*కల్కి పురాణం * రెండవ అధ్యయనం -ఆరవ భాగం*

P Madhav Kumar

 *బ్రాహ్మణుల   కొరకు  పదిసంస్కారములు ఏమిటి ?*  🌷

యజ్ఞాధ్యయనదానాది తపః స్వాధ్యాయ సంయమైక

ప్రీణయంతి హరిం భక్త్యా వేదతంత్ర విధానతః


తస్మాద్యథోపనయన కర్మణో...హం ద్విజైః సహ

సంస్కర్తుం బాంధవజనై స్వా మిచ్ఛామి రఖే దినే


🌺అర్ధం:

వారు ముఖ్యమగు వైదిక మార్గమును అనుసరించి యజ్ఞము, అధ్యయనము దానము, తపస్సు, స్వాధ్యాయము, సంయమనము మున్నగువానిచే భక్తి పూర్వకముగ హరిని తృప్తిపరచెదరు. కనుక నేను ద్విజులు, బాంధవులతో శుభదినమున నీకు ఉపనయన నుకొనుచున్నాను


పుత్ర ఉవాచ ......

వేదతే దశ సంస్కారా బ్రాహ్మణేషు ప్రతిష్ఠితాః

బ్రాహ్మణాః కేనవా విష్ణుమర్చయంతి విధానతః


🌺అర్ధం:

పుత్రుడు పలికెను. బ్రాహ్మణులకొఱకైన పదిసంస్కారము లేవి? బ్రాహ్మణులు ఏ ప్రకారముగ విష్ణువు నారాధించెదరు ?

తండ్రి ఇట్లు పలికెను ! దశవిధ సంస్కారము లివి వివాహము, గర్భాధానము, పుంసవనము, ( 3వమాసమున) సీమంతోన్నయనము ( 4,6 లేక 8 మాసములలో) జాతకర్మ, నామకరణము, అన్న ప్రాశనము, చూడాకరణము, ఉపనయనము, సమావర్తనము (విద్యపూర్తి చేసుకొని గురుగృహమునుండి తిరిగి వచ్చు సందర్భమున జరుగుసంస్కారము ).


పుత్ర ఉవాచ.........

పుస్తే ద్విజో యేన తారయం త్యఖిలం జగత్

సన్మార్గేణ హరిం ప్రీణన్ కామదోగ్ధా జగత్రయే.


🌺అర్ధం:

కల్కి పలికెను. సదాచారసంపన్నుడై హరిని కొలుచుచు, ముల్లోకములలో మనోరథములను తీర్చుచు, నిఖిలజగత్తును ఉద్దరించు బ్రాహ్మణు డెక్కడ కలడు?


పీతోవాచ.........

కలినా బలినా ధర్మఘాతినా ద్విజపాతి

నిరాకృతి ధర్మరతా గతా వర్ణాంతరాంతరమ్.


యేస్వల్ప తపసో విప్రాః స్థితాః కలియుగాంతరే

శిశ్నోదరభృతో ధర్మనిరతా విరతక్రియాః


🌺అర్ధం:

తండ్రి పలికెను. బలవంతుడు, ధర్మనాశకుడు, బ్రాహ్మణహంతకుడగు కలిచే పీడింపబడిన ధర్మతత్పరులగు ద్విజులు వర్షాంతరమునకు వెడలిరి. స్వల్ప తపస్సంపన్నులగు మిగిలిన బ్రాహ్మణులు కలియుగమున ఆధర్మమందాసక్తి కలవారై ఉదర, ఇంద్రియ సుఖములయందు వ్యాప్తులై తామాచరింపవలసిన క్రియాకలాపమును మరచిరి.


పాపసారా దురాచారాస్తేజోహీనాః కలావిహ

ఆత్మానం రక్షితులనైవ శక్తాః శూద్రస్య సేవకాః


ఇతి జనకవచో నిశమ్య కల్కి కలికులనాశ మనో భిలాష జన్మా

ద్విజనిజవచనైస్తదోపనీతో గురుకులవాస మువాస సాధునాథః


🌺అర్ధం:

తేజోహీనులై, తమను తాము రక్షించుకొనుటకు అసమర్థులై శూద్రులను సేవించుచున్నారు. తండ్రిమాటలు వినిన కల్కికి కలివంశమును నాశమును చేయవలెనని అభిలాష కలిగెను. పిమ్మట బ్రాహ్మణుల వచనముల ననుసరించి ఉపనయన సంస్కారము పూర్తి చేసుకొని గురుకుల వాసమునకు వెడలెన

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat