శ్రీ వేంకటేశ్వర లీలలు భాగము 36 - *వకుళాదేవి రాయబారం సాగించిన విధము*

P Madhav Kumar


🌻 *వకుళాదేవి రాయబారం సాగించిన విధము* 🌻

🍃🌹ఎరుకసాని వేషము వేసుకొని సోది చెప్పిన వెనుక శ్రీనివాసుడు పద్మావతి గురించే ఆలోచించసాగాడు. పద్మావతి శ్రీనివాసునితో తనకు ఏ విధముగా పెండ్లి జరుగుతుందా అనే ఆలోచనలో పడింది. ఆకాశరాజా, ధరణీదేవి పద్మావతిని చూచి విచారించసాగారు.

🍃🌹పద్మావతికి కలలో శ్రీనివాసుడు కనుపించి అనేకమైన లీలలు చూపించినాడు. ఆమె ఆవిషయము తన తల్లిదండ్రులతో చెప్పి తాను శ్రీనివాసుని తప్ప మరొకరిని వివాహమాడననెను. ధరణీదేవీ, ఆకాశరాజూ కూడా తాము పెద్దలను సంప్రదించి ఆమె కోరిక తీర్చడానికి ప్రయత్నిస్తా మన్నారు.

🍃🌹వకుళ, రాయబారము సాగించుటకు నారాయణపురము చేరినది. అంత:పురములో ప్రవేశించినది. ఆకాశరాజు, ధరణీదేవి ఆమెను తగురీతిని గౌరవించి పూజించారు. అనంతరము ఆకాశరాజు వకుళతో ‘‘అమ్మా! చూడగా మీరు యోగినివలె కనిపించుచున్నారు.

🍃🌹మీ రాకవలన మా గృహము పావనమైనది. మీ రాకకు గల కారణము తెలుసుకొనవలెనని కుతూహల పడుచుంటిమి. మీరు యెక్కడ వుంటుంటారు? ముఖ్యంగా మీరు శ్రమపడి వచ్చిన పనిని తెలియజేయ కోరుతున్నాము. అన్నాడు.

🍃🌹వకుళాదేవి ఆకాశరాజుతో మహారాజు! నేను శేషాచల నివాసిని, నాకు ఒక్కగానొక్క, కుమారుడు. అతనిపేరు శ్రీనివాసుడు. నాకుమారుని అందము చెప్పడానికి భాషలోని మాటలు చాలవు. అతనిది వశిష్టగోత్రము అతని వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే.

🍃🌹ఒకనాడు మావాడు వేటకు వెళ్ళి శృంగారవనమున ప్రవేశించి, మీ ముద్దుల కుమార్తె అయిన పద్మావతి యొక్క సౌందర్యతిశయాన్ని చూసి ప్రేమించినాడు పద్మావతిని తప్ప అన్య కన్యను ఒల్లనంటున్నాడు.’’ ఈ మాటలు అంటూంటే ధరణీదేవి మా అమ్మాయి కూడా యింతే కదా అనుకొన్నది.

🍃🌹వకుళ చెపప్పసాగినది. ‘‘నా కుమారుడు మూడు లోకాల్ని ఏలగల దిట్టడు. ఆ లక్షణాలన్నీ వున్నాయి. బుద్ధిమంతుడూ, అందగాడూ అయిన మా పిల్లవాడికి బుద్ధిమంతురాలూ, సుందరీ అయిన మీ కుమార్తెనిచ్చి వివాహము చేసే ఉభయత్రా బాగుంటుంది.

🍃🌹కనుక, మీరు సందేహించక ఆ విధముగా చేయండి. మావాడు దైవాంశజుడేగాని, మానవమాత్రుడు కానేకాడు’’ సాత్త్విక భావము తొణికిసలాడే ఆమె పలుకులకు ఆకాశరాజు ఆనందించి ‘‘ అమ్మా! మీరు ఉన్న విషయాలన్నీ చెప్పారు.

🍃🌹ఈ విషయాలన్నీ మా పెద్దలతో కూలంకషంగా యోచించి, ఏ విషయమూ మీకు వర్తమానము పంపుతాను’’ అన్నారు. వకుళాదేవి వారివద్ద శలవు గైకొని తిరిగి తిరిగి తన స్థలానికి చేరుకొన్నది.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat