*కృతయుగమున ధర్మము నాలుగు పాదములతో నడవగ క్రమముగ* 🌷
*చత్వారి భారతే వర్షే యుగాని ఋషయో బ్రువన్
*కృతం త్రేతా ద్వాపరశ్చ కలిశ్చేతి చతుర్యుగమ్ .
అని మత్స్యపురాణమున 118 అధ్యాయములో నాలుగు యుగములు చెప్పబడినవి. కృతయుగమున ధర్మము నాలుగు పాదములతో నడవగ క్రమముగ ప్రోసము చెందుచు కలియుగమున ఒక్క పాదముతోనడుచు నని చెప్పబడినది.
*ఇతి సూతవచః శ్రుత్వా నైమిషారణ్యవాసినః
*శౌనకాద్యా మహాభాగాః పప్రచ్చు స్తం కథా మిమామ్.
*హేసూత! సర్వధర్మజ్ఞ ! లోమహర్షణ పుత్రక
*త్రికాలజ్ఞ ! పురాణజ్ఞ! వద భాగవతీం కథామ్.
అర్ధం: లోమహర్షణ పుత్రుడగు ఉగ్రశ్రవసుని మాటలు వినిన నైమిషారణ్య వాసులగు మునిజనము భూత, భవిష్య ,వర్తమానములను, సర్వధర్మములను పురాణములను తెలిసిన లోమహర్షణను చూచి భగవత్సంబంధమగు కథను చెప్పుమని అడిగిరి.
🌺లోమహర్షణుడు. నైమిషారణ్య వాసులగు మహర్షులకు పురాణములను వినిపించుచుండెను. ఆ సమయమున తీర్థయాత్రలు చేయుచు బలదేవు డచ్చటకు వచ్చెను. ఋషు లందరు లేచి నిలబడి అతనికి నమస్కరించిరి. కాని లోమహర్షణుడు లేవలేదు. బలదేవుడు అతనిని అహంకారిగ తలచి క్రుద్ధుడై సంహరించెను. ఋషు లందరు తిరిగి అతనిని బ్రతికించుమని వేడుకొనగ బలదేవుడు లోమహర్షణుడు తిరిగి బ్రతుకుట సాధ్యము కాదు. ఇతని పుత్రుడగు ఉగ్రశ్రవసుడు (ఉగ్రశ్రవాః) మీకు పురాణ శ్రవణము చేయు నని చెప్పెను. కల్కి పురాణమునకు వక్త కూడా ఉగ్రశ్రవసుడే.
🌺 నైమిశారణ్యం:ఒకసారి మునులంతా బ్రహ్మ వద్దకు వెళ్లి కలిప్రభావం సోకని పుణ్య ప్రదేశం ఎక్కడైనా ఉంటే ఆ ప్రాంతంలో తాము తపోయజ్ఞ కార్యనిర్వహణ చేసుకుంటామని ప్రార్ధించారు. బ్రహ్మ కలియుగంలో సత్పురుషులను దృష్టిలో వుంచుకుని ఒక చక్రాన్ని సృష్టించి ఆ చక్రం ఎక్కడ ఆగుతుందో అక్కడ మునులను నివసించమని చెప్పాడు. ఆ చక్రం అన్ని లోకాలు తిరిగి చివరకు నైమిశారణ్య ప్రాంతంలో ఆగింది. చక్రం నేమి (అంచు) తాకిన భూప్రదేశం నైమిశంగా పిలవబడింది. చక్రం స్పృశించిన ప్రాంతం అరణ్యం కావడం వల్ల నైమిశారణ్యం అనే పేరు వచ్చింది. చక్రం భూమిని చీల్చుకుని దిగడం వల్ల అక్కడో నీటిగుండం. ఏర్పడింది. ఫలితంగా భూమి నుంచి పవిత్ర జలధారలు ఏర్పడ్డాయి.ఈ నైమిశారణ్యం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వుంది.