🎻🌹🙏బసవ పురాణం - 33 వ భాగము.....!!

P Madhav Kumar


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌷పిళ్లనాయనారు


🌸శ్రీకాళి అనే నగరంలో కుమారస్వామి అంశలో పిళ్లనాయనారు అనే భక్తుడు ఒక బ్రాహ్మణుని ఇంట పుట్టాడు. ఒకనాడు ఆ బాలుణ్ణి వెంట తీసుకొని తండ్రి నదికి స్నానానికి పోయాడు. 


🌿బాలుడు గట్టున కూర్చొని వున్నాడు. అప్పుడు ఆకాశంలో శివపార్వతులు పోతూ వున్నారు. పార్వతీదేవి పిళ్ల నాయనారును చూచి ముచ్చటపడి అచ్చం కుమారస్వామిలాగే ఉన్నాడు అనుకొని వచ్చి పాలిచ్చింది. 


🌸తర్వాత ఓ బంగారు గినె్నతో మరికొన్ని చేతికిచ్చి వెళ్లింది. తండ్రి వచ్చి చూచి ఆశ్చర్యపోయాడు. అమ్మవారి స్తన్యాన్ని తాగి దివ్యజ్ఞాని అయిన ఆ శిశువు తిరుజ్ఞాన సంబంధుడనే పేర ప్రసిద్ధుడైనాడు.


🌿కులోత్తుంగ చోళుణ్ణి శివభక్తుని గావించి అతని రాజ్యంలోని రెండు వేలమంది జైనులను పారద్రోలాడు. తిరుమరక్కడ అనే పురంలోని బ్రహ్మేశ్వర మందిర వాటాలు తెరిపించాడు. 


🌸తిరునావలూరు అనే నగరంలో జైనులను ఓడించి పాము కరిచి మృతుడైన ఆ నగర ప్రభువుకుప్రాణాలు ఇచ్చాడు.తర్వాత  జ్ఞాన సంబంధుడు మధురకు వచ్చాడు.అప్పుడుఆయనతో బౌద్ధులకూ జైనులకూ శాస్తయ్రుద్ధం జరిగింది. 


🌿పద్ధెనిమిది వేల జనులను జ్ఞాన సంబంధుడు ఓడించాడు. అతని ఇంటికి రాత్రి జైనులు నిప్పుపెట్టారు. కాని నిప్పు ఆయనను అంటవెరచింది. జ్ఞాన సంబంధుడు ఆఅగ్నినిమధురేశుని మీదికి తిప్పాడు. 


🌸అతనికి ఉష్ణజ్వరం వచ్చింది. జ్ఞానసంబంధుడు జైనులను పిలిచి రాజుకు ఎడమవైపు నేను నయం చేస్తున్నాను, కుడివైపు మీరు నయం చేయండి అని తన భాగం తాను నయం చేశాడు.కానిజైనులుచేయలేకపోయారు

అప్పుడు జ్ఞానసంబంధుడుమంత్రభస్మం మళ్లీ చల్లాడు. 


🌿దానితో రాజుకు జ్వరంతో బాటు గూని కూడా నయమైంది. నాటినుండి రాజు సుందర పాండ్యుడనే పేర ప్రసిద్ధుడైనాడు.అంతటితో జైనులు ఊరుకోక అగ్నిపరీక్ష కావాలన్నారు. 


🌸సరేనని జ్ఞాన సంబంధుడు ఒక కాగితంపై జైన మంత్రమూ మరొక కాగితంపై శివమంత్రమూ వ్రాయించి నిప్పులో పడవేయించాడు. జైన మంత్రం తగలబడిపోయింది. శివమంత్రం నీటిలో కమలంలాగా ప్రకాశించింది నిప్పులో. 


🌿తర్వాత జైనులు బలపరీక్ష కోరారు. రెండు మంత్రలేఖలనూ కావేరీ నదిలో వేశారు. జైనమంత్రం కొట్టుకొని పోయింది. శివమంత్రం గట్టెక్కింది. జైనులు ఓడిపోయారు. పద్ధెనిమిదివేల మంది జైనులను ఈ విధంగా తిరుజ్ఞాన సంబంధుడు జయించాడు.


🌷నిడుమారుని కథ


🌸నిడుమారుడు అనే రాజు జ్ఞానసంబంధుని ఉద్యమంవల్ల స్ఫూర్తి పొంది తన రాజ్యంలోని జైనమతస్థుల నందరినీ మార్పించి శివభక్తులుగా చేశాడు.


🌷నమినంది కథ


🌿తిరువాలూరులో నమినంది అనే మహాభక్తుడుఉండేవాడు.శివాలయంలో నిత్యం వేయి వేయి దీపాలు పెట్టడం అతని వ్రతం. నగరంలోని జైనులు నమినందిని ఎలాగైనా తరిమివేయాలని యోచించి ఎవరూ నమినందికి దీపా రాధనకై నెయ్యి ఇవ్వవద్దని శాసించారు. 


🌸నమినందికి నేయి పుట్టలేదు. వ్రతభంగవౌతున్నదే అన్న దిగులుతో నమినంది ప్రాణార్పణకు సిద్ధపడ్డాడు. శివుడు నవ్వి ‘నూనెతో నాకేమి పని? నీళ్లతో వెలిగించవయ్యా’ అన్నాడు. 


🌿శివాజ్ఞతో కొలనిలోని నీరు పోసి నమినంది దీపారాధన చేశాడు. కోటి దీపాలు వెలిగాయి.ఈలోగా గ్రామంలోని పశువులన్నీ చచ్చాయి. ప్రజలు భయపడి 


🌸ఈ జైనుల మాటలు విని అన్యాయ మైనామురా బాబూ అని దుఃఖించి నమినందిని శరణు కోరారు. నమినంది పశువులను బతికించి నగరంలో ప్రజలందరికీ శివదీక్ష ఇప్పించాడు.


🌷సాంఖ్య తొండని కథ


🌿చోళ మండలంలో శాంతమంగ అనే నగరంలో సాంఖ్య తొండడనే భక్తుడు ఒక బౌద్ధుని కడుపున పుట్టాడు. జైన బౌద్ధ చార్వాకములు నిర్మూలించాలని సంకేతంగా


🌸 శివుణ్ణి మూడు రాళ్ళతో ముప్పొద్దులా పూజించసాగాడు. ఇలా కాదని ఒకనాడు పెద్ద రాయెత్తి ‘స్వామి! నేను విసుగెత్తాను’ అనివేయబోయాడు. శివుడు నవ్వుతూ ఆ రాయి అందుకొని వరం కోరుకోమన్నాడు. ‘


🌿ఈ ఎత్తిన రాయి పూవు రాయిగా మారి నీ శిరమును అలంకరింపజేయి తండ్రీ’ అని కోరుకున్నాడు. శివుడు అనుగ్రహించాడు. సాంఖ్యతోండడు వేదబాహ్యమైన మతములన్నీ నిర్మూలించాడు..🙏


🙏 హర హర మహాదేవ 🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat