*వ్యాస, ధ్యాన, పూజలను చేస్తూ దేవతల ముద్రలను ఎలా పాటించాలి* 🌹
*నవవ్యూహార్చన విధి పూజ:*
🌺ఆపై సాధకుడు మండలమధ్యంలో దిశాభేదాను సారము తూర్పుతో మొదలెట్టి ఇంద్రాది దిక్పాలకులను వాటి ఆయుధాలతో సహా స్థాపించాలి. అలాగే పైకి ఓం బ్రహ్మణే నమః అనే మంత్రంతో బ్రహ్మదేవునీ ఓం అనంతాయ నమః అనే మంత్రం ద్వారా అనంతునీ వ్యాసం చేయాలి.
🌺ఈ ప్రకారంగా అందరు దేవతల వ్యాస, ధ్యాన, పూజనాలను చేస్తూ ఆయా దేవతల కెదురుగా వారి వారి ముద్రలను ప్రదర్శించాలి. అంజలి బద్ధ ముద్ర మొదటి ముద్ర. దీన్ని ప్రదర్శించడం వల్ల దేవసిద్ధి తొందరగా లభిస్తుంది. రెండవది వందినీ ముద్ర. మూడవదైన హృదయసర్త ముద్రను ఎలా ప్రదర్శించాలంటే ఎడమ పిడికిటిలో కుడి బొటనవ్రేలిని బంధించి ఎడమ బొటన వేలిని పైకెత్తి గుండెకు తగల్చాలి.
🌺 వ్యూహ పూజలో ఈ మూడింటిని సాధారణ ముద్రలుగా పరిగణిస్తారు. రెండు చేతుల వేళ్ళనూ ఒకదానికొకటి తగిలించి. వుంచి ఒక్కొక్క వ్రేలిని వదులుకుంటూ పోవడం ద్వారా ఎనిమిది ముద్రలు ఏర్పడతాయి.రెండు చేతుల బొటన వ్రేళ్ళను వాటి మధ్యమ, అనామిక, చిటికెన వ్రేళ్ళకు తగిలించి. క్రిందికి వంచి చూపే ముద్రను 'నరసింహ' ముద్ర అంటారు.
🌹వాస్తు సంబందిత దోషాలను తొలగించడంలో ఈ సూర్యుని ప్రతిమ గృహములో ,వ్యాపార సంస్థ లో ఉంచుకోవడం ఉత్తమం.
🌹సూర్యుడు నవగ్రహాలకు అధిపతి అటువంటి సూర్య దేవుని స్తోత్రం ప్రతిరోజు పఠించడం వలన మేధస్సు, విశ్వాసం,ఆరోగ్యం, ధైర్యం, బలం, నాయకత్వ లక్షణాలు, కీర్తి, విజయం, శక్తి లభిస్తాయి.
🌺 కుడిచేతిపై ఎడమ చేతిని ఉత్తనస్థితిలో పెట్టి ప్రతిమపై మెల్ల మెల్లగా తిప్పడాన్ని 'వారాహీ' ముద్ర అంటారు. ఆయా దేవుళ్ళకివి ప్రియమైన ముద్రలు. రెండు పిడికిళ్ళను బిగించి ఒకదానిపై నొకటిగా వుంచి ఒక్కొక్క వ్రేలినే మెలమెల్లగా విడిపించి మరల పిడికిళ్ళను బిగించడాన్ని అంగముద్ర' అంటారు. పది దిక్కుల పాలకులకూ సాధకుడు ఈ విధంగా ముద్రలను చూపించాలి.
🌺 భగవంతుడైన వాసుదేవుడు, బలరాముడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు క్రమంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్ధ దేవస్థానములకు అధికారులైన దేవతలు. కాబట్టి సాధకుడు క్రమంగా ఓం అం వాసుదేవాయనమః, ఓం ఆం బలాయ నమః, ఓం అం ప్రద్యుమ్నాయ నమః, ఓం అః అనిరుద్దాయ నమః అనే మంత్రాలతో పూజించాలి.
🌺 ఓంకారం, తత్సత్, హూం, క్రైం, భూః ఈ అయిదూ క్రమంగా, నారాయణ, బ్రహ్మ , నరసింహ మహావరాహ భగవానుల బీజమంత్రాలు,కాబట్టి సాధకుడు ఓం నారాయణాయ నమః మంత్రంతో భగవంతుడైన నారాయణుని ఓం తత్సత్ బ్రహ్మణే నమః అనే మంత్రంతో బ్రహ్మదేవునీ, ఓం హుం విష్ణవే నమః అనే మంత్రంతో విష్ణుదేవునీ, ఓం క్షాం నుసింహాయ నమః అనే మంత్రంతో నరసింహునీ, ఓం భూః మహా వరాహాయ నమః అనే మంత్రంతో ఆది వరాహాన్నీ పూజించాలి.