🌹 శ్రీ గరుత్మంతుడి కధ -2 వ భాగం

P Madhav Kumar


🌹శ్రీ గరుడ పురాణము పరిచయము :


గరుడ పురాణము అనగానే చాలామంది ,అదేదో అశుభ పురాణ మనియు , ఎవరో చనిపోయినప్పుడే తప్ప వట్టి రోజులలో చదువకూడదనియు ఒక దురభిప్రాయము లోకములో నాటుకు పోయినది .కాని అది సరియైనది కాదు . ఇది,విష్ణు మహత్యమును దెలుపు వైష్ణవ పురాణము .నారద పురాణములో దీనిని గురించి - " మరీచే శృణు వచ్మద్య పురాణం గారుడం శుభమ్. గరుడా యాబ్ర వీత్ పృష్నో భగవాన్ గరుడాసనః" అని శుభమును గలిగించు పురాణముగా చెప్ప బడినది . గారుడ కల్పములో విశ్వాండము నుండి గరుడుడు జన్మించుటను ,అతని చరిత్రమును ,పురస్కరించుకుని ఈ గరుడ పురాణము వెలసేనని మత్స్య పురాణములో చెప్పబడినది . అగ్ని పురాణము వలెననే ఈ పురాణము గూడా విజ్ఞాన సర్వస్వమని చెప్పవచ్చును. దీనిలో అనేక విషయములున్నవి . అన్ని పురాణములలో వలెనె దీనిలోను బ్రహ్మాదుల సృష్టి ,వారు చేసిన ప్రతి సృష్టి ,వంశములు , మన్వంతరములు , వంశములలోని ప్రసిద్దులైన రాజుల కధలు ఉన్నవి .యుగ ధర్మములు ,పూజావిదానములు విష్ణుని దశావతారములు ,అనేక ధర్మములు, ఆయుర్వేదము, చికిత్సా విధానములు , చంద శ్శాస్త్ర ప్రశంశ ,వ్యాకరణము ,గీతా సారాంశము మొదలగునవి అన్నియు వర్ణింప బడినవి. ఈ పురాణములో పూర్వ ఖండము ఉత్తర ఖండము అని యున్నవి .ఉత్తర ఖండములోని ప్రధమ భాగము ప్రేత కల్పము అని చెప్పబడును .చనిపోయిన వారి ఆత్మ శాంతి కై చేయదగిన కార్యము లన్నియు అందులో చెప్పబడినవి. కావున దానిని ఆ పది రోజులలో చదువుట ఆచారముగా నున్నది. తక్కిన భాగములన్నియు పవిత్రములో అన్ని పురాణముల వలెనె ఎప్పుడు కావలసిన అప్పుడు ఇంటిలో చదువుకొనుటకు వీలుగా నున్నవే . నైమిశారణ్యము లోని శౌనకాది మునీంద్రులు సూతు నడుగగా ,వారి కతడీ గరుడ పురాణము నిట్లు వివరించెను.


గరుడుని పుట్టుక:

ఒక కల్పాంత ప్రళయ కాలములో లోకములన్నియు నశించి జగమంతయు సుఖమయం ..

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat