🎻🌹🙏బసవ పురాణం - 29 వ భాగము....!!

P Madhav Kumar


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌸నాకు భక్తుడు దేహం. భక్తుల కోపం నేనెలా భరించగలను?’’ అన్నాడు. ఒడయనంబికి జ్ఞానోదయమైంది. వెళ్లి మిండనయనారు పాదాలపై పడ్డాడు. వాల్మీకేశుడు మిండనయనారుకు సద్భక్త గణానికీ కైలాస ప్రాప్తినిచ్చాడు.


🌷బాణుని కథ


🌿వీరమాహేశ్వర వ్రతంగల బాణుడు చేసే శివపూజలకు రెండు చేతులు చాలవని వేయి చేతులిచ్చాడు శివుడు. అది విని జనం తండోపతండాలుగా రాసాగారు. వారివల్ల బాణుని పూజలు భగ్నం కాకుండా శివుడు తానే బాణుని వాకిటికి కాపలా కూర్చున్నాడు.


🌷పిట్టవ్వ కథ


🌸ముదిగొండ అనే నగరంలో కరికాలమండలేశ్వరుడు కావేరీకి కట్ట కట్టిస్తుంటే పిట్టవ్వకు బదులు ఆమె భక్తికి మెచ్చిన శివుడు తానే వెట్టికిపోయాడు.


🌷కలికామదేవుని కథ


🌿కలికామదేవుడనే భక్తుడు ‘‘అక్కటా! శివునికి ఒడయనంది వెట్టిచాకిరి పెట్టించాడట!’’ అని కోపగించి ఎవరైనా సరే ఒడయనంబిని ప్రశంసిస్తే చాలు చంపడం మొదలుపెట్టాడు. 


🌸అప్పుడు శివుడు స్వయంగా వెళ్లి కాలికామదేవుణ్ణి శాంతపరిస్తే తప్ప లాభం లేకపోయింది.


🌷ఎణుమూర్తినయనారు కథ


🌿పూర్వం ఎణుమూర్తినయనారు అనే భక్తుడు శివార్చనకై నిత్యం శ్రీగంధం వాడుతూ ఉండేవాడు. కొంతకాలానికి సమస్త గంధానికీ ధనం అయిపోయింది. అయినా ఎణుమూర్తి దిగులుపడలేదు. 


🌸భక్తి ధనమే ధనం. భక్తిలేమియే లేమి. ఈ తనువూ, ఈ మనమూ ఉన్నప్పుడు నీ పూజకు లోపం జరుగుతుందా తండ్రీ’అని ఎణుమూర్తి తనమోచేతినే గంధం చెక్కగా చేసి సానకు పెట్టి చాచాడు. 


🌿చర్మం నలిగి రక్తం వచ్చి కండలు వెలికివచ్చినా గంధం తీయడం మానలేదు. శివుడు ప్రత్యక్షమై ఎణుమూర్తి నయనారు భక్తికి మెచ్చి కైలాసమిచ్చాడు.


🌷కడమలనంబి కథ


🌸పూర్వం కడమలనంబి అనే భక్తుడు ప్రాణలింగానికి నిత్యం వెయ్యి అఖండాలు వెలిగించే వ్రతం పెట్టుకున్నాడు. వెయ్యి అఖండాలు నిరంతరం వెలుగడంతో ఆయన ఆస్తి మొత్తమూ హరించుకొనిపోయింది. 


🌿అయితే నంబి విచారపడలేదు. ‘్ధనము పోతేనేమి. తనువు ఉన్నది కదా, శివపూజ కేమి ఆటంకం అని తన శరీరానే్న అఖండంగా మార్చి జట్టుకు నిప్పు అంటించుకున్నాడు. శివుడు ప్రత్యక్షమైకడమలనంబినిఅనుగ్రహించాడు.


🌷గుగ్గులుకళియారు కథ


🌸పూర్వం గుగ్గులుకళియారు అనే భక్తుడు మూడు పూటలాస్వామికి ధూపం వేసే నియమం పెట్టుకున్నాడు. అందుకు సమస్త ధనమూ అయిపోయా భార్య మంగళసూత్రాలు అమ్మి నియమం చెల్లించాడు. 


🌿అది చూచి ఉరగేశ్వరస్వామి, ఉరగకన్యకలూ ఆనందంతో నాట్యం చేశారు. ఫలితంగా విగ్రహాలు వంగాయి. నగరినేలే రాజుఅందుకుచింతాక్రాంతుడై ఎన్నో ఉపాయాల విగ్రహాలను చక్కజేయజూచాడు కాని లాభం లేకపోయింది. 


🌸అప్పుడు గుగ్గుళుకలియారు ‘ప్రభూ! నాకు ధూపం ఇవ్వండి. స్వామివారిని చక్కబరుస్తాను’ అన్నాడు. ప్రభువు వద్ద పెద్ద గుగ్గిలపు కుప్ప పోశాడు. కళియారు ధూపం వెలిగించాడు. 


🌿ఒక తాడును తీసుకొని దానికి ఒకవైపు స్వామిని కట్టి రెండవవైపు ఒక కత్తిని కట్టి కత్తిని తనగొంతు మీద ఉంచుకొని తాడును లాగసాగాడు. 


🌸అంటే స్వామి విగ్రహం లేవకపోతే కత్తిని గొంతులో గుచ్చుకుంటానని స్వామి కళియారుచూపించాడన్నమాట. అది చూచి ఉరగేశ్వరస్వామి భయపడి భక్తుణ్ణి కాపాడాడు. విగ్రహాలు యథాస్థానానికి వచ్చాయి.


🌷అరివాళునయనారి కథ


🌿పూర్వం అరివాళు నయనారు అనే భక్తుడు ఉండేవాడు. నిత్యం శివునికి రాజనాల బియ్యం వండి నైవేద్యం చేయడం నియమంగా పెట్టుకున్నాడు. ఈ నివేద్యాలతో అతని ఆస్తి మొత్తం హరించుకొనిపోయింది.


🌸 అప్పుడు కొడవలి చేత పట్టుకొని కూలికి వెళ్లి ఆ వచ్చిన ధనంతో శివావసరం నెరవేర్చేవాడు. కొంకాలానికి కూలిదొరకడం ఆగిపోయింది.అందువల్ల వరుసగా ఏడు దినాలు ఉపవాస మున్నాడు. 


🌿ఎనిమిదవనాడు తరుగలిలో మిగిలిన బియ్యం గింజలు ఏరుకోని వాటితో వంట చేద్దామని వస్తుండగా జారిపడ్డాడు. ఆ బియ్యం నేల పగుళ్ళలో పడిపోయంది. ‘


🌸శివా! నీకు నైవేద్యం చెల్లించలేని ఈ జన్మ నాకెంకు?’’ అని అరివాళు నయనారు కొడవలితో గొంతు కోసుకోబోయాడు.పరమేశ్వరుడు ప్రత్యక్షమైనయనారునుఅనుగ్రహించాడు...సశేషం....🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat