సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా
నుదిటి కుంకుమ రవి బింబముగా
కన్నులు నిండుగా కాటుక వెలుగా
కాంచన హారము గళమున మెరియగా
పీతాంబరముల శోభలు నిండగా
సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా
నిండుగా కరముల బంగరు గాజులు
ముద్దులొలుకు పాదమ్ముల మువ్వలు
గల గల గలమని సవ్వడి చేయగా
సౌభాగ్య వతుల సేవలు నందగా
సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా
నిత్య సుమంగళి ,నిత్య కళ్యాణి
భక్త జనుల మా కల్పవల్లివై
కమలాసనావై కరుణ నిండగా
కనక వృష్టి కరుణించే తల్లి
సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మ
జనక రాజుని ముద్దుల కొమరిత
రవికుల సోముని రమణి మణివై
సాధు సజ్జనుల పూజలందుకొని
శుభములు కలిగెడి దీవెనలు ఇయ్యగా
సౌభాగ్యా లక్ష్మి రావమ్మా అమ్మ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మ
కుంకుమ శోభిత పంకజ లోచని
వెంకట రామణుని పట్టపు రాణి
పుష్కలముగా పుణ్యములిచ్చే
పుణ్యమూర్తి మా ఇంట వెలసిన
సౌభాగ్య లక్ష్మి రావమ్మ అమ్మ
సౌభాగ్యా లక్ష్మి రావమ్మ అమ్మ
సౌభాగ్యమ్ముల బంగారు తల్లి
పురందర విఠలుని పట్టపు రాణి
శుక్రవారపు పూజలు నందగా
సాయం సంధ్యా శుభ ఘడియలలో
సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మ