*🌹#వాడపల్లి #శ్రీ #వేంకటేశ్వర స్వామి తీర్థం🙏*

P Madhav Kumar

తూర్పు గోదావరి జిల్లాలోని ఆత్రేయపురం  నుండి నుండి 6 కి.మీ దూరంలో ఉంటుంది ఈ గ్రామం.

ఈ ఆలయం ఏంతో ప్రసిద్ధి చెందిన ఆలయం ఈ ఆలయాన్ని కోనసీమ_తిరుపతి అని కూడా అంటారు.
ఈ ఆలయ విశేషాలు చూస్తే తల్లి గోదారమ్మ  రెండు పాయలుగా విడిపోయి ఒకటి వశిష్ఠ మరొకటి గౌతమి పాయలు గా పయనిస్తోంది. పచ్చని కోనసీమలో గోదావరి నది ఒడ్డున గౌతమి పాయ నందు వాడపల్లి గ్రామంలో శ్రీ మహావిష్ణువే వెంకటేశ్వర స్వామి వారి అవతారంలో ఇక్కడ స్వయంభూ వెలిసారు.

వాడపల్లి గ్రామాన్ని పూర్వం " నౌకాపురి "  అని పిలిచేవారు. నది ఒడ్డున వెలసిన స్వామి వారిని నారద మహర్షి వారు కనుగొని తన స్వహస్తలలో ప్రతిష్టించి వెంకటేశ్వరునిగా నామకరణం చేశారు. గోదావరి నదిలో వరద ముంచెత్తడం వలన నారదుడు నిర్మించిన ఆలయం నది గర్భంలో కలిసిపోయింది. ఆ రోజుల్లో పినుబోతు గజేంద్రుడు అను వారు కొన్ని పడవలకు అధిపతిగా ఉండేవారు ఒకసారి పెద్ద తుఫాన్ సంభవించడంతో ఆ పడవలు అన్ని సముద్రంలో కలిసిపోగా ఆయన స్వామి వారిని వేడుకున్నాడు స్వామి నా పడవలు సముద్ర గర్భం నుండి తీయిస్తే నిన్ను గోదావరి నది నుండి వెలికి తీసి నీకు ఆలయం నిర్మించి ప్రతిష్టిస్తాను అని అనగా ఆ మరుసటి రోజు నౌకలు అన్ని నది ఒడ్డుకి చేరడంతో అన్న మాట ప్రకారం స్వామి వారికి ఆలయాన్ని నిర్మించారు. కాలక్రమేనా ఆలయ పూజలు అర్చకులకు భారంగా ఉండటం వలన స్వయంగా స్వామి వారు పెద్దాపురం  సంస్థాన రాజు అయిన రాజా శ్రీ వత్సవాయి పెమ్మ  గజపతి మహారాజు గారికి కలలో కనిపించి దైవ సమాన పూజలతో నువ్వు పునితుడవు అయితే వైకుంఠమునకు చేరువుతావు అని చెప్పగా ఆయన స్వామి వారి గురించి అడిగి తెలుసుకుని వాడపల్లి కి చేరి స్వామి వారి నిత్య నైవేద్య  పూజల నిమిత్తం 1759 వ సంవత్సరంలో రాజు గారు వారి ఆస్తి 270 ఎకరాలు స్వామి వారికి సమర్పించారు. ఈ క్షేత్రం మూల విరాట్ రాతితో చేసినది కాదు చెక్కతో చేసినది.

ఇక్కడ ఏడు వారాలు వ్రతం చేసి ఎనిమిదవ వారం అభిషేకం చేసుకుంటే చాలా మంచిది అని నమ్మకం అందుకే ప్రతి స్థిరవారం ( శనివారం ) ఈ ఆలయానికి సుమారు 50 వేల కు పైనే భక్తులు విచ్చేస్తారు. ఎంతటి కష్టాలు అయిన సరే స్వామి వారిని 7 స్థిరవారాలు దర్శిస్తే ఆ కష్టాలు తొలగిపోతాయి అని బలమైన నమ్మకం.

ఈ ఆలయంలో స్వామి వారికి కుడి వైపున వేణుగోపాల స్వామి వారు, ఉత్తరం వైపు అలివేలుమంగతయారు అమ్మవారు, ఆగ్నేయంలో శ్రీ రామానుజులు వారు వారి శిష్యులు, దక్షిణం వైపు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారు దర్శనం ఇస్తారు మనకి.

ప్రతి శనివారం ఈ ఆలయంలో 108 లేదా 7 ప్రదక్షిణాలు చేసే వారి సంఖ్య వేలల్లో ఉంటుంది.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat