🎻🌹🙏బసవ పురాణం - 30 వ భాగము.....!!

P Madhav Kumar



🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌷అడిభర్తుని కథ


🌸పూర్వం పాండ్య మండలంలో అడిభర్త అనే జాలరి ఉండేవాడు. అతడు రోజూ తన వేటలో దొరికిన మొదటి చేపను ‘శివార్పణ’మని వదిలి 

మిగిలినవి తీసుకొని పోయేవాడు. 


🌿ఒకనాడు అడిభర్త వలలో బంగారు చేప పడింది. బంగారమని ఆశపడక శివార్పణమని దానిని మళ్లీ నీళ్లలో వదిలాడు. మరునాడు వలవేస్తే మళ్లీ అదే చేప వలలో పడింది. 


🌸మళ్లీ దానిని నీళ్ళల్లో వదిలాడు. ఇలా ఎన్నిసార్లు వలవేసినా శివార్పితమైన బంగారు చేపయే పడసాగింది. ఇలా కాదని ఆ రేవు, చెరువు వదిలి వేరే సరస్సుకు పోయాడు. 


🌿ఎక్కడ వలస వేసినా అదే చేప పడసాగింది. అప్పుడు అడిభర్త చిరునవ్వు నవ్వి ‘ఇది శివుడికిచ్చిన చేప. ఈసారి మళ్లీ అదే వలలో పడితే ఇక జీవితంలో నేను వలముట్టను. 


🌸నిరాహారినై ఆత్మత్యాగం చేస్తాను’ అని ప్రతిజ్ఞ పట్టి మళ్లీ వల విసిరాడు. ఈసారి వలలో బంగారు చేపకు బదులు చతుర్భుజములు, త్రినేత్రములు నంది వాహనమూ కల పరమశివుడే పడ్డాడు. శివుడు అడిభర్తను దీవించి వరాలిచ్చాడు.


🌷ఏణాదినాథుని కథ


🌿పూర్వం ఏణాదినాథుడనే శివభక్తుడు ఏలాపురమును పాలిస్తూ ఉండేవాడు. ఆయన జంగమారాధనను శత్రువులు గ్రహించి ఒక దళవాయికి జంగముని వేషం వేసి పంపారు. 


🌸దళవాయి రాగానే ఏణాదినాథుడు ఆయన పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. ‘ఇంకెక్కడికి పోతావురా’ అని దళవాయి కత్తితో ఏణాదినాథుని మెడను నరకసాగాడు. 


🌿దళవాయి వేసే ప్రతి దెబ్బా ఏణాదినాథుని మెడమీద పూలదండగా పడింది. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఏణాదినాధుణ్ణి దీవించాడు.


🌷చేదివల్లభుని కథ


🌸చేదివల్లభుడు కూడా శివభక్తులను శివునిగానే భావించి అర్చించేవాడు. అతని శత్రువులు కూడాపదముగ్గురు యోధులకు భక్తుల వేషాలు వేసి పంపారు. 


🌿వారిని చేదివల్లభుడు అర్చిస్తుండగా సమయం చూచి వారు శస్త్రాస్త్రాలు తీసుకొని చేదివల్లభుని మీద పడ్డారు. అయినా సరే చేదివల్లభుడు వారి పాదాలను వదలలేదు. శివుడు ప్రత్యక్షమై చేదివల్లభుని ఆశీర్వదించాడు.


🌷కరయూరిచోళుని కథ


🌸కరయూరిచోడుడు శత్రు రాజులను వధించి వారి తలలు తీసుకొని వస్తుండగా నెత్తుట తడిసిన ఒక తలపై వెంట్రుకలు జడ కట్టాయి. 


🌿అది చూచి శివయోగిని చంపానని భ్రమించి కరయూరిచోడుడు దుఃఖించి తలనీలాలు నరికి ఆ తలమీద పెట్టబోగా శివుడు ప్రత్యక్షమై చోడుణ్ణి దీవించి మోక్షమించాడు.


🌷కలియంబనయనారు కథ


🌸కళియంబనయనారు అనే శివభక్తుని ఇంట మల్లయ్య అనే సేవకుడు ఉండేవాడు. అతడు పనిచేయడానికి విసిగిపోయి లింగధారియై తిరిగి వచ్చాడు. 


🌿శివరూపుడై వచ్చిన సేవకుణ్ణి చూచి కళియంబనయనారు ఎదురేగి స్వాగతం చెప్పి భార్యను పాదోదకం తీసుకురమ్మని కోరాడు. భార్య అది చూచి ‘ఓరోరి! వీడు మన సిరియక్క కొడుకు మల్లడు.


🌸వీడికి పాదోకమేమిటి?’ అని ఎగతాళి చేసింది. శివదూషణ సహింపలేక కళియంబ నయనారు భార్య చేతులు నరికాడు. శివుడు ప్రత్యక్షమై ఆమెకు తిరిగి చేతులిచ్చి నయనారు భక్తికి మెచ్చి ప్రమధత్వమిచ్చాడు.


🌷అంగుళిమారయ్య కథ


🌿అంగుళి మారయ్య అనే శివభక్తుడు జంగములకోసం తన సమస్తం అర్పించి దరిద్రుడైనాడు. శివుడతణ్ణి పరీక్షించడం కోసం ఒకనాడు అర్థరాత్రి వర్షంలో తడుస్తూ శివయోగి రూపంలో వచ్చి నిలబడ్డాడు. 


🌸మారయ్య శివయోగిని చూచి ‘అయ్యో! శివుడు చలికి వణుకు తున్నాడు’ అని బాధపడి తన ఇంటికి నిప్పంటించుకొని చలిమంట వేశాడు. ‘ఆకలి’ అన్నాడు శివయోగి. 


🌿పొట్టులో మిగిలిన గింజలుంటే వాటిని తెచ్చి కడిగి పిండి కాచి యోగికి పెట్టాడు. శివుడు వారి భక్తికి మెచ్చి సాయుజ్యమిచ్చాడు.


🌷గణపాలుని కథ


🌸గణపాలుడనే రాజు శైవేతరుడు ఒక్కడూ భూమి మీద ఉండకూడదని నియమం పెట్టుకున్నాడు. ముందు వాదాలలో ఓడించేవాడు. అలా వినకపోతే ధనమిచ్చేవాడు. 


🌿అందుకూ లొంగకపోతే బెదిరించేవాడు. అదీ విఫలమైతే చంపేసేవాడు. ఇలా శైవాన్ని గణపాలుడు వ్యాప్తి చేస్తూ వుండగా శివుతడణ్ణి పరీక్షించడం కోసం ఒకనాడు శైవేతరుని వేషంలో రాజు వద్దకు వచ్చాడు...సశేషం...🚩🌞🙏🌹


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat