🌺పదవ అధ్యయనం - విష్ణు సహస్రనామం పదవ భాగం
దేవక్యానందనో నందో రోహిణ్యాః ప్రియ ఏవచ
వసుదేవ ప్రియశ్చైవ వసుదేవ సుత స్తథా
దుందుభిర్షా సరూపశ్చ పుష్పహానస్తథైవచ
అట్టహాస ప్రియశ్చైవ సర్వాధ్యక్షుః క్షరో క్షరః
అచ్యుతశ్చైవ సత్యేశః సత్యాయాశ్చ ప్రియోవరః
రుక్మిణ్యాశ్చపతి శ్చైవ రుక్మిణ్యా వల్లభస్తథా
గోపీనాం వల్లభశైవ పుణ్యశ్లోకశ్చ విశ్రుతః
వృషాక పిర్య మోగుహ్యో మకులశ్చ బుధస్తథా
రాహు: కేతుర్రహోగ్రాహో గజేంద్రముఖ మేలకః
గ్రాహస్య వినిహంతాచ గ్రామణీ రక్షక స్తథా
కిన్నరశ్చైవ సిద్ధశ్చ ఛందః స్వచ్ఛంద ఏ వచ
విశ్వరూపో విశాలాక్షో దైత్య సూదన ఏవ చ
అనంత రూపో భూతస్ట్లో దేవ దానవ సంస్థితః
సుషుప్తి స్థః సుషుప్తిశ్చస్థానం స్థానాంత ఏవచ
జగత్ప్రత్పైన జాగర్తా స్థానం జాగరితం తథా
స్వప్నస్థః స్వప్నవిత్ స్వప్నస్థానం స్వప్నస్తథైవచ
జాగ్రత్స్వప్న సుషువైశ్చ విహీనో వై చతుర్ధకః
విజ్ఞానం వేద్యరూపం చ జీవోజీవయితా తథా
భువనాధిపతిశ్చైవ భువనానాం నియామకః
పాతాలవాసీ పాఠాలం సర్వశ్వర వినాశనః
పరమానంద రూపీచ ధర్మాణాంచ ప్రవర్తకః
సులభోదుర్లభశ్చైవ ప్రాణాయామ పరస్తథా
ప్రత్యాహారో ధారకశ్చ ప్రత్యాహార కరస్తథా
ప్రభాకాంతి స్తథాహ్యశ్చి: శుద్ధ స్ఫటిక సన్నిభః
అగ్నాహశ్చైవ గౌరశ్చ సర్వః శుచిరభిష్టుతః
వషట్కారో నషద్ వౌషట్ స్వధాస్వాహా రతిస్తథా
పక్తానంద యితాభోక్తా బోద్ధా భావయితా తథా
జ్ఞానాత్మాచైవ దేహాత్మా భూ మా సర్వేశ్వరేశ్వరః