటుంది. గరుత్మంతుడు తన సవతి తమ్ముళ్లను తన వీపు మీద ఎక్కించుకొని తిప్పుతూ ఉండేవాడు. ఒకరోజు ఇలా త్రిప్పుతుండగా గరుత్మంతుడు సూర్యమండలం వైపు వెళ్లి పోతాడు. ఆ సూర్యమండలం వేడికి ఆ సర్పాలు మాడి పోతుంటే కద్రువ ఇంద్రుడిని ప్రార్థించి వర్షం కురిపిస్తుంది. ఆ తరువాత గరుత్మంతుడిని దూషిస్తుంది.
దానితో దుఃఖితుడై గరుత్మంతుడు తనది, తన తల్లిది దాసీత్వం పోవాలి అంటే చేయవలసిన కార్యాన్ని అడుగుతాడు. అప్పుడు కద్రువ కుమారులు, ఆలోచించి అమృతం పొందాలనే కోరికతో తమకు అమృతం తెచ్చి ఇస్తే గరుత్మంతుడి మరియు వినత ల దాసీత్వం పోతుందని చెబుతారు...
సేకరణ