🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌸జంగమ వేషం ధరించి వచ్చాడు. సిరియాలుడు తపసిని అర్చించి తన గృహానికి రమ్మన్నాడు. నాకు నరమాంసం కావాలి అని తపసి అడిగాడు. అంతే కదా! రండి.
🌿మీకు ఎట్టి నియమాలున్నా నెరవేరుస్తాను అని సిరియాలుడు పిలిచాడు. తపసి సిరియాలుని ఇంటికి వచ్చాడు. ఈలోపల సిరియాలుడు లోపలికి వెళ్లి తన భార్యకీ సంగతి చెప్పాడు.
🌸సంగళవ్వ ఏమీ విచారపడకుండా చదువుకోవడానికి పోయిన తన కొడుకును పిలిచింది. కొడుకు వచ్చాడు. ‘ఇవ్వాళ మన ఇంట్లో పండుగ’ అని చెప్పి కొడుకుకు వధ్య శృంగారం చేసి తల్లీ దండ్రీ ఇద్దరూ కలిసి కొడుకును చంపారు.
🌿ఆ మాంసం వండి ఇతరులెరుగకుండా తపసికి పెట్టారు.
ఏమయ్యా ఇందులో తలను వండినట్లు లేదు అని అడిగాడు తపసి.వెంట్రుకలు వస్తాయని వండలేదు.
🌸ఇదుగో క్షణంలో వండి తెస్తాము అని వెళ్లి వారు తల కూడా వండి తెచ్చి వడ్డించారు. బాగుంది. ఇప్పుడు సహపంక్తి లేకుండా నేను భుజించను, రమ్మన్నాడు.
🌿సంగళవ్వ భయభ్రాంతురాలైంది.
సిరియాళుడు మాత్రం ధైర్యంగా పదమన్నాడు. అంతా భోజనానికి కూర్చున్నాడు. తపసి ‘సెట్టీ! నీ కొడుకును కూడా పిలువు, భోజనానికి!’ అన్నాడు.
🌸వాడెక్కడికో ఆడుకోవడానికి పోయి వుంటాడు’ అని మాట తప్పించాడు సిరియాళుడు. ‘అదెట్లా! నీ కొడుకు సరసన లేకుంటే నేను భుజించను పిలువు’ అన్నాడు.
🌿సంగళవ్వ ‘నాయనా! రమ్మని పిలిచింది దుఃఖంతో. వెంటనే చిన్న కూకటి జుట్టుతో చెవులకు కుండలాలతో పరుగెత్తుకుంటూ కొడుకు వచ్చాడు. శివుడు సిరియాళ దంపతులకు సాక్షాత్కరించాడు.
🌸సెట్టి కుటుంబం పార్వతీ పరమేశ్వరులకు శరణు చేసింది. శివుడు వారిని తన వెంట కైలాసానికి తీసుకొనిపోయాడు.
🌷నిమ్మవ్వ కథ
🌸(చతుర్థ- మాచయ్య బసవనికి చెప్పినది)పూర్వం నిమ్మవ్వ అనే భక్తురాలుండేది.
🌿ఆమె భక్తిని పరీక్షింపదలచి, సిరియాలునికి ‘నన్ను మించిన త్యాగిలేడు’ అనేగర్వం తగ్గించదలచీ, శివుడు సిరియాలుని వెంటబెట్టుకొని మారువేషంలో నిమ్మవ్వ ఇంటికి వచ్చాడు.
🌸నిమ్మవ్వ జంగమయ్యలకు వంట మొదలుపెట్టింది. ఇంతలో నిమ్మవ్వ కొడుకు వచ్చాడు. అతడు శివశరణుల ఇండ్లలోని గొడ్లు కాయడం కాయకంగా స్వీకరించిన వాడు.
🌿అలసిపోయి ఆకలితో వచ్చిన నిమ్మవ్వ కొడుకు బూరెలు సిద్ధం కావడం చూచి ఒక బూరెను తిన్నాడు. నిమ్మవ్వ అది చూచి కుక్కా! శివ నైవేద్యం కాకుండానే నీవు ఎంగిలి చేశావా?’
🌸కట్టెతో తల పగలగొట్టి చంపింది. మరుక్షణమే ఆ శవాన్ని ఆవతలకి లాగి గడ్డిలో దాచి ఏ మాత్రం మోహం లేకుండా వచ్చి అయ్యలను అర్చనకు పిలిచింది.
🌿చూచావా! చిరుతొండనంబీ! నిమ్మవ్వ భక్తి’ అని శివుడు చిరుతొండనికి ప్రత్యక్షంగా ఇది చూపాడు. తర్వాత ‘నిమ్మవ్వా! నీ కొడుకును కూడా భోజనానికి పిలు’ అన్నాడు శివుడు.
🌸అప్పుడు నిమ్మవ్వ ఇలా అన్నది.
ఏమయ్యా! శివుడా! నీ మాయలు నా దగ్గర సాగవు. జాగ్రత్త. చచ్చిన కొడుకు సహపంక్తికి ఎలా వస్తాడు? వాడు శివద్రోహి, చంపాను.
🌿అంతే. నాకేదో కైలాసం ఆశ జూపి సిరియాలుణ్ణి చేసినట్లు నన్ను చేద్దామనుకుంటున్నావేమో. నాకు నీ కైలాసం అక్కర్లేదు. ఏమీ అక్కర్లేదు. భోంచేయకుండా కదిలావో చూసుకో ఏం చేస్తానో’ అని బెదిరించింది.
🌸అది చూచి శివుడు సిగ్గుపడ్డాడు. శివుడు తన నిజరూపం చూపించాడు. నిమ్మవ్వ నవ్వి ‘గుండయ్య ఇంటికీ, భోగయ్య ఇంటికీ, దాసయ్య ఇంటికీ ఏ నిజ స్వరూపంతో వెళ్లావు?
🌿మానకంజారుని ఇంటికీ, చిరుతొండని ఇంటికీ నిజరూపంతో వెళ్లావా? అప్పుడు లేని చమత్కారం ఇప్పుడెందుకు చూపుతున్నావయ్యా స్వామీ!’ అన్నది.
🌸శివుడు మారు మాట్లాడలేక సిరియాలునితో సహా నిమ్మవ్వ పెట్టిన విందు ఆరగించాడు. తర్వాత నిమ్మవ్వ కొడుకును బతికించి కైలాసాన్ని ఇచ్చాడు.
🌿నిమ్మవ్వ మాత్రం ‘మోక్షంకన్నా నాకు జంగమ లింగ పూజనమే’ ఇష్టమని కైలాసాన్ని కూడా తిరస్కరించింది.
🌷నరసింగ నాయనారు కథ
🌸(శివుడు సిరియాలునికి చెప్పిన కథ)
పూర్వం నరసింగ మొన్నయనారు అనే చోళరాజు ఉండేవాడు. ఆయన పట్టమహిషి శివపూజకు పోయింది.
🌿దోవలో పూజా పుష్పాలలో ఒకదాన్ని వాసన చూచింది. పూజారి చూచాడు. పట్టమహిషి రాగానే పూజారి పిల్లవాడు ఆమె ముక్కును కోసివేశాడు.
🌸ఈ విషయం చోళరాజుకు తెలిసింది. ఆయన పరుగు పరుగున వచ్చి పూజారిని పట్టుకున్నాడు.నేనేం తప్పు చేశాను?...సశేషం...🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸