🔰 *దేవాంగ పురాణము* 🔰 22వ భాగం

P Madhav Kumar


 *22.భాగం* 


సూతు - ఇట్లు రాక్షసులు కొట్టబడి చెల్లాచెదరై పోయిన తరువాత మహాబలుడును మహాప్రాజ్ఞుడును శత్రుతాపనుడును నగు దేవలునియొద్దకు వచ్చి

యారాక్షసుడు మధురముగా నిట్లనియె. దేవాంగరాజా ! నీవు యుద్ధములో ధనుస్సు

పట్టుకొని ప్రళయకాలపు మేఘునివలె ప్రకాశించుచున్నావు. బాణవర్షముచే

శత్రువులను ముంచి వైచుచున్నావు. నీతో యుద్ధము చేయుటకు నేను దక్క దక్కినవారు పనికిరారు. అడవిలో సింహము మృగములను బరుగు లెత్తించునట్లు

నాశత్రువులను నిర్భయముగా బరుగులెత్తింతును. గొప్పదియగు రధఘోషము

చేతను భూమ్యంతరిక్షములు నిండునట్లుచప్పుడు చేయుదును. అమ్ములపొందినుండి

పాములవంటి బాణములను దీసి ప్రయోగింతును. ఈశ్వరునితో సంధకాసురుడు

యుద్ధముచేసినట్లు నాయొక్కనితోడనే యుద్ధము చేయుదువుగాక. అని యిట్లు

రాక్షసుడనగానే దేవాంగుడు సంతోషించి నవ్వుచు ఖడ్గముతో నారాక్షసుని

గొట్టెను.ఆదెబ్బకు నొచ్చి యారాక్షసుడు మర్మభేదకములగు బాణములచే దేవలుని గొట్టెను.

మరల దొంబది బాణములచే సకలమయిన మర్మస్థానములయందును గొట్టెను.రాక్షసుడు ప్రయోగించినబాణములు తగిలినయా దేవలుడు కిరణములతో గూడిన

సూర్యునివలె బ్రకాశించెను. తరువాత దేవలుడు కోపించి వేలకొలది బాణములు

ప్రయోగించి వ్యాఘవక్రు డనురాక్షసుని గప్పిపుచ్చి సింహనాదము చేసెను.

ఆరాక్షస

తనబాణములచే నతనిబాణములను వారించి నవ్వుచున్నవానివలెనే

యొకబాణముచే దేవలుని నుదుటిమీదను గొట్టెను. నుదుటియందు దగిలిన

యాబాణముచేతను దేవలుడు వనమందు గర్వించియుండు ఖడ్గమృగమువలె

గన్పట్టుచుండెను. తరువాత నాదేవాంగుడు. నవ్వుచు నారాక్షసుని నుదుటికి

దగులునట్టుగా మూడు వాడిబాణములను ప్రయోగించెను. మూడు బాణములును దగిలి యావ్యాఘవక్రుడు రక్తము స్రవించుచుండగా వర్షాకాలములో ద్రిశృంగ

ములు గలపర్వతమువలె నుండెను. తరువాత నారాక్షసుడు వేలకొలది బాణములతో

దేవలుని గప్పివైచెను. కాని గాలి పర్వతమును గదలింపజాలనట్టుగానే యతనిని

గదలింపజాలకపోయెను. అట్లే దేవలుడును రాక్షసుని గొట్టెను గాని యుదక ప్రవాహము కొండ నేమియు జేయజాలనట్టే యేమియు జేయజాలకపోయెను.

లోకక్షయమును జేయుటకు సిద్ధపడిన సూర్యులిద్దతేకమయినట్లయిద్దఱును రధములమీద నుండి ప్రకాశించుచుండిరి. ఆమహారధు లిద్దఱును నిర్భయులయి

యొకరినొకరు బాగుగా గొట్టుకొనుచున్నారు. మఱియు వారిద్దఱును పెద్దపులులవలె

 నుండి పోరుచుండిరి. ఒకరిబాణము లొకరిని గప్పగా నగపడకుండ నుండిరి.

అప్పుడు మేఘములు గప్పిన చంద్రసూర్యులవలె నుండిరి. ఒకమాఱు కనుపడుట

యొకమారు కనుపడకుండుటయు గలిగి యుద్ధము చేయుచుండిరి. అట్టిసమయమున రాక్షసుడా దేవలుని భయంకరములగు బాణములతో గొట్టుచు నపసవ్యముగా

జేసెను. దేవలుడు శత్రువు యొక్క జయచిహ్నములను జూచి సహింపక తన

రధమును గూడ నపసవ్యముగజేసెను. మండల విభాగములయందును గతప్రత్యాగతములయందును వారిద్దటికిని ఘోరముగా దొమ్మియుద్ధము జరిగినది. ఒకరినొకరు చంపుదమను నుద్దేశముతో నాకర్ణాంతము బాణముల నాకర్షించి

విడుచుచుండిరి. ఒకరినొకరు విజథునిజేయ సెంచుచుండిరి. తరువాతను మహాస్రములు తెలిసినరాక్షసుడు గొప్పగొప్పయస్త్రములను ప్రయోగింపమొదలిడెను. మునివరులారా ! అప్పుడు మహాఘోరముగా నస్ర యుద్ధము ప్రవర్తించినది. అది ప్రళయాంతమున లోకముల నాశమును సూచించుగ్రహముల

యుద్ధమువలె నుండెను. ఆకాశమంతయు బాణములతో నిండిపోయినది.

బాణముల రాపిడిచే నగ్ని జ్వాలలు పుట్టినవి. నాశసూచకముగా నుల్కలు

పడినట్టున్నది. అప్పు డంతరాళమందున్న సిద్ధులు మొదలుగాగలవా రిట్టియుద్ధ

మెప్పుడును జూచియుండలే దనుకొనిరి. మఱియు నిట్టియుద్ధము ముందు

జరుగబోదనిరి. ఆహా ! వీరి జ్ఞాన మే జ్ఞానము ! పరాక్రమ మంతకు మించినది.

రాక్షసపార్థివులధైర్యము నిరూపమాన మయినది. ఏమీ బాణములప్రయోగించు

నేర్పు ! ఇద్దఱును ఆయకాలపుగాలాంతకుల వలె నున్నారు ! ఇద్దఱు రుద్రులవలె

నున్నారు ! ఇద్దఱు సూర్యులవలె ప్రకాశించుచున్నారు. అని యిట్లనేకవిధములుగా

సిద్ధులు చెప్పుకోమొదలిడిరి. రాక్షసులును దేవతలును సింహనాదములు

చేయుచుండిరి. రాక్షసుడును దేవలుడును నత్యద్భుతముగా యుద్ధము చేయుచు

గన్నుల నుండి నిప్పులు రాల్చుచు నొకరి నొకరు దహింతురాయనునట్లు చూడ

మొదలిడిరి. ఇట్లతిఘోరముగా యుద్ధము జరుగుచుండు సందర్భమున దేవాంగుడు

తన హస్తలాఘనమును జూపుచు నొకబాణముచేతను సారథిని రెండు బాణములచే

ధ్వజమును, నాలుగు బాణములచే గుఱ్ఱములను, అర్ధచంద్ర బాణముచే

వానిధనస్సును దెగగొట్టి ధనుస్సులేని యారాక్షసుని మూడువందల వాడిబాణము

లతో గొట్టెను. అట్లు గొట్టి మఱియొక బాణమాకర్ణాంత మాకర్షించి వానిని

ఖండించెను. ఆరాక్షసుని శిరస్సు శరీరమునుండి వేటై క్రిందబడినది. రత్న

కుండలములతో వెలుగుచున్న యాశిరస్సు భోమధ్యమునుండి పడిన సూర్యబింబము వలె వెలిగినది. ఇట్లు వ్యాఘ్రవక్రుడపడిపోగానే రాక్షసులందఱును భయపడి

 పాతిపోవు చుండగా దేవతలు వెంటదవిలిరి. దేవతలు సంతోషముచే

సింహనాదములు చేయు మొదలిడిరి.పటుపరాక్రమశాలి యగుదేవాంగుని

దేవేంద్రుడతి సంతోషముచే బూజించెను.


 *సశేషం.........*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat