*కలియుగమున జనుల స్వభావం ఎట్లు ఉండును ?* 🌹
సన్యాసినో గృహాసక్తా గృహస్థా స్త్వవివేకినః!
గురునిందాపరా ధర్మధ్వజినః సాధువంచకాః!!
ప్రతిగ్రహరతాః శూద్రాః పరస్వ హరణాదరాః!
ద్వయోః స్వీకార ముద్వాహః శఠే మైత్రీ వదాన్యతా.!!
ప్రతిదానే క్షమాశక్తే విరక్తి కరణాక్షమే.!
వాచాలత్వం చ పాండిత్యే యశోర్థే ధర్మసేవనమ్.!!
అర్ధం:
🌺సన్యాసులు గృహ ధర్మం మీద ఆసక్తి అగురు. గృహస్థులు అవివేకులై గురునిందను చేయుచు, సాధువంచకులై తామాచరించునదియే ధర్మమని తలచుచున్నారు. శూద్రులు పరధనము నపహరించు వారయిరి. స్త్రీ పురుషుల సమ్మతియే వివాహము. వంచకులతో మైత్రి చేయుదురు. ప్రతిదానమునుచేయుచు తమను తాము ప్రశంసించుకొందురు. అపరాధము చేసినవారిని దండించక క్షమించెదరు. దుర్బలుల యెడ విరక్తి ప్రకటించెదరు. ఎక్కువ మాట్లాడుటయే పాండిత్యము. యశస్సును పొందుటకు మాత్రమే ధర్మకార్యములు చేయుదురు.
ధనాఢ్యత్వం చ సాధుత్వే దూరే నీరే చ తీర్థతా
సూత్రమాత్రేణ విప్రత్వం దండమాత్రేణ మస్కరే.
అల్పసస్యా వసుమతీ నదీతీరేవరోపితా
శ్రీయో వేశ్యాలా పసుఖాః స్వపుంసా త్యక్తమానసాః
అర్ధం:
🌺ధనవంతుని సాధుపురుషునిగా, దూరమందున్న జలము తీర్థజలముగ, యజ్ఞోపవీతధారణము చేతనే బ్రాహ్మణుడుగ, దండధారణము చేతనే సన్యాసిగ తలచుదురు. భూమి అల్పసస్యము పండునగును. జలము సమృద్ధిగ లేకపోవుటచే నదులు తీరములవెంబడివర్షించుచుండుటచే భూమియందు పంటలు తగ్గును. ప్రజారక్షకులు కావలసిన రాజులుకలియుగమున పన్నులచే ప్రజలను బాధించుచు ప్రజాభక్షకు లగుదురు.
స్కంధే భారం కరే పుత్రం కృత్వా శుభాః ప్రజా జనాః
గిరి దుర్గం వనం ఘోర మాశ్రయిష్యంతి దుర్భగాః
మధు మాంసై ర్యూలపులై రాహాణైః ప్రాణధారిణ:
ఏవం తు ప్రథమే పొదే కలే కృష్ణనినిందకాక:
అర్ధం:
🌺అభాగ్యజనము భుజమున భారము, చేతిలో పుత్రునితో దుర్గమ పర్వతములను ఘోరారణ్యములను ప్రవేశించి మధు- మాంస- కందమూల ఫలములను ఆహారముగ స్వీకరించుచు ప్రాణధారణ చేయుదురు. ఆవిధముగ కలియుగము ప్రథమపాదమున జనులు కాలయాపన చేయుచు శ్రీ కృష్ణనిందకులదురు.