పుష్కరాములు / పుష్కరాలు

P Madhav Kumar

 


గురుడు మేషాది పన్నెండు రాశులలోనూ ప్రవేశించినపుడు మనకు 12 నదుల పుష్కరాలు వస్తాయని పెద్దలు నిర్ణయం. గురుడు పుష్కర సమయంలో  ఏ నదికి ప్రవేశము చేస్తాడో ఆ నదికి  ఆ సమయంలో ఎంతో ప్రాధాన్యంగలదని . పెద్దలను, పితృదేవతలను తలచుకొని ఆ పన్నెండు రోజులలోనూ చేసే పిండప్రదాన,తర్పణ,దానాది కార్యక్రమములు చేయుట వల్ల పెద్దలకు పుణ్యలోకాలు ప్రాప్తి కలుగుతుంది అని పూర్వగ్రంధముల నిర్ణయం.  మానవుల పాపాల వల్ల నదులు అపవిత్రమై ఆ నదులు పాపాలు భరించలేక బాధ పడుతుంటె పుష్కరుడు అనే మహానుభావుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి బ్రహ్మ దేవుని అనుగ్రహం పొంది తనను ఒక పవిత్ర క్షేత్రంగా మార్చమని  పుష్కరుడు పుష్కర తీర్థం గా మారి స్వర్గలోకమున మందాకిని నది యందు అంతర్భూతమై ఉన్నాడు.
బృహస్పతి, బ్రహ్మ, పుష్కరులు కలసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం గ్రహరూపంలో ఉన్న బృహస్పతి మేషం మొదలు పన్నెండు రాశులలో ప్రవేశించేటప్పుడు పన్నెండు రోజులు మిగిలిన కాలం సంవత్సరమంతా మధ్యాహ్న సమయంలో రెండు మూహూర్తాల సమయం పుష్కరుడు బృహస్పతితో ఉండాలని నిర్ణయించారు. ఆ సమయంలో సమస్త దేవతలు బృహస్పతి అధిపతిగా ఉన్న నదికి పుష్కరునితో వస్తారు కనుక పుష్కరకాలంలో నదీ స్నానం పుణ్యప్రథమని పురాణాలు చెప్తున్నాయి.

పుష్కర నిర్ణయం
మేష రాశిలో గురు ప్రవేశం వల్ల ‘గంగా నది’ పుష్కరాలు
వృషభ రాశిలో ప్రవేశిస్తే ‘రేవా నది’ పుష్కరాలు
మిథున రాశిలో ప్రవేశిస్తే ‘సరస్వతీ నది’ పుష్కరాలు
కర్కాటక రాశిలో ప్రవేశిస్తే ‘యమునా నది’ పుష్కరాలు
సింహ రాశిలో ప్రవేశిస్తే ‘గోదావరి’ పుష్కరాలు
కన్యా రాశిలో ప్రవేశిస్తే ‘కృష్ణా నది’ పుష్కరాలు
తులారాశిలో ప్రవేశిస్తే ‘కావేరి నది’ పుష్కరాలు
వృశ్చిక రాశిలో ప్రవేశిస్తే ‘భీమరథీ నది’ పుష్కరాలు
ధనస్సు రాశిలో ప్రవేశిస్తే ‘పుష్కరవాహిని’ పుష్కరాలు
మకర రాశిలో ప్రవేశిస్తే ‘తుంగభద్ర నది’ పుష్కరాలు
కుంభ రాశిలో ప్రవేశిస్తే ‘సింధు నది’ పుష్కరాలు
మీన రాశిలో ప్రవేశిస్తే ‘ప్రణీత నది’ పుష్కరాలు.

పుష్కరములు - ప్రత్యక వివరణ భాగము - 2
గోదావరినదియందు పుష్కరరాజు మూడుకోట్ల యాబది లక్షల తీర్దములతోకూడి ప్రవేశించును. పుష్కర ప్రారంభమున 12 దినములు,పుష్కరాంత్యమున 12 దినములు హిందువులు యావన్మంది స్నాన తీర్థ శ్రాద్థా దానది ధర్మములు ఆచరించినయెడల పుష్కర పుణ్యఫలము పొందగలుగుదురనుటలొ సందేహములెదు.. శుభుడైన గురుగ్రహానికి సరిగ్గా ‘సంవత్సరం’ కాలం పడుతుంది రాశి మారటానికి. ఆ రాశి మారటవల్ల నదులకు పుష్కర సమయముగా  చెప్పవచ్చు,
పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. ఈ మొదటి మరియు చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.

యస్మిన్ దినే సురగురు: సింహస్థోపియుతో భవేత్ !

తస్మింస్తు గౌతమీస్నానం కోటిజన్మాఘ నాశనం !

గురుడు సింహరసియందు ఉండగా సమస్తలోకములండలి పుణ్య తీర్ధములు గోదావరి నది యందు చేరియుందగా చేసిన స్నానం కోటి జన్మల పాపమును నాశనం చేయగలదని ప్రతి ఒక్కరు తప్పక స్నానం ఆచరించుట శుభం. పూర్వం తుందిలుడనే ధర్మాత్ముడు  తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాడు. తందిలుడు ఈశ్వరునితో తనకు శాశ్వతంగా ఈశ్వరునిలో స్థానంకావాలని కోరుకున్నాడు. ఈశ్వరుడు తన అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో అతనికి శాశ్వత స్థానం ఇచ్చాడు. దానితో అతడు మూడున్నర కోట్ల పుణ్యతీర్ధాలకు అధికారి అయ్యి  సకల జీవరాశిని పోషించగలిగే శక్తి పొందాడు  పోషించే శక్తిని సంస్కృతంలో పుష్కరం అంటారు. అలా తందిలుడు పుష్కరుడైయ్యాడు.

బ్రహ్మదేవునికి సృష్టి చేయవలసిన అవసరం ఏర్పడినప్పుడు జలంకోసం ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకుని జల సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన పుష్కరుని తనకు ఇవ్వవలసినదని కోరుకున్నాడు. ఈశ్వరుడు అందుకు అంగీకారం తెలుపగానే పుష్కరుడు బ్రహ్మదేవుని కమండంలంలోకి ప్రవేశించాడు. బ్రహ్మ కార్యం పూర్తి అయిన తరువాత బృహస్పతి ప్రాణులకు జీవాధారమైన జలంకావాలని బ్రహ్మదేవుని ప్రార్ధించాడు .ఆ కోరికను బ్రహ్మదేవుడు మన్నించాడు కానీ పుష్కరుడు తాను బ్రహ్మదేవుని వదలి రానని అన్నాడు. అప్పుడు బృహస్పతి, బ్రహ్మ, పుష్కరులు కలసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం గ్రహరూపంలో ఉన్న బృహస్పతి మేషం మొదలు పన్నెండు రాశులలో ప్రవేశించేటప్పుడు పన్నెండు రోజులు మిగిలిన కాలం సంవత్సరమంతా మధ్యాహ్న సమయంలో రెండు మూహూర్తాల సమయం పుష్కరుడు బృహస్పతితో ఉండాలని నిర్ణయించారు. ఆ సమయంలో సమస్త దేవతలు బృహస్పతి అధిపతిగా ఉన్న నదికి పుష్కరునితో వస్తారు కనుక పుష్కరకాలంలో నదీ స్నానం పుణ్యప్రథమనిఅనేక గ్రందములు ఋషులుతెలిపారు. గురుడు మేష రాశిలో ప్రవేశించిన కాలంలో మనకి ‘గంగా నది’ పుష్కరాలు వస్తాయి. మళ్ళీ మనకి తిరిగి గంగానది పుష్కరాలు రావాలంటే 12 సంవత్సరాలు పూర్తి అయితే తప్పరాదు అని అర్థం.

పూర్వం మహర్షులు భారతదేశం పుణ్యనదుల మహిమలను ప్రజలకు తెలియచెప్పారు. తీర్థరాజైన వరుణుని సర్వతీర్థాలలో గంగాది మొదలైన ద్వాదశ నదులలో ఒక సంవత్సరానికి ఒక నదిలో నివశించమని కోరారు. మహర్షుల విన్నపానికి వరుణ దేవుడు సమ్మతించాడు. సూర్య, చంద్రాది గతులను బట్టి పరిగణలోకి తీసుకోవడం కుదరదు. కావున గురు సంచారాన్ని బట్టి తాను ఆయా నదుల్లో నివశిస్తానని మాటిచ్చాడు. దానినిబట్టి ఆయా నదులకు పుష్కరాలు జరుపుకోవాలని మహర్షులు నిర్ణయించారు.అప్పటి నుంచి బృహస్పతి ఆయా రాశులలో సంచరించినప్పుడు గంగా దేవతాది 12 నదులకు పుష్కర ప్రవేశం కలిగి పుణ్య ప్రదేశాలయ్యాయి.

అయితే పుష్కర కాలం ఎంతో విలువైనది. ఆ సమయంలో సకల తీర్థాలలోనూ కలిసి వచ్చి పుష్కరుడు ఏ నదికి పుష్కరాలో ఆ నదియందు ఉంటాడు కనుక. ఆ సమయంలో ఎంతో ప్రాధాన్యం ఆ నదికి ఆ సంవత్సరమంతా ఉంటుంది. పెద్దలను, పితృదేవతలను తలచుకొని ఆ పన్నెండు రోజులలోనూ చేసే దానాలు కూడా ఉంటాయి.
పురాణాలలో చెప్పబడిన పుష్కర సమయంలో చేయవలసిన దానాలు.

మొదటి రోజు;- సువర్ణ దానం,రజితము దానం,ధాన్య దానం ,భూదానం చేయాలి.
రెండవరోజు;-వస్త్ర దానం,లవణ దానం,రత్న దానం చేయాలి.
మూడవ రోజు;- గుడ(బెల్లం),అశ్వశాఖ,ఫల దానం చేయాలి.
నాల్గవ రోజు;-ఘృతం(నెయ్యి)దానం,తైలం(నూనె)దానం,క్షీరం(పాలు),మధువు(తేనె)దానం చేయాలి.
ఐదవ రోజు;-ధాన్యదానం ,శకట దానం,వృషభదానం,హలం దానం చేయాలి.
ఆరవవ రోజు;-ఔషధదానం,కర్పూరదానం,చందనదానం,కస్తూరి దానం చేయాలి.
ఏడవ రోజు;-గృహదానం,పీట దానం,శయ్య దానం చేయాలి.
ఎనిమిద రోజు;-చందనం,కందమూలాల దానం,పుష్ప మాల దానం చేయాలి.
తొమ్మిదవ రోజు;-పిండ దానం,దాసి దానం,కన్యాదానం,కంబళి దానం చేయాలి.
పదవ రోజు;-శాకం(కూరగాయలు)దానం,సాలగ్రామ దానం,పుస్తక దానం చేయాలి.
పదకొడవ రోజు;-గజ దానం చేయాలి.
పన్నెండవ రోజు;-తిల(నువ్వులు)దానం చేయాలి.
 శ్రీ మన్మధనామ సంవత్సరం అధిక ఆషాడ బహుళ త్రయోదశి జయవారం [మంగళవారం]అనగా ది . 14-07-2015 తేది ఉదయం 6గం. 25 నిమిషములకు [ద్రిక్సిద్ధపద్ధతిన ..భారత ప్రభుత్వము ప్రకారము] సార్ధ త్రికోటి తిర్ధరాజ సహిత గోదావరి పుష్కర ప్రారంభం. అప్పటి నుంచి పన్నెండు రోజులు పుష్కర దినములుగా అవుతాయి.

సూర్య సిద్ధాంత ప్రకారము
శ్రీ మన్మధనామ సంవత్సరం అధిక ఆషాడ బహుళ షష్టి జయవారం [మంగళవారం]అనగా ది . 07-07-2015 తేది ఉదయం గోదావరి పుష్కర ప్రారంభం. అప్పటి నుంచి పన్నెండు రోజులు పుష్కర దినములుగా అవుతాయి.

పుష్కరము అంటే పుణ్యకాలము. సూర్యోదయ కాలం నుండి మధ్యాహ్నంలోగా పుష్కర నదిలో స్నానం చేసి బ్రాహ్మణులకు యధాశక్తి దానాలు చేయుట మంచిది. ఈ పుష్కర దినములు 12 రోజులలో నదీ స్నానం చేయలేనివారు, పుష్కర దినములు గడచిన పిమ్మట మధ్యాహ్న కాలమందు రెండు ఘడియలలో స్నానం చేసి దానము చేస్తే పుష్కర స్నాన ఫలం లభిస్తుంది.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat