🎻🌹🙏
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌸జటలకు ఒకరూ ఒడలికి ఒకరూ సవతులు పోరాడుతూంటే బాధపడలేక అడవికి పారిపోయి వచ్చావా? చెన్నయ్యతో కలిసినందువల్ల కులం చెడ్డదని లోకులు వెలివేస్తే వచ్చావా?
🌿నంబికి పనులు చేసి చేసి అలసిపోయి ఇక్కడికి చేరావా? లేక నన్ను కాపాడాలని ఇలా వచ్చావా? చెప్పు తండ్రీ! నిజం చెప్పు. అడవినిండా ఇన్ని మృగాలున్నాయి. ఎంతో ప్రమాదమైన స్థలం. రా తండ్రీ!
🌸నా వెంట మా పల్లెకు రా! మంచి పాలూ, పండ్లూ, ఇప్పపూలూ, వెదురుబియ్యం పెడతాను. కాదంటే రుచి రుచిగల మాంసాలు తెచ్చి పెడతాను.
🌿ఇక్కడ ఒంటరిగా వుంటే ప్రేవులు మాడి ఆకలితో చస్తావు.ఈ విధంగా శివుణ్ణి ప్రార్థించాడు. కాని శివలింగం పలుకలేదు. పాపం దేవుడు శోష పోయినట్లున్నాడు.
🌸మాట్లాడే ఓపిక కూడా లేనట్లున్నది. తినడానికి ఏమైనా తెచ్చిపెడతాను అనుకొని అడవికి వెళ్లి మృగాలను వేటాడి మాంసాలు కాల్చి వాటిని దొప్పల్లో పెట్టుకున్నాడు.
🌿నోటి నిండా నీళ్లు తీసుకున్నాడు. బిల్వ పత్రి కోసం పట్టుకోవడానికి వీలులేక తన నెత్తిన జుట్టులో పెట్టుకొని శివలింగం దగ్గరకు వచ్చాడు.
🌸వచ్చి చెప్పు కాలితో లింగాన్ని శుభపరచి నోటి నీళ్లతో అభిషేకం చేసి తెచ్చిన మాంసాన్ని నివేదన చేశాడు.ఈ విధంగా జరిగిన తరువాత ప్రతిదినమూ ఆ శివలింగాన్ని ఉపాసించే ఒక ఋషి అక్కడకు వచ్చాడు.
🌿వచ్చి ఈ మాంసాలను చూచి అసహ్యించుకున్నాడు. ఎవడో మ్లేచ్ఛుడు ఇక్కడ అన్యాయం చేశాడు అనుకొని ఆ పదార్థాలన్నింటిని తోసివేసి శివాలయానికి పంచామృత స్నానం చేయించి వేదోక్తంగా పాదోదకములు చల్లి మళ్లీ శివపూజ చేశాడు.
🌸మరునాడు ఋషి రహస్యంగా దాక్కొని కన్నప్పడు మళ్లీ వచ్చి చేసిన పూజను చూశాడు. చూచి ఇలా అనుకున్నాడు. ‘శివా! ఇదేమి పూజ? ఎట్లా సహిస్తున్నావు దీనిని?
🌿పూర్వం ఒక సాలె పురుగు నీకు తన దారాలతో తలుపులు, వాకిళ్లు గర్భ గృహాలూ, అందమైన పద్మాకార రచనలూ చేసి పూజించేది. దానిని తిరస్కరించి ఒక ఏనుగు సరస్సులోని నీళ్ళతో, కమలాలతో పూజ చేసేది.
🌸అప్పుడు సాలె పురుగు ఏనుగును చూచి కోపించి దాని తొండంలో గుండా దూరి ఏనుగును చీకాకు పరిచి చంపివేసింది. అలాగే నేనూ ఈ క్షుద్రుణ్ణి సంహరిస్తాను అని నిశ్చయించుకొని ఒక చోట దాక్కున్నాడు.
🌿శివుడు ఆ ఋషికి కన్నప్పడి ముగ్ధ భక్త యొక్క గొప్పతనం చూపాలని నిశ్చయించుకొన్నాడు. కన్నప్పుడు మళ్లీ వెనకటివెలే శివపూజకు వచ్చాడు. చెప్పు కాలితో లింగాన్ని శుభ్రం చేశాడు.
🌸పుక్కిటి నీరు ఉమిసి తన
నెత్తిమీది పత్రిని తలవంచి శివుని నెత్తినపడేటట్లు చేసి మాంసాలు నైవేద్యం పెట్టాడు.అప్పుడు ఉన్నట్లు శివుని కంటి వెంట నీరు కారసాగింది.
🌿కన్నప్పడి కాలి తాకిడికి నెత్తిని గంగ జారి కన్నప్పడి పక్కిటి నీరు ప్రసాదోదకమై, ఈ కంటి నీరు కూడా కలిసి త్రివిధమైన ఉదక ప్రవాహాలు త్రిలోచననుని మేన ప్రవహించాయి.
🌸అది చూచి కన్నప్పుడు ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు. ఇదేమిటి శివా! నీ కంటి వెంట నీరు కారుతున్నది. దక్షాధ్వరం నాడు గౌరీ దేవి దహన వార్త విన్ననాడు కూడా నీ కంటి వెంట నీరు కారలేదే! ఎందుకా దుఃఖం?
🌿ఆలుబిడ్డలను వదలి అడవుల పాలైనానని దుఃఖమా? ఒంటివాణ్ణి ఇంకా నాకు దిక్కులేదే అని దుఃఖిస్తున్నావా? నేను ఎంతసేపటికీ రాకపోతే ఆకటి బాధకు తాళేక ఏడుస్తున్నావా?
🌸అని కన్నప్పుడు శివలింగాన్ని కౌగలించుకున్నాడు. నా వంటి కొడుకు నీకు ఉంటే ఇంక దుఃఖేమిటి? ఊరుకో నాయనా- ఊరుకో తండ్రీ! ఊరుకో నాస్వామి! ఊరుకో అని శివుణ్ణి బుజ్జగించి కంటికి ఎన్నో విధాలైన నైవేద్యాలు చేశాడు.
🌿కాని ప్రయోజనం కన్పించలేదు. కంటికి కన్నేన మందు అనినిశ్చయింకొని తన కన్ను తీసి శివలింగానికి పెట్టాడు. అప్పుడాకన్ను నీరు కారడం ఆగి పోయింది. కాని రెండవ కంటి వెంట నీరు ప్రారంభమైంది.
🌸కన్నప్పుడు ఉత్సాసంతో ఒక కంటికి మందు తెలిసిన నాకు రెండవ కన్నుకు తెలియదా ఏమిటి? అని తన చెప్పు కాలిని శివుని కంటికి సమీపంలో గుర్తుగా పెట్టుకొని రెండవ కన్ను కూడా పెరకడానికి సిద్ధపడ్డాడు.
🌿అప్పుడు శివుడు ప్రత్యక్షమై కన్నప్పనికి రెండుకన్నులూ ప్రసాదించాడు. శివుడు కన్నప్పనికి ఇచ్చిన కళ్ళు శివునివి. అంటే కన్నప్పుడు తన కళ్లతో తన రూపాన్ని ఎదురుగా చూచుకుంటున్నాడు.
🌸శివుడు తన కళ్లతో ఎదురుగా వున్న తన రూపాన్ని తానే చూచు కుంటున్నాడు.ఇప్పుడుమళ్లీశివుడిచ్చిన కన్నప్ప దేవుని కన్నుల వెంట నీరు కారాయి. అయితే ఇవి ఆనంద బాష్పాలు.
🌿ఋషి ఈ దృశ్యం చూచాడు. కన్నప్పడూ! నీ ముగ్ధ భక్తికి ముందు నేనెంతవాడిని అని కన్నప్పడికి నేలపై సాష్టాంగ నమస్కారం చేశాడు. పైన దేవదుందుభులు మ్రోగాయి. కన్నప్పని భక్తివలన తిరు కాళహస్తి దివ్య క్షేత్రమైంది.
🌸ఏమి కావాలి కోరుకోమని శివుడు కన్నప్పని అడిగాడు నాకే మోక్షాలూ గీక్షాలూ తెలియవు. నిన్ను నిరంతరం కన్నులతో చూస్తూ వుంటాను.
🌿 నీవు నా కన్నులతో నన్ను చూస్తూ వుండు. ఇదే నా కోరిక అన్నాడు కన్నప్పుడు. శివుడు శ్రీకాళహస్తి క్షేత్రంలో కన్నప్పని కోరికను మన్నించి నేటికీ అలాగే నిలిచాడు.....సశేషం ...🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸