🎻🌹🙏 బసవ పురాణం - 28 వభాగము ...!!

P Madhav Kumar


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌸ఈమె శివాపచారం చేసింది కదా!’ అన్నాడు పూజారి బాలుడు భయపడుతూ.పూజారీ! నీవు తప్పే చేశావు. 


🌿ఆమె శివపూజా ద్రవ్యాన్ని ముక్కుతో వాసన చూడకుండా చేతితో కదా పుష్పాన్ని అందుకున్నది. కాబట్టి ముందుగా తప్పు చేసింది చెయ్యి ముక్కు కాదు. 


🌸అందుకని చేతిని నరకకుండా ముందు ముక్కునెందుకు నరికావు?’ అని నరసింగ నయనారు పెద్ద కత్తితో పట్టమహిషి చేతిని నరికివేశాడు. జనం దిగ్భ్రాంతులైనారు. 


🌿మరుక్షణమే శివుడు ప్రత్యక్షమై పట్టమహిషికి ముక్కునూ చేతినీ ప్రసాదించాడు. నరసింహనాయనారుకు సామీప్య ముక్తిని ఇచ్చాడు.


🌸కొట్టరువుచోడని కథ

(శివుడు సిరియాలునికి చెప్పినది)

పూర్వం ఒక చోడరాజు పట్టమహిషి గర్భిణీ అయి వుంది. శివనైవేద్యానికై వండిన పదార్థాన్ని నోరూరి నివేదనకు ముందే ఆమె ఆరగించింది. 


🌿అది తెలిసి కొట్టరువు చోడడు కోపగించి ‘శివ నైవేద్యం కాకుండా శివునికై వండిన పదార్థం నీ గర్భంలో ప్రవేశించింది కాబట్టి ఈ గర్భం అపవిత్రమైంది’ 


🌸అని ఆమె కడుపును కోయడానికి ప్రయత్నించాడు. వివుడు వెంటనే ప్రత్యక్షమై వాని భక్తికి మెచ్చి మోక్షమిచ్చాడు.


🌿హలాయుధుని కథ

పూర్వం హలాయుధుడనే రాజు ఉండేవాడు. శివుడు, సిరియాలుడు భక్తవేషాలతో హలాయుధుని నగరానికి పోయారు. 


🌸హలాయుధుడు మహేశ్వరులకు మ్రొక్కి అర్చించాడు. అప్పుడు హలాయుధుడు సిరియాలుని భక్తి కథను విన్పించాడు. హలాయుధుడది విని కోపించి ‘ఇది భక్తి కాదు దారుణం. 


🌿శివుడేమి రాక్షసుడా నరభక్షణ చేయడానికి? భక్తుడైన ఆ శిశువును చంపిన తండ్రి, సిరియాలుడేమి మనిషి? అని నిందించాడు.


🌸అది విని శివుడు సిరియాలుని ఘనతను భక్తి కూటములు పాటలుగా కట్టి పాడుతున్నారు. కవులు గద్య పద్య కావ్యములు వ్రాస్తున్నారు. 


🌿సాంగ భాషాంగ క్రియాంగ నాటకములుగా ఆడుతున్నారు. అలాంటిదినువ్వువిమర్శిస్తున్నా వేమిటి? అని ప్రశ్నించాడు. దానికి హలాయుధుడు కోపించి ఇలాఅన్నాడు. 


🌸శివుడు దేవుడైతే మాంసం ఎందుకడిగాడు? సిరియాలుడు భక్తుడైతే భక్తుడైన కొడుకును ఎందుకు చంపాడు? సిరియాలుడు కోమటి. 


🌿కోమటి బుద్ధి పోనిచ్చుకున్నాడు కాడు. ముక్తిమీద ఆశతో కొడుకును కూడా చంపాడు. పోనీ శివుడైనా ఏమి బుద్ధిమంతుడు? పరీక్షకే అనుకుంటే సిరియాలుడు కత్తి ఎత్తగానే ఇక చాలు అని ఆపి వుండవలసింది. 


🌸అట్లా కాక చంపనిచ్చి ఆ మాంసం కూడా వడ్డింపమన్నాడు. సిరియాలుడు అంత గొప్పవాడైతే తనను తాను వండుకొని ఎందుకు సమర్పణ చేసుకోలేదు? కాబట్టి సిరియాలునీ, శివుణ్ణీ నేను వెలివేస్తున్నాను. 


🌿అంతేకాదు, వారిని గూర్చిఎవరు ముచ్చటించినా వారికి అస్పృశ్యత వస్తుంది అని హలాయుధుడు వెలిబెట్టాడు.అది విని కైలాసంలోని పార్వతీదేవి వణికిపోయింది. 


🌸సంగళవ్వను వెంటబెట్టుకొని పరుగు పరున వచ్చి మా భర్తలపై వెలిని తీసివేయమనిప్రార్థించింది.హలాయుధుడు దయతో సిరియాలునికీ శివునికీ పెట్టిన వెలిని తీసివేశాడు. 


🌿హలాయుధుని భక్తి ప్రమథులంతా కీర్తించారు. శివుడు హలాయుధుణ్ణి దివ్యవిమానంలోకైలాసానికితీసుకొనిపోయాడు.


🌷మిండనైనారు కథ


🌸(చతుర్థ - మాచయ్య బసవనికి చెప్పినది)పూర్వం మిండనయనారు అనే భక్తుడు ఉండేవాడు. ఆయన శివరాత్రి నియమం పన్నెండు సంవత్సరాలు వరుసగా కలిపి 

పదమూడవ సంవత్సరంలో తిరువాలూరులోని 


🌿వాల్మీకేశుని గుడికి వె ళ్లి జా గారం చేసి సద్భక్తసమూహంతో గోష్ఠిలో ఉన్నాడు.అప్పుడు ఒడయనంబి అనే పాలకుడు వందిమాగధులు పొగుడుతుండగా వాల్మీకేశుని గుడికి వచ్చాడు. 


🌸అయితే అక్కడ కూర్చున్న భక్తులనెవరినీ గౌరవించలేదు. అది చూచి మిండనయనారు ‘వీడెవడు? భక్తులంటే గౌరవం లేదు అని కోపగించు కున్నాడు. అమ్మా!ఆయనను ఏమీ అనకండి. 


🌿వాల్మీకేశుడు ఈయన భక్తికి పాటకూ మెచ్చి నిత్యపడి వేయి మాడలు ఇస్తుంటాడు. అంతటి గొప్పవాడు’’ అని ఒడయనంబి గూర్చి అక్కడివారు చెప్పారు.


🌸అది విని మిండనయనారు కోపించి ఇంతటి గర్విష్ఠిని గౌరవించిన ఆ వాల్మీకేశుడెంతటి పనికిమాలినవాడు? ఈ క్షణంనుంచి నేను వాల్మీకేశునికీ ఒడయనంబికి వెలిపెట్టుతున్నాను’ అని గంట వాయించాడు.


🌿మిండనయనారు గొప్పతనం సమాజానికి ప్రదర్శింపదలచి వాల్మీకేశుడు సాకారుడై గుడినుండి పారిపోయాడు. ఒడయనంబి ఇదేమిటని అడిగితే ఆభక్తునికి నేను ప్రాణం...ఇంకా ఉంది....🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat