⚜️ గురు పూజ ⚜️
తరువాత గురుస్వామికి నమస్కరించి ధ్యాన శ్లోకమును చెప్పి గురుదక్షిణ ఇచ్చి సర్వేశ్వరుని కృపా కటాక్షము వలనను , గురుస్వామి సాయముతోను శబరిగిరి వెళ్ళి సౌఖ్యముగా తిరిగి వచ్చి నందుకు గురుస్వామి కి అన్నాహార వస్త్రదానములు యథాశక్తిగా ఇచ్చి దక్షిణ తాంబూలాదులతో ఉపచరించి మాలను విసర్జించుకొనవలెను.
మాల విప్పి వ్రతము ముగించుటకు వున్న మంత్రము
గురుస్వామి గారు మాలధరించిన స్వామి మెడలో నుండి క్రింది కనబడు శ్లోకము చెప్పి మాలను తీసి చందనముతో అద్ది స్వామి వారిని కొండ ఎక్కించవలెను.
గురుస్వామి మాలతీయుటకు మంత్రము
అపూర్వమచలారోగా దివ్యదర్శన కారణ !
శాస్త్రుముద్రాత్ మహాదేవ దేహిమే వ్రతమోచనం !!
తదుపరి ఆ దినమంతయు భగవన్నామస్మరణలో గడుపుతూ సకుటుంబముతో స్వామి వారి ప్రసాదమును స్వీకరించవలెను. చక్కగా వ్రతమాచరించి శబరిగిరి చేరి స్వామి దర్శనమొనర్చుకొని వచ్చిన భక్తులను , వారి వంశీయులను కరుణామయుడైన స్వామి అయ్యప్ప సర్వదా కాపాడుతాడని దృఢముగా విశ్వసించ వచ్చును.
స్వామి శరణం
పంచాద్రీశ్వర మంగళమ్ హరిహర ప్రేమాకృతే మంగళమ్
పించాలంకృత మంగళమ్ ప్రణమతామ్ చింతామణేర్ మంగళమ్ |
పంచాస్యధ్వజ మంగళమ్ త్రిజగదామాద్య ప్రభో మంగళమ్
పంచాసోపమ మంగళమ్ హృది శిరోలంకార సన్మంగళమ్ ||
స్వామియే శరణమయ్యప్ప
🙏🌸ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌺🙏