పల్లవి: స్థిత ప్రజ్ఞతకు స్థిర నివాసము
స్థితిలో దొరకెడు కైవల్య పథము
ఆనంద నిలయుని ఆత్మ స్వరూపము
చిన్మయధామము శ్రీనివాసము;
చరణం 1. విధాత కడిగిన పదంబు నంటిన
విధికృతంబిక వేడుక కాదా
రథాంగ పాణిని రక్షణ వేడిన
సుధాంశ మవదా నరజన్మ!
చరణం 2: కొండల రాయుని అండను చేరిన
పండని భాగ్యంబెవరిదయా!
అండజయానుని ఆత్మను నమ్మిన
నిండగు నపుడే నరజన్మ!
చరణం 3: విహంగ వాహను వీక్షణ తోడనె
దహించి పోవును పాపాలూ
అహమును వీడీ అంతానీవని
స్మరించుటే కదా నరజన్మ!!
రచన
డా.రాంభట్ల వేంకట రాయ శర్మ
26/10/2021