🔱 *కుమారచరిత్ర* - *30* 🔱

P Madhav Kumar

 

*శ్రీ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామినే నమః*


తమిళులు 'మురుగన్' అని ముద్దుగా పిలుచుకునే  స్వామి క్షేత్రాలు, *తమిళనాడులో* పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి.

అలాంటి క్షేత్రాల్లో ఒకటిగా ... విశిష్టమైనదిగా...' *విరాలిమలై* ' వెలుగొందుతోంది.


తమిళనాడులోని ఈ ప్రాంతంలో, ప్రాచీనకాలం నుంచి స్వామి పూజలు అందుకుంటున్నాడని చెబుతుంటారు.
కోరిన వరాలను ప్రసాదించే ఈ స్వామి కొండపై కొలువుదీరి, శ్రీ వల్లీ దేవసేన సమేతంగా దర్శనమిస్తుంటాడు.

'షణ్ముఖుడు' అనే పేరుకు తగినట్టుగా ఇక్కడ స్వామి ఆరు ముఖాలతో ఆవిర్భవించడం విశేషం.

ఇక ఈ క్షేత్రాన్ని దర్శించాలనే ఆలోచన రావడానికి కూడా స్వామి అనుగ్రహం వుండాలని చెబుతుంటారు.
 
అలా ఈ స్వామివారి చెంతకు బయలుదేరిన వారికి ఎలాంటి ఆటంకాలు కలగవని అంటారు.

సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రాలను దర్శిస్తున్నప్పుడే ఆయన భక్తుల గురించిన విశేషాలు కూడా వినిపిస్తూ ఉంటాయి.

అలాంటి భక్తులలో 'అరుణగిరి నాథర్' ఒకరు.

అనుక్షణం సుబ్రహ్మణ్యస్వామిని కీర్తిస్తూ సేవిస్తూ తరించిన మహా భక్తులలో అరుణగిరి నాథర్ పేరు ముందువరుసలో కనిపిస్తుంది

దైవం తన భక్తులకు ఎదురై ... తన ఆలయాన్ని దర్శించి వెళ్లమన్న అద్భుతమైన సంఘటన ఈ క్షేత్రం విషయంలో జరిగిందని అంటారు.

పూర్వం 'అరుణగిరినాథర్' అనే కుమార స్వామి భక్తుడు ఉండేవాడట. అనునిత్యం ఆయన కుమారస్వామిని ధ్యానిస్తూ ఆ స్వామిపై అనేక పాటలను రాసి ... వాటిని పాడుతూ పరవశిస్తూ ఉండేవాడు.

ఒకసారి స్వామికి ఆయన స్వప్నంలో కనిపించి, ఈ క్షేత్రాన్ని దర్శించి వెళ్ల వలసిందిగా కోరాడట.
 
మరునాడు ఉదయాన్నే ఈ క్షేత్రానికి బయలుదేరిన అరుణగిరినాథర్, అరణ్య మార్గంలో ప్రయాణిస్తూ వుండగా క్రూరమృగాలు చుట్టుముట్టాయి తన ప్రాణాలు పోవడం ఖాయమని ఆయన అనుకుంటూ. ఆయన సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్ధిస్తాడు.

అంతే ... ఎక్కడి నుంచో రివ్వున బాణాలు దూసుకురాసాగాయి. దాంతో బెదిరిపోయిన మృగాలు అక్కడి నుంచి పారిపోతాయి. వేటగాడి రూపంలో అక్కడికి వచ్చిన సుబ్రహ్మణ్యస్వామి, అరుణగిరి నాథర్ కి తోడుగా నిలిచి అతణ్ణి తన క్షేత్రానికి క్షేమంగా చేరుస్తాడు.

భగవంతుడిని దర్శించాలనే బలమైన సంకల్పం ఉన్నప్పుడు, ఎలాంటి ఆపదలు ఎదురైనా ఆయనే కాపాడతాడు. వెన్నంటి ఉంటూ క్షేమంగా గమ్యానికి చేరుస్తాడు అనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణగా కనిపిస్తూ ఉంటుంది.

కుమార స్వామి తన భక్తుల వెంటే ఉంటూ కంటికి రెప్పలా కాపాడతాడనడానికి ఈ సంఘటన నిదర్శనంగా నిలుస్తోంది


ముత్తు ( ముద్దు ) కుమారస్వామి
వైధీస్వరన్ కోవెల ( కుజ స్థానం )

.తమిళనాడులోని చిదంబరానికి  24 కిమీ శిరికాళి వెళ్ళే రోడ్డు మీద కుంభకోణానికి సుమారు 55కిమి దూరంలో నాగపట్టణం జిల్లాలో వున్న  ' పుల్ఋగ్వేలూర్  ' అనే వూరిలో వైధీశ్వరన్ కోవెలలో యీ కుజస్థానం వుంది .

పుల్ఋగ్వేలూర్

పుల్ అంటే పక్షి , త్రేతాయుగం లో జటాయువు  కోవెలలో యీశ్వరుడిని సేవించుకొన్నాడు , ఋగ్ అంటే ఋగ్వేదం, వేల్ అంటే కుమారస్వామి యొక్క ఆయుధం ,
కుమారస్వామి పార్వతీ పరమేశ్వరులను మెప్పించి వెలాయుధాన్ని పొందిన ప్రదేశం . అందుకే యీ వూరికి ' పుల్ఋగ్వేలూర్ ' గా పిలువ బడుతోంది .  .

యీ కోవేల కనీసం 2000 సం .. పూర్వం నిర్మింప బడ్డ మందిరంగా చెప్పబడింది . నాలుగు వైపులా పెద్ద పెద్ద గోపురాలతో చాలా విశాల మైన కోవెల . 
యిక్కడ అడుగడుగునా నాడీ జ్యోతిషాలయాలు దర్శనమిస్తాయి . రాజ గోపురం దాటుకొని లోపలకి వెళ్ళగానే పెద్ద పెద్ద మండపాలు రెండువైపులా వుంటాయి .

యిక్కడ కోవెల ఆధీనం లో వున్న యేనుగులు కనుపిస్తాయి . యింకా ముందుకి వెళితే లోహంతో నిర్మింప బడ్డ పెద్ద కుమారస్వామి విగ్రహం వుంటుంది .
దీనిని ముత్తు ( ముద్దు ) కుమారస్వామి అని అంటారు . పార్వతీ దేవి షన్ముఖుని ఆరు ముఖాలతో కాకుండా అతని అసలు రూపం తో దర్శన మివ్వమని కోరగా కుమారస్వామి ఆమెకు ఒక మొహం తో దర్శన మిచ్చేడుట . ఆ ముద్దు మోముని చూసి ముత్తు కుమారస్వామి అని పార్వతీ దేవి పుత్రుని ముద్దాడిందిట .
 
కుమారస్వామి పద్మాశురునితో యుధ్ధానికి వెళ్ళేటప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుడు వేలాయుధాన్ని యిచ్చి అశీర్వదించి యుద్ధానికి పంపుతారు .

ఆయుధ్ధం లో క్షతగాత్రులైన దేవతలకు శివుడు వైద్యునిగా సేవలందిస్తాడు . అందుకు యీ కోవెలలో యీశ్వరుని వైధీశ్వరుడు అని పిలుస్తారు యీశ్వరుని గర్భ గుడిలోకి ప్రవేశించడానికి ముందు కుడిచేతి వైపున దక్షిణ ముఖంగా అమ్మవారి కోవెల వుంటుంది .
ఇక్కడ పార్వతీదేవిని థైయాల్ నాయకి అని అంటారు . యీ కోవెలలో ముందుగా ముత్తు మురుగన్ ని దర్శించుకున్నాక థైయాల్ నాయకిని దర్శించుకోవాలి .
అమ్మవారు తలపై తైలం కడవని పెట్టుకొని భక్తులకు దర్శన మిస్తుంది . తైలనాయకి గా పిలువబడే అమ్మవారు కాలాంతరాన  థైయాల్ నాయకిగా మారిపోయింది .వైధ్యుడుగా దేవతలకు సేవలందిస్తున్న శివునికి ఓషధులు కలిపిన తైలం అందిస్తూ సహాయ సహకారాలను అందిస్తుంది పార్వతీ దేవి . యీ అమ్మవారిని దర్శించుకుంటే అన్ని ఋగ్మతలు తొలగిపోతాయనేది స్థానికుల నమ్మకం .

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat