గాయత్రి మాతకి మూడు సంధ్యలలో ఉన్న మూడు పేర్లు ఏమిటి...??* 🌹

P Madhav Kumar

 *గాయత్రి మాత* 

గాయత్రి మాతకి మూడు సంధ్యలలో మూడు పేర్లు ఉన్నాయి..!!


🌺ప్రాతఃకాలం గాయత్రి, మధ్యాహ్నం సావిత్రి, సాయంకాలం సరస్వతి. ఒకే గాయత్రి మూడు నామములతో ఉన్నది. 


🌺సరస్వతి, సావిత్రి, గాయత్రి – ఈ మూడూ కూడా సృష్టి కారణమైన చైతన్య స్వరూపమైన జ్ఞాన రూపిణి అన్న అర్థాన్ని చెప్తున్నాయి.


🌺అదేవిధంగా ఈ మూడు రూపాలకి బ్రాహ్మీ, మాహేశ్వరీ, వైష్ణవీ, అని పేర్లు కూడా చెప్పబడుతున్నాయి.


🌺అంటే త్రిమూర్త్యాత్మకమైన శక్తి అంటే త్రిమూర్త్యాత్మకమై ముగురమ్మల స్వరూపంగా ప్రకాశిస్తున్నటువంటిది గాయత్రి.


🌺ఈ గాయత్రి "త్రిపద" అని ఋగ్యజుస్సామాత్మకంగా చెప్పబడుతూ ఉంటే "త్రిపుర" అని లలితారాధనలోఉంది. 


🌺ఈ విశ్వమంతా "త్రి" అన్న తత్త్వంతోనే ఉన్నది. భూతభవిష్యత్వర్తమాన కాలములు, ముల్లోకాలు, సత్వ - రజో - తమోగుణములు, సృష్టి స్థితి లయలు, అన్నీ మూడింటితోనే చెప్పబడుతున్నాయి.


🌺ఈ మూడింటితో ఉన్న విశ్వమంతా వ్యాపించిన శక్తి గనుక ఆ తల్లి "త్రిపదా గాయత్రి" అనిచెప్పబడుతున్నది. 


🌺అలాంటి గాయత్రీ ఆరాధనలో 24 అక్షరములూ కూడా 24 తత్త్వములకు సంకేంతంగా కూడా భావన చేశారు.


🌺అయితే ఈ 24 తత్వాలతోనే విశ్వమంతా ఉన్నది. అందుకే పంచముఖాలలో కూడా విశ్వ తత్త్వమేచెప్పబడుతున్నది.


🌺అక్షరములుగా 24 సంఖ్యలలో ఉందని ప్రత్యేకత కూడా అదే. అంతేకాదు మన వెన్ను దండంలోఉన్న పూసల సంఖ్య కూడా 24 యే.


🌺అంటే ప్రాణశక్తి సంచరించేటటువంటి వెన్నుదండంలో ఉండేటటువంటి ఆ విభజన కూడా 24 తోనే ఉన్నది.


🌺అలాగే ఒక వీణలో మెట్లు 24 ఉంటాయి. ఇలా గమనించినట్లైతే ఆ తత్త్వార్థ వర్ణాత్మికాం అని చెప్పినట్లుగా తత్త్వ సంఖ్యయైన 24 తో ఉన్నది.


🌺"పంచ కోశాంతర స్థితా" అని ఈ తల్లిని భావన చేశారు. ఈ పంచకోశ మధ్యంలో ఉన్నటువంటి పరతత్త్వస్వరూపిణిగా ఉన్నటువంటిది ఆ తల్లే అని తాత్త్వికమైన దర్శనం కూడా ఉంది.


🌺ఇలా గాయత్రీ ఆరాధన వల్ల ప్రాణశక్తి ఆరాధన చెప్పబడుతూ ఉన్నది. 


🌺"ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ" అని వర్ణించిన ప్రకారం. ఈ విధంగా విద్యాధిదేవతగా గాయత్రీదేవిని ఆరాధించడం ఉంది.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat