తిరుమణిక్కూడం*
🍁వరదరాజ పెరుమాళ్. స్వామికి మణిక్కూడ నాయకన్ అని మరి ఒక తిరునామం కలదు. తిరుమామగాళ్ తాయార్. ఈ క్షేత్రం శీర్హాళి నుంచి 10 కి. మీ. దూరంలో ఉన్నది.
🍁ఏకాదశ రుద్రులు, దేవతలు ఈ స్వామిని ఆరాధించారు. పెరియాళ్వార్, తిరుమొషి ఆళ్వార్, తిరుమంగైయాళ్వార్ స్వామిని తమ పాశురములతో స్తుతించారు. స్వామి చంద్రునికి, గరుత్మంతుడికి ప్రత్యక్షమైనాడు.
*స్థలపురాణం:*
🍁దక్షుడు తన 27 మంది కూతుళ్లను చంద్రునికిచ్చి పెళ్లి చేస్తాడు. చంద్రుడు అందరిని సమానంగా చూసుకుంటానని మామగారికి చెప్పినప్పటికీ, రోహిణిపై ఎక్కువ ప్రేమతో ఉంటాడు. ఈ విషయం మిగతా కూతుళ్లు తండ్రి దృష్టికి తెస్తారు.
🍁కోపగించుకున్న దక్షుడు చంద్రుడు తన కాంతిని కోలుపోతాడని శపిస్తాడు. తన శాపం పోగొట్టుకోడానికి చంద్రుడు చాల ఆలయాలు సందర్శించి, ప్రయత్నం ఫలించక చివరగా మణిక్కూడం వచ్చి అక్కడ శ్రీహరిని ధ్యానిస్తాడు. శ్రీహరి వరదరాజ పెరుమాళ్ రూపంలో ప్రత్యక్షమై చంద్రుడిని శాప విముక్తుడిని చేస్తాడు.