🌻 *శ్రీనివాసునకూ, పెండ్లివారికి ఆకాశరాజు స్వాగతమిచ్చుట* 🌻
🍃🌹ఆకాశరాజు బంధువులతో సహితము, మంగళవాద్యాలతో సహితము శ్రీనివాసుడున్న విడిది గృహానికి వెడలినాడు. అప్పుడు వశిష్ఠుడు ఆకాశరాజుతో ‘‘రాజా! ఇంక ముహూర్తము సమీపించనున్నదికదా! కనుక మున్ముందుగా మీరిప్పుడు వరుని పూజచేయవలసి వున్న’’ దనెను.
🍃🌹అట్లే అని ఆకాశరాజూ ధరణీదేవి శ్రీనివాసునకు గంధము, తాంబూలము మొదలైనని యిచ్చీ బట్టలూ, నగలూ యిచ్చి పూలతో ప్రేమతో పూజచేశారు. పూజానంతరము శ్రీనివాసుని పట్టపుటేనుగుపై ఆసీనుని చేశారు.
🍃🌹బ్రహ్మ, సరస్వతీ, ఈశ్వరుడు, పార్వతి, ఇంద్రుడు, శచి, తక్కిన వారినీ మునులను సర్వవిధ మంగళవాద్యాల మధ్య విడుదలు నుండి తోడుకొని వచ్చి రాజమందిరములో ప్రవేశింపజేశారు. రాజమందిర ద్వారము దగ్గర మత్తయిదువులు శ్రీనివాసునకు హారతి యిచ్చారు.
🍃🌹అనంతరము అలంకరింపబడిన కల్యాణమండపములోకి శ్రీనివాసుని రావించి, బంగారముతో చేయబడిన ఒక పీఠముపై కూర్చుండజేశారు. ఎప్పుడు ఏది చేయవలసి వున్నదో చెబుతున్నారు. ఆయన చెప్పగా ఆకాశరాజు స్వామి పుష్కరిణీతీర్థము నుండి పవిత్రజలాన్ని తెప్పించాడు.
🍃🌹భార్య ధరణీదేవి బంగారు కలశముతో ఆ జలమును పోస్తుండగా ఆయన శ్రీనివాసుని పవిత్ర పాదకమలాలను కడిగినాడు. కడిగి ఆ జలబిందువులను తన శిరస్సుపై జల్లుకొని ధరణీదేవి శిరముపైన జల్లినాడు.
🍃🌹ఆ వివాహ మంత్రాలను చదవడము పని వశిష్ఠునిదీ బృహస్పతిదీను, వారిరువు రునూ సమయోచిత శుభమంత్రాలు పఠిస్తుండగా ఆకాశరాజు పద్మావతి యొక్క హస్తాన్ని పట్టుకొని ధరణీదేవి స్వర్ణ పాత్రతో స్వచ్చ జలము పోస్తుండగా శ్రీనివాసుని చేతిలో ధారవోసినాడు. వశిష్ఠుడు ఆ దంపతులకు కంకణాలు కట్టాడు.
🍃🌹ఏ శుభముహూర్తమునకు వివాహము జరగవలసి యున్నదో ఆ సుముహూర్తము రానే వచ్చినది. వాద్యాలు వాయించే వారు మరింతగా వాయించసాగారు. మత్తయిదువులు మంగళ సూత్రమును గట్టిగ అలంకరించాడు. దేవతులు ఆనందముతో ఆ సమయములో పుష్పవర్షము కురిపించారు.
🍃🌹తరువాత విలువయిన మంచిముత్యాలతో తలంబ్రాలు పోసుకొన్నారు దంపతులు. ఈ విధముగా పద్మావతీ, శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవము జరిగినది.
🙏 *శ్రీ వేంకటేశ్వర లీలలు* 🙏 🍒 *భాగము 47* 🍒
September 16, 2023
Tags