*కల్కి పురాణం *మొదటి అధ్యయనం - ఎనిమిదవ భాగం*

P Madhav Kumar

 *కలియుగం నందు ధర్మం ఎటువంటి పరిస్థితి లో   ఉండును ?* 🌷

ద్వితీయే తన్నామహీనా స్తృతీయే వర్ణసంకరాః

ఏక వర్గా శ్చతుర్ధే ద విస్కృతాచ్యుత సత్రియాః


నిఃస్వాధ్యాయ స్వధా స్వాహా నౌష డోంకార వర్జితాః

దేవాః సర్వే నిరాహారా బ్రహ్మాణం శరణం యయుః


🌺 *అర్ధం:* 

కలియుగము ద్వితీయ పాదమున ప్రజలు శ్రీకృష్ణుని నామోచ్చారణము కూడ చేయరు. మూడవ పాదమున వర్ణసాంకర్యము, నాల్గవ పాదమున బ్రాహ్మణాది నాలుగు వర్ణముల స్థానమున ఒక్క వర్ణమే యేర్పడి శ్రీకృష్ణుని ఆరాధించుట పూర్తిగ మరచెదరు. ఇట్లు స్వాధ్యాయము, స్వధా, స్వాహా, వషట్, ఓం కారాదులు అంతమగుటచే (యజ్ఞ కార్యక్రములు ) సమస్త దేవతలు ఆహారము లేని వారయిరి. అప్పుడు వారు బ్రహ్మదేవుని శరణు వేడిరి.


ధరిత్రీ మగ్రత : కృత్వా క్షీణాం దీనాం మనస్వినీమ్

దదృశు రహ్మణో లోకం వేదధ్వని నినాదితమ్ 


యజ్ఞధూమైః సమాకీర్ణం మునివర్యనిషేవితమ్

సువర్ణవేదికామధ్యే దక్షిణావర్త ముజ్జ్వలమ్


🌺 *అర్ధం:* 

దుర్బల దీనముతో, మనస్విని యగు భూమిదేవిని వెంటబెట్టుకొని దేవతలందరు బ్రహ్మలోకమునకు వెడలిరి. వేదగానములతో ప్రతిధ్వనించు బ్రహ్మలోకమును వారు చూచిరి. అచ్చట సువర్ణ వేదికా మధ్యదేశమున దక్షిణావర్తమను అగ్ని జ్వలించు చున్నది. అప్రదేశమంతయు మునీశ్వరులచే సేవింబడుచు యజ్ఞరూపముచే వ్యాప్తమైయున్నది.


వహ్నియూపాంకితోద్యాన వన పుష్ప ఫలాన్వితమ్

సరోభిః సౌరసైః హంపై రాహ్వయంత మివాతిథిమ్.


వాయులోల లతాజాల కుసుమాలికులాకులైః

ప్రణామాహ్వాన సత్కార మధురాలాపవీక్షణైః 


🌺అర్ధం:

యాగీయ పశుబంధము కొఱకు ఉపయోగించు స్తంభమునకు యూపమని పేరు. అట్టి యూపముతో కూడినదై బ్రహ్మలోకము పుష్ప ఫలాన్వితములయిన ఉద్యానవనములతో శోభిల్లుచుండెను. అతిథులను ఆహ్వానించుచున్నవా యన్నట్లు శబ్దములు చేయు సార సభా పేరు. అట్టి యూపముతో కూడినదై బ్రహ్మలోకము పుష్ప ఫలాన్వితములయిన ఉద్యానవనములతో శోభిల్లుచుండెను.


🌺 అతిథులను ఆహ్వానించుచున్నవా యన్నట్లు శబ్దములు చేయు సారస - హంసలతో నిండిన సరోవరము అచ్చట గలవు. వాయుసంచారముచే కదలుచున్న లతా పుష్పముల పైవ్రాలెడి తుమ్మెదల ఝంకారములు పథిక జనమునకు ప్రణామ- ఆహ్వాన - సత్కార - మధురాలాప- వీక్షణములు చేయు చున్నవి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat