బసవ పురాణం - 26 వ భాగము...!! కళియంబ నయనారు కథ

P Madhav Kumar

 🎻🌹🙏


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌹కళియంబ నయనారు కథ🌹


🌸పూర్వం కళియంబ నయనారు అనే శివభక్తుడు ఉండేవాడు. నిరంతరం శివుణ్ణి నవ్వించడం తన నియంగా పెట్టుకొని ఆ వ్రతం యథావిధిగా నిత్యమూ సాగించి తరించాడు.


🌿సకలేశ్వరు మాదిరాజయ్య కథ

శ్రీ సకలేశ్వరు మాదిరాజయ్యగారనే భక్తుడు ఉండేవాడు. ఆయన వీణా వాదనంతో శివుణ్ణి ఆనందపరుస్తూ అర్చన చేస్తూ వుండేవాడు. 


🌸మల్లరసు అనే రాజు రాజ్యం త్యజించి శ్రీశైలం వద్ద తపస్సు చేసుకుంటూ వుండగా ఆయనను చూడాలని మాదిరాజయ్యగారు శ్రీశైలం వెళ్లారు. 


🌿(ఇక్కడ శ్రీశైల వర్ణన సుదీర్ఘంగా పాల్కురికి చేశాడు) అక్కడ చెట్లన్నీ రుద్రాక్ష చెట్లే. అక్కడి గనులన్నీ విభూతిగనులే. అక్కడి నీళ్లన్నీ లింగ తీర్థములే. 


🌸అక్కడి సమస్త సృష్టీ శివ పూజామయమే. అటువంటి చోటికి వచ్చి మల్లరుసు కోసం వెదుకసాగాడు. మల్లికార్జునాచార్యుడుమాదిరాజయూను పరీక్షించాలని తన దేహాన్ని భూమ్యాకాశాలు పట్టనంతగాపెంచాడు.


🌿మాదిరాజయ్య మల్లికార్జునుని తల కోసం మూడేళ్లు ప్రయాణం చేసి అలసిపోయాడు. పాదాభివందనం చేయకుండా ఉండడమెట్లా అని 


🌸మల్లికార్జునుని పాదాల కోసం మాదిరాజయ్య ప్రయాణం చేసి ఎనిమిదేళ్లు నడచి విసిగిపోయాడు. అప్పుడు భయభ్రాంతుడై స్వామీ! మిమ్మెరుగ నేనెంతవాడిని అని ప్రణామం చేశాడు. 


🌿మల్లికార్జునుడు చిరునవ్వు నవ్వి తన మామూలు రూపం ధరించి మాదిరాజును ఆదరించాడు. మాదిరాజు తాను అక్కడనే ఉండాలని కోరికను వ్యక్తపరచాడు. 


🌸మల్లికార్జునుడు మాదిరాజయ్యను ఒక తుమ్మ చెట్టుగా మార్చి నిశ్చలంగా తపస్సు చేసుకోమన్నాడు. మాదిరాజు తపసు చేసుకుంటున్నాడు. 


🌿ఒకనాడు మల్లికార్జునుడు గొల్లని వేషం ధరించి వచ్చి తుమ్మ కొమ్మలు కొట్టబోగా ఒరే! గొల్లడా! నీకు బుద్ధిలేదా’ అని మాదిరాజు తుమ్మచెట్టు రూపంలోనే ఉండి కోప్పడ్డాడు. 


🌸అప్పుడు గొల్లని రూపం వదిలి మల్లికార్జునుడు ‘నీవేమి తపసివి! కోపం పోలేదే’ అని పరిహసించాడు. మాది రాజయ్య దుఃఖించాడు. మల్లయ్య మాదిరాజును కౌగలించుకొని ఆయనకు మామూలు రూపమిచ్చి భూమి మీదికి బసవడనే భక్తుడు వచ్చి వున్నాడు. 


🌿నీవు అక్కడికి పోయి ఆయనతో కలిసి గోష్ఠి చేయవలసిందిఅనిచెప్పాడు. మాదిరాజు మల్లయ్యకు శరణు చేసి శ్రీగిరినుండి కల్యాణం వచ్చి అక్కడ బసవన్నను కలిశాడు. 


🌸బసవన్న మాదిరాజును ఆదరించి సమస్త పూజలతోనూ తృప్తిపరిచాడు.

శంకరదాసి కథ(చతుర్థాశ్వాసం బసవన్నకుమాచయ్య చెప్పిన కథ)

పూర్వం శంకరదాసి అనే శివభక్తుడు ఉండేవాడు. 


🌿కాయకంతో ధనం సంపాదించి జంగమార్చన చేసేవాడు. ఇలా ఉండగా ఒకనాడు దేడర దాసయ్య అనే భక్తుడు శంకర దాసి ఇంటికి వచ్చి చూచి అయ్యో! ఇతని ఇంట్లో ఒక్క ధాన్యపు గింజ కూడా లేదే! 


🌸ఈ పేదరికం ఎలా భరిస్తాడు? అని భావించి దుగ్గళవ్వకు చెప్పి గంపెడు ధాన్యం పంపాడు. తర్వాత శంకరదాసి వచ్చి ఈ సంగతి తెలుసుకొని చిరునవ్వు నవ్వి ఆ ధాన్యాన్ని తన గుప్పెట్లోకి తీసుకున్నాడు. 


🌿ధాన్యమంతా గుప్పెట్లో మాయమై పోయింది. ఇది చూచి దుగ్గళవ్వ శంకరదాసి మహాత్ముడు. ఆజ్ఞతతో ఆయనకు ధాన్యం పంపడం మనదే తప్పు. శివుణ్ణి మెప్పించి మూడవ కన్ను బడసినవాడు శంకరదాసి. 


🌸జగదేకమల్లుడు అనేవాడు శంకరదాసిని పరీక్షిద్దామని కల్యాణ నగరం నడి వీధిలో ఉక్కుతో విష్ణు ప్రతిమ చేసి దానిపై పంచలోహాల పోత పోసి నిలిపాడు. అయితే శంకరదాసి దృష్టి సోకగానే ఆ ప్రతిమ ముక్కలై పేలిపోయిందిఅని చెప్పింది. 


🌿అప్పుడు దేడర దాసయ్య, దుగ్గళవ్వ శంకరదాసి పాదాలపై బడి తమ అహంకారాన్ని మన్నింపుమని వేడారు. శంకరదాసి చిరునవ్వు నవ్వి ఒక చోట నేల త్రవ్వమని చెప్పాడు. అక్కడ తవ్వేసరికి భూమిలో నుండి నిధి నిక్షేపాలు బయటకు వచ్చాయి.


🌸దానితో దేడర దాసయ్య, దుగ్గళవల్ల గర్వరహితులైనారు.సిరియాలుని కథ

(చతుర్థ- మాచయ్య బసవనికి చెప్పినది)కంచిలో సిరియాలుడనే భక్తుడు ఉండేవాడు. 


🌿ఆయన సెట్టి. ఈయననే చిరుతొండడనీ అంటారు. నిత్యమూ ఐదుగురు జంగమయ్యలను అర్చించి లింగావసరం తీర్చకుండా తాను భోజనానికి కూర్చునేవాడు కాడు. ఇలా వుండగా పరమేశ్వరుడు సిరియాలుణ్ణి పరీక్షింపదలచాడు....సశేషం..🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat