*మాయయొక్క గర్భమున లోభుడను పుత్రుడు, నికృతి యను కన్యకయు* 🌷
*తత్రాహం తదనుజ్ఞాతః శ్రుతవా నస్మియాః కథాః
*భవిష్యాః కథయామీహ పుణ్యా భాగవతీః శుభాః
*తాః శృణుధ్వం మహాభాగాః సమాహితధియో నిశమ్
*గతే కృష్ణ స్వనిలయం ప్రాదుర్భూతో యథా కలిః
🌺అర్ధం: శుకమహర్షి వలన పుణ్యాశ్రమమున వినిన పుణ్య ప్రదమగు భాగవతవృత్తాంతమును మీకు చెప్పెదను. శ్రీకృష్ణ భగవానుడు వైకుంఠమునకు వెడలిన పిమ్మట కలి పుట్టిన వృత్తాంతమును సావధానముగ వినుడు.
*ప్రలయాంతే జగత్ప్రృష్ణా బ్రహ్మా లోకపితామహః
*ససర్జ ఘోరం మలినం పృష్ఠదేశాత్ స్వపాతకమ్.
*స చాధర్మ ఇతి ఖ్యాత స్తస్య వంశాను కీర్తనాత్
*శ్రవణాత్ స్మరణాల్లో కః సర్వపాపైః ప్రముచ్యతే.
🌺అర్ధం: ప్రలయాంతమున సృష్టికర్తయగు బ్రహ్మ తన పృష్ఠ దేశమునుండి ఘోరము, మలినమునగు స్వీయ పాతకమును సృజించెను. ఆపాతకము అధర్ముడను పేరుతో ప్రసిద్ధి నొందెను.
*అధర్మస్య ప్రియా రమ్యా మిథ్యా మార్జారలోచనా
*తస్య పుత్రో౨. తితేజస్వీ దంభః పరమకోపనః
*సమాయాయాం భగిన్యాం తు లోభం పుత్రం చ కన్యకామ్
*నికృతిం జనయామాస తయోః క్రోధః సుతో భవత్
🌺అర్ధం: అధర్ముని భార్య పేరు మిథ్య. పిల్లి కళ్లు గలది. అయినా మనోహరమైనది. వారికి మిక్కిలి తేజస్సు, కోపముగల దంభుడను పుత్రుడు కలిగెను. మాయ వారి పుత్రిక. దంభునివలన తనసోదరియగు మాయయొక్క గర్భమున లోభుడను పుత్రుడు, నికృతి యను కన్యకయు కలిగిరి. లోభనికృతులకు క్రోధుడను కొడుకు పుట్టెను.