#🙏బసవ పురాణం - 32 వ భాగము🙏

P Madhav Kumar


అది విని చౌడయ్య ‘‘శివ శివా! బసవడు చనిపోయాడనే వార్త విన్నాను. ఇంక కల్యాణమేమిటి?’’ అని దుఃఖపడి ‘‘నందీశా! లేచిరా!’’ అని పిలిచాడు. వెంటనే ఖణేలుమని రంకెలేస్తూ నందీశుడు భూమిలోంచి సజీవుడై వచ్చాడు. అలాగే ఒక కన్యకు కూడా చౌడయ్య ప్రాణం పోశాడు. చౌడయ్య పోతుండగా నది పొంగి వుంది. ‘దారికడ్డం తొలుగు’ అన్నాడు చౌడయ్య. నది భయపడి తగ్గి దారి ఇచ్చింది.

చౌడయ్య మహిమ విని ఆయనంటే గిట్టని ఇతర మతస్థులు ఒక గోనెసంచీని మనిషి రూపంలో చసి దానిని విమానమెక్కించి మునీశ్వరుడు చచ్చిపోయాడు బాబో అని ఏడుస్తూ చౌడయ్యకు ఎదురు వచ్చారు. చౌడయ్య వాళ్ల మాయ గ్రహించి చిరునవ్వు నవ్వి ‘‘రా! మునీశ్వరా! దిగిరా!’’ అన్నాడు. గోనె సంచే మనిషిగా మారి విమానం దిగివచ్చి చౌడయ్యకు నమస్కారం చేశాడు. అంతటితో ఊరుకోక ఆ మునీశ్వరుడు తన కృతక రూపం సృజించిన అన్యమతస్థుల మీద విరుచుకొనిపడ్డారు. దానితో వారు భయపడి చౌడయ్య పాదాలను శరణు కోరారు. చౌడయ్య వారి నందరినీ కరుణించారు.

సురియ చౌడయ్య కథ

శివానందుడనే యోగి శ్రీశైలంలో తపస్సు చేస్తూ ఉండేవాడు. కొందరు గంధర్వకన్యలు గగనమార్గాన పోతూ ఆయనను చూచి పరిహసించారు. వారు క్షమాభిక్ష కోరగా కల్యాణ నగరంలో బొమ్మయ్య అనే భక్తుడు పుడతాడు. అతని చేతిలో మరణించి కైలాస ప్రాప్తి పొందండి అన్నాడు. గంధర్వ కన్యలు మృగాలై జన్మించారు. తెలుగు బొమ్మయ్య ఒకనాడు పూజార్థం అరణానికి పక్రై పోగా మృగాలు తమ్ము చంపి శాపమోక్షం గావింపవలసిందని ప్రార్థించాయి. వాటి కోరికపై బొమ్మయ్య విల్లంబులు దాల్చి మృగ సంహారం చేసి వాటికి తిరిగి గంధర్వ దేహం ప్రసాదించాడు.

ఏకాంత రామయ్యగారి కథ

కల్యాణ నగరంలో ఏకాంత రామయ్యగారనే మహాభక్తుడు ఉండేవాడు. ఆయన ముప్పొద్దులా కైలాసానికి వెళ్లి వచ్చేవాడు. ఒకనాడు చెప్పుల కాళ్లతో జైనుడొకడు శివాలయానికి రాగా ఏకాంత రామయ్య కోపించాడు. అప్పుడు జైనుడు మా మతం వేరు, మీ మతం వేరు. అంతగా శివుడే గొప్ప అయితే నీ తల తిరిగి మళ్లీ తెప్పించమను- నేను నమ్ముతాను’ అన్నాడు. ‘ఓరోరి జైనుడా! తల తిరిగి తెప్పించడం గొప్ప కాదురా- ఎందరో భక్తులు లోగడ అలా చేశారు. తల తిరిగి ఏడు రోజులుండి మళ్లీ తెప్పిస్తాను చూడు’ అని ఏకాంత రామయ్య ఆ గుడిలో బసవడూ బిజ్జలుడూ మొదలైన వారంతా చూస్తూ వుండగా తల నరుక్కుని ఏడు రోజులు కల్యాణనగర వీధులలో తిరిగి ఎనిమిదవ నాడు తిరిగి తన తలను తన మొండంతో అతుక్కున్నాడు. దానితో జైనుడు ఓడిపోయాడు. జైనాలయాలు పడగొట్టబడ్డాయి.

కరిశుని కథ

తిరునావలూరు అనే నగరంలో తిరునావకరిశుడు అనే జైనుడు ఉండేవాడు. అతడు ఒకసారి శూలవ్యాధితో పడరాని బాధలన్నీ పడి మంచం పట్టాడు. అప్పుడు బంధువులొకరు వచ్చి ‘ఈమాటలతో వైద్యాలతో లాభం లేదు. పంచాక్షరీ మంత్రోపదేశం పొంది శివదీక్ష స్వీకరించు, లేకుంటే బ్రతకడం కష్టం’ అని చెప్పారు.

అది విని కరిశుడు అంగీకరించాడు. భస్మ ప్రభావంతో అతడి శూలవ్యాధి నయమైంది. కరిశుడు శివదీక్ష స్వీకరించాడు. దానితో జైనులు మండిపడి కరిశుణ్ణి పట్టుకొని ఏనుగు ముందు పడేశారు. గజచర్మధారి భక్తుణ్ణి ఏనుగు తాకడానికి భయపడింది. విషం పెట్టారు. విషధరు భక్తుణ్ణి విషమేం చేస్తుంది? నిప్పుల్లో పడేశారు. జిహ్వాంతకుని భక్తుణ్ణి చిచ్చు ఏమి చేస్తుంది? నీళ్ళల్లో పడేశారు. జలమేళి బంటుకు జలమేమి భయం? దానితో వారంతా భయపడి కరిశుని శరణు కోరారు. కరిశుడు వారందరికి శివదీక్షనిప్పించాడు.

ఇరుత్తాండి కథ

తిరువారూరులో ఇరుత్తాండి అనే శివభక్తుడు ఉండేవాడు. అతడు పుట్టుగుట్ట. శివుని కోవెలముందు కొలను తవ్వుతూ కాలం గడపాలని భావించి గునపంతో మట్టి త్రవ్వుతూ గుర్తుగా శంఖులు కట్టిన ఒక త్రాడును ఉంచుకున్నాడు. జైనులు అది చూచి ఇరుత్తాండిని బాధపెట్టాలని శంఖులు తెంపారు. చివరకు తాడు కూడా కోసివేశారు. శివుడు ఇరుత్తాండికి కళ్ళు ఇచ్చాడు. ఇరుత్తాండి అన్యాయులైన జైనుల మదము అణచాడు.

🔱🔱🔱🔱🔱

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat