బసవ పురాణం - 36 వ భాగము...!!🙏

P Madhav Kumar


🌷భోగయ్యగారి కథ


🌸కెంబాగి అనే నగరంలో భోగయ్య అనే మాదిగ శివభక్తుడు ఉండేవాడు. శివుడొకనాడొక పెయ్య శవాన్ని భుజాన వేసుకొని భోగయ్యను పరీక్షించేనిమిత్తం ఒక జంగమ వేషంలో వచ్చి పెయ్యను వండిపెట్టమన్నాడు.


🌿 భోగయ్య వండిపెట్టాడు. దానితో బ్రాహ్మణులు కోపించి భోగయ్యమీదికి రాగా భోగయ్య నగరం విడిచి పోయాడు. భోగయ్య వెంట సమస్త శివలింగాలూ వచ్చాయి. 


🌸కెంబాగి పాడుబడింది. బ్రాహ్మణులంతా మళ్లీ భోగయ్య కాళ్ళమీద పడితే భోగయ్య కెంబాగికి తిరిగి వచ్చాడు. లింగాలన్నీ అతని వెనుకే వచ్చాయి. కెంబాగి తిరిగి నందనవనమయింది.


🌷గుడ్డవ్వ కథ


🌿గుడ్డవ్వ అనే కుష్ఠురోగి శివశరణురాలు ఉండేది. ఆమెను నగరంలోని బ్రాహ్మణులు అసహ్యించుకొని తరిమికొట్టగా ఆమె నగరం విడిచి సౌరాష్ట్రం పోవాలని బయలుదేరింది. 


🌸శివుడే ఆమెకు ఎదురు నడిచి వచ్చాడు. గుడ్డవ్వ శరీరం బాగుచేశాడు. ఆమెను తిట్టినవారికి కుష్ఠువు వచ్చింది.

ఇతర భక్తులు పాల్కురికి సోమనాథుడు కల్యాణ నగరంలోవున్న బసవని సమకాలిక భక్తుల పట్టిక ఇచ్చాడు. 


🌿ఆ భక్తులందరి పేర్లు ఇవి

మడివాలు మాచయ్య, మాది రాజయ్య, బడవర బ్రహ్మయ్య, బాచి రాజయ్య, కిన్నర బ్రహ్మయ్య, కేశి రాజయ్య, కన్నద బ్రహ్మయ్య, కల్లి దేవయ్య, 


🌸మోళిగ మారయ్య, ముసిడి చౌడయ్య, శూలద బ్రహ్మయ్య, సురియ చౌడయ్య, కీలకేత బ్రహ్మయ్య, కక్కయ్య, తెలుగేశు మసలయ్య, తెలుగు బొమ్మయ్య, శాంతదేవుడు, జమ్మయ్య, 


🌿బాసవంతు కేసయ్య, ఏకాంత రామయ్య, ఉత్తమాంగద కేశి హొన్నయ్య, గండకత్తెర నాచయ్య, కాలాగ్ని రుద్రిశృంగి బొప్పయ్య, చిగురు చందయ్య, డింగరి మల్లయ్య, 


🌸సంగమేశ్వరుడు, కదిరె రెమ్మయ్య, మహాకాళయ్య, పదుమరసును, పురాణ దమాయిభట్టు, ఉదర రామయ్య, యోగి దేవయ్య, ఉదర మరసు, హొన్నయ్య, ధవళయ్య, 


🌿బొంతాదేవి, సవదర చిక్కయ్య, సారె నాయడు, శివముద్దదేవుడు, చిక్కదేవుడు, శివరాత్రి సంగయ్య, అవిముక్తయ్య, చండేశు చామయ్య, ముండబ్రహ్మయ్య, బండియ రేవణ్ణ, ఇండె సోమన్న, హాటకేశ్వరుని 


🌸బ్రహ్మయ్య, మహాబలుడు, కోటేశు చామయ్య, గొగ్గయ్య, దుమ్మద బ్రహ్మయ్య, దూర్జటి కేశిఎమ్మె సంగయ, కపిలేశు విన్నయ్య, వొణిమేశు చిక్కయ, నులుక చంద్రయ్య, గణదాసి మాదన్న, గంటి మల్లయ్య, 


🌿మురహాట కేతయ్య, హరవి హొల్లయ్య, గిరిగీటు సింగయ్య, గురుజ కాళవ్వ, బానస భీమయ్య, భాస్కరయ్య, గోనియ మల్లయ్య, గొగ్గయ్య, అల్లయ్య, మధుపయ్య, అనిమేః కేశిహోలయ్య, 


🌸గోడల మల్లయ్య, ఓలె బ్రహ్మయ్య, కరహళ మల్లయ్య, బాల బ్రహ్మయ్య, పణిహరి బాచి కవిలె బ్రహ్మయ, బందికార మల్లయ్య, అవకర కేతయ్య, శివనాగుమయ్య, నిజలింగ చిక్కయ్య, నిర్లజ్జశాంతి నిజభావుడు నిత్య 


🌿నౌమదమైల, అంక బ్రహ్మయ్య, గరహల బ్రహ్మయ్య, సుంకేశు బంకయ్య, లెంక మంచయ్య, ఏలేశు బ్రహ్మయ్య, ఈడె బ్రహ్మయ్య, మైలన బ్రహ్మయ్య, మాయి దేవయ్య, చక్కెర బ్రహ్మయ్య, శరణయ్య, చిక్క బ్రహ్మయ్య, శ్రీగిరయ్య, 


🌸వీర మాదయ్య, వీర లింగయ్య, వీరబ్రాహ్మయ్య, వీరభావయ్య, వీరనాగయ్య, వీరకల్లయ్య, వీరభోగయ్య, విమల దేవయ్య, కక్కయ్య, కల్లయ్య, కాట కోటయ్య 


🌿చిక్కయ్య, వీరయ్య, శ్రీ సూరసాని, కొండ గుడ్కేతయ్య, గుండయ్య, చండేశు బ్రహ్మయ్య, శంకరయ్య, అమృత దేవయ్య, అనిమిషయ్య, విమలదేవుడు మొదలైనవారు.


బసవ పురాణము 

సమాప్తం..🙏


🙏 హర హర మహాదేవ 🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat