🌻 *శ్రీనివాసుడు వకుళకు తన మనోరథాన్ని తెలుపుట* 🌻
🍃🌹శ్రీనివాసుడు విచారముతో దిగులుపడి రావడానికి కారణము తెలియక గాభరా పండింది వకుళ, తీరా చూస్తే శరీరము నిండా గాయాలూ, రక్తమూను, మహాందోళన పడినది,
🍃🌹 ‘అయ్యో! నాయనా! ఇదేమిటి? ఇన్నిగాయాలేమిటి? ఈ రక్తమేమిటి? నిన్ను కొట్టిన ఆ కరకు గుండెలవాళ్ళెవరు? అయ్యయ్యో! ఎట్లా ఓర్చుకుంటున్నావో నాయనా! నీ తల్లిని నేను అడుగుతున్నాను. ఏమి జరిగినది? విషయము చెప్పు నాయనా! అని అడిగినది.
🍃🌹అడుగుతూనే గాయములపై ఏవేవో పసరులూ, ఆకులూ తెచ్చి వేసినది. ఒడలు తడిమి గాయమున్న చోటనల్లా ఆకుపసరు రాసినది. శ్రీనివాసుడు వకుళతో జరిగిన విషయములను పూజగ్రుచ్చినట్లు చెప్పాడు.
🍃🌹శ్రీనివాసుడు ‘అమ్మా! అదేమిటోనమ్మా! ఆ సౌందర్యరాశిని చూసినప్పటినుండి పెండ్లి చేసుకొంటే ఆమెనే చేసుకోవాలని భ్రాంతి కలిగినది. ఆమె లేకపోతే నేను బ్రతకలేను. ఆమెను వివాహమాడకపోతే యిక నా జీవితమే లేదు’ అని తన హృదయములో ఉన్నదంతా వెళ్ళగ్రక్కాడు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏