⚜️ కురుది పూజ ⚜️
శబరిమలై మకరవిళక్కు ఉత్సవం ముగిసిన పిమ్మట చివరిదినం ఈ కురిదిపూజను నిర్దహిస్తారు. మండల మకర మహోత్సవ వేళలో కోట్లాది జనులు శబరిమలకు వచ్చి శ్రీ స్వామివారిని దర్శించి వెళ్ళియుందురు. ఆ దృష్టిదోషము తొలగుటకును స్వామివారి పరివార దేవతలను సంతృప్తి పరచుటకొరకును,దుర్దేవతల ఆగడం తొలగుటకును ఈ కురిది పూజ చేసెదరు. భారీగా అన్నం వండి ఎర్రటి రంగుల పొడులు అందులో కలపి పదునెట్టాంపడి ముంగిట యుంచి , గుమ్మడికాయ పగులకొట్టి , నిమ్మకాయ బలియిచ్చి , స్వామివారి కత్తితో ఆ అన్నమును కోసి ఆ పరిసర ప్రాంతమంతయు విసరెదరు. ఆ ప్రాంతము చుట్టూ తిరుగులాడు చుండు దుర్దేవతలు ఈ హవిస్సును తీసుకొని వెళ్తారన్నది ప్రతీతి.
🙏🌸ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌸🙏