*అభిమన్యు పుత్రుడగు విష్ణురాతునికి సభలో భాగవతధర్మములను* 🌷
*కః కలి కుత్ర వా జాతో జగతా మీశ్వరః ప్రభుః
*కథం వా నిత్యధర్మస్య వినాశః కలినా కృతః.
*ఇతి తేషాం వచః శ్రుత్వా సూతో ధ్యాత్వా హరిం ప్రభుమ్
*సహర్షపులకోద్భిన్నసర్వాంగః ప్రాహ తాన్ మునీన్.
🌺అర్ధం : కల్కి ఎవరు? ఎక్కడ జన్మించెను? ఎట్లు లోకముల కధిపతి అయ్యేను? ఎట్లు నిత్యధర్మము నాశనం అవుతుంది అని మహర్షులు ప్రశ్నించిరి. వారి మాటలు వినిన ఉగ్రశ్రవసుడు హరిని ధ్యానించి, ఆనందపులకితుడై మహర్షుల కిట్లు చెప్పెను.
*శృణు ధ్వమీద మాఖ్యానం భవిష్యం పరమాద్భుతమ్.
*కథితం బ్రహ్మణా పూర్వం నారదాయ విపృచ్ఛతే.
*నారదః ప్రాహ మునయే వ్యాసా యామితతేజసే.
*స వ్యాసో నిజపుత్రాయ బ్రహ్మరాతాయ ధీమతే.
🌺అర్ధం :ఓమహర్షులారా! మిక్కిలి ఆశ్చర్యమును పొందు వృత్తాంతమును మీరు వినుడు. పూర్వకాలమున నారదుడికి బ్రహ్మ ఈ ఉపాఖ్యానము చెప్పెను. నారదుడు అమితతేజస్వీయగు వ్యాసునకు, వ్యాసమహర్షి తనపుత్రుడగు బ్రహ్మరాతునకు ఈ కథను చెప్పెను.
*సంచాభిమన్యుపుత్రాయ విష్ణు రాతాయ సంసది
*ప్రాహ భాగవతాన్ ధర్మా నష్టాదశసహస్రకాన్.
*తదా నృపే లయం ప్రాప్తే సప్తాహే ప్రశ్నశేషితమ్
*మార్కండేయాదిభిః పృష్టః ప్రాహ పుణ్యాశ్రమే శుకః
🌺అర్ధం : బ్రహ్మరాతుడు అభిమన్యు పుత్రుడగు విష్ణురాతునికి సభలో భాగవతధర్మములను వినిపించెను. అందు 18000 శ్లోకములు గలవు. రాజగు విష్ణురాతుడు మరణించగా పుణ్యాశ్రమమున మిగిలిన భాగవతధర్మములను మార్కండేయాది మహర్షులడు, శుకమహర్షి వారికి వివరించెను.