శ్రీ వేంకటేశ్వర లీలలు భాగము 34 - పద్మావతి ప్రణయబాధ ననుభవించుట మనోవ్యాధితో మంచమెక్కుట

P Madhav Kumar


🌻 *పద్మావతి ప్రణయబాధ ననుభవించుట మనోవ్యాధితో మంచమెక్కుట* 🌻

🍃🌹శృంగార వనములో ఎప్పుడైతే పద్మావతి వేటగాని రూపములో వున్న శ్రీనివాసుని చూచినదో అప్పటినుంచీ యామెకు ఆ పురుషుని గూర్చిన ఆలోచనలే మనసులోమెదలడము ప్రారంభించినాయి. కన్ను మూసినా, తెరచినా అతడే కనిపిస్తున్నాడు.

🍃🌹అతడు తన హృదయముపై చెరగని ముద్రవేసినాడు. అతనిని వివాహము చేసుకొన్న బాగుండునని పద్మావతి భావించినది. అయితే తల్లికికానీ, తండ్రికి కానీ విషయము చెప్పలేదు, చెలికత్తెలకి చెప్పడానికి గూడా సిగ్గేసింది.

🍃🌹 ‘బోయవాడు, బికిరివాడు నీకు భర్తగా రావడమేమిటి?’ అని తల్లిదండ్రులు తనను చీవాట్లు పెట్టవచ్చు. అందువలన ఆమె సరిగా తినడము సరిగా నిద్రపోవడము మానేసి చాలా కాలమైనది. సింగారించుకోవడము మానినది.

🍃🌹వనవిహారము మానినది, చివరకు చెలికత్తెలతో సరిగా మాట్లాడడము కూడా మానివేసినది. ప్రేమ జ్వరము ఆమెను క్రుంగదీయడము ప్రారంభించినది.

🍃🌹పద్మావతి వనోవ్యాధితో మంచమెక్కినది, ఆకాశరాజు, ధరణీదేవి విప్రవర్యులచే పద్మావతి ఆరోగ్యమునకై పూజలూ, అభిషేకములూ జరిపించారు.

🍃🌹రాజవైద్యులు కూడా వైద్యము చేశారు. ఏమి చేయించినా ఆమె వ్యాధి కుదటపడదని ప్రారంభించనే లేదు పైగా ఆ వ్యాధి ఆ రోజు కారోజు పెరిగిపోసాగినది. ఇక్కడ పద్మావతియిలా వుంటే......

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat