*కలిని అనుసరించు జనులు పొట్టివారు, పాపపరాయణులు, వంచకులు* 🌹
*దంభాచార దురాచారా స్తోతమాతృ విహింసకాః
*వేదహీనా ద్విజా దీనాః శూద్రసేవాపరాః సదా.
*వేదవిక్రయిణో వ్రాత్కారస విక్రయిణ స్తథా.
*మాంస విక్రయిణః క్రూరా! శిశ్వోదరపరాయణాః
*పరదారరతా మత్తా వర్ణసంకర కారకాః
🌺అర్ధం:కలిరాజ జనము దంభాచారులు, దురాచారులై తల్లిదండ్రులను హింసించు చుండిరి. బ్రాహ్మణవంశమున పుట్టిన వారు వేదశాస్త్రములకు దూరమై, దరిద్రులై నిరంతరము శూద్ర సేవాతత్పరులైరి. వారు (బాహ్మణులు) కుతర్కములతో కాలయాపన చేయుచు అధార్మికులు, అధములు, ఉపనయనాది సంస్కార బాహ్యులు నయిరి. వారు ( కలిసేవకజనము) నిషిద్ధమగు వేద-మాంస రస విక్రయము జేయుచు క్రూరులై, కామతత్పరులై ఉదరతృప్తియే లక్ష్యముగ పరదారలయం దాసక్తులై మదించిన వారై వర్ణసంకర కారకు లగుచున్నారు.
*హ్రస్వాకారాః ; పాపసారాః శఠా మఠ నివాసినః
*షోడశాబ్దాయుషః శ్యాల బాంధవా నీచసంగమాః
*వాదకలహముబాః కేశవేశ విభూషణాః
*కలౌ కులీనా ధనినః పూజ్యా వారుషికా ద్విజాః
🌺అర్ధం: కలిని అనుసరించు జనులు పొట్టివారు, పాపపరాయణులు, వంచకులు, మథనివాసులు, పదహారుసంవత్సరము ఆయుర్దాయము గలవారు నైరి, వివాద, కలహములకు కారణభూతులై, కేశాదులు నలంకరించుకొనుట దాసక్తి కలవారు. కలి యుగమున కులీనులు మరియు ధనికులు వార్డుషికులగు ( వడ్డీ వ్యాపారము చేయువారు) పూజ్యులగు చున్నారు.