*క్రోధుని సోదరి హింస. ధుని వలన హింసకు కలి జన్మించెను* 🌸
*స హింసాయాం భగిన్యాం తు జనయామాస తం కలిమ్
*వామహస్తధృతోపస్థం తైలాభ్యక్తాంజన ప్రభమ్.
*కాకోదరం కరాలాస్యం లోలజిహ్వం భయానకమ్
*పూతిగంధం ద్యూతమద్య శ్రీసువర్ణకృతాశ్రయమ్.
🌺అర్ధం: క్రోధుని సోదరి హింస. ధుని వలన హింసకు కలి జన్మించెను. కలి ఎడమచేతిలో గుహ్యాంగము ధరించెను. అతడు తైలమిశ్రితము అగు కాటుక వలె నల్లగ నుండెను. కాకి పొట్ట, నల్లని ముఖము, వ్రేలాడు (జిహ్వ ) నాలుక కలిగి కలి భయంకరు డయ్యెను. కలి జూదము, మద్యము, స్త్రీ, సువర్ణముల నాశ్రయించి యుండెను.
*భగిన్యాం తు దురుక్త్యాం స భయం పుత్రం చ కన్యకామ్
*మృత్యుం స జనయామాస తయోశ్చ నిరయో భవత్.
*యాతనాయాం భగిన్యాం కు లేఖే పుత్రాయుతాయుతమ్
*ఇత్థం కలికులే జాతో బహవో ధర్మనిందకాః
🌺అర్ధం: కలికి తన సోదరియగు దురుక్తి వలన భయ నామకపుత్రుడు మృత్యువను పుత్రికయ కలిగిరి. మృత్యువునకు భయునివలన నిరయుడు జన్మించెను. యాతన నిరయుని సోదరి వారిద్దరికి అసంఖ్యాకులగు పుత్రులు జన్మించిరి. ఇట్లు కలి వంశమున అనేకులు ధర్మనిందకులు పుట్టిరి.
* యజ్ఞాధ్యయనదానాది వేదతంత్రవినాశకాః
*ఆధివ్యాధి జరాగ్లాని దుఃఖశోక భయాశ్రయాః
*కలిరాజానుగాశ్చేరు ర్యూథశో లోక నాశకాః
*బభూవుః కాలవిభ్రష్టాః క్షణికాః కాముకా నరాః
🌺అర్ధం: కలి వంశీయులు యజ్ఞము, అధ్యయనము, దానము మున్నగు వైదిక ధార్మిక కార్యములను నాశము చేయుచు, మానసిక వ్యథ, వ్యాధి, ముసలితనము, దుఃఖము, శోకము, భయముల నాశ్రయించి యుండిరి. కలిరాజు ననుసరించు సేవకజనము లోకమును పీడించుచు గుంపుగ తిరుగసాగిరి. వీరు కాలమున కతీతులై భోగలాలసులై, కామ స్వభావము గల వారయిరి.
🌺పైన వున్న అధ్యయనం బట్టి చూస్తే మహర్షులు తమ తప శక్తీ తో ముందుగానే ఊహించి మన సనాతన ధర్మం ఏ పరిస్థితి లో ఉంటుందో వివరించారు.ఈ కలి గురించి భవిష్య పురాణం,భాగవతం లో మరియు శ్రీ కృష్ణ భక్తుడైన చైతన్య మహా ప్రభు వ్రాసిన గ్రంధం లో వివరించబడ్డాయి.