*దేవతల పూజా విధానం*
శ్రీహరి పరమేశ్వరుడు తో ఇలా అన్నాడు .రుద్రదేవా! ధర్మార్దకామమోక్షాలను ప్రసాదించే సూర్యాది దేవతల పూజను వర్ణిస్తాను. గ్రహదేవతల మంత్రాలివి:
*ఓం నమః సూర్యమూర్తయే నమః
*ఓం హ్రాం హ్రీం సః సూర్యాయనమః
*ఓం సోమాయ నమః
*ఓం మంగలాయ నమః
*ఓం బుధాయ నమః
*ఓం బృహస్పతయే నమః
*ఓం శుక్రాయ నమః
*ఓం శనైశ్చరాయ నమః
*ఓం రాహవే నమః
*ఓం కేతనే నమః
*ఓం తేజశ్చండాయ నమః
🌹ఈ మంత్రాలను చదువుతూ ఆసన, ఆవాహన, పాద్య, అర్హ్య ఆచమనం స్నాన, వస్త్ర, యజ్ఞోపవీత, గంధ, పుష్ప ధూప, దీప, నమస్కార, ప్రదక్షిణ, విసర్జనాది ఉపచారాలను సమర్పిస్తూ గ్రహాలను పూజించాలి.