*జ* : యోగమాయ శ్రీకృష్ణుని కంసకారాగారం నుండి నందవ్రజానికి చేర్చడానికై అవతరించిన మూర్తి. తన శిశురూపాన్ని వదలి, లీలామయమైన అష్టభుజ స్వరూపాన్ని ప్రకటించి అంతర్ధానమయ్యింది. భాగవతం ఇంతవరకు చెబుతోంది.
కానీ ఆ స్వరూపం వింధ్య పర్వతంలో నెలకొని, దేవతలచే ఋషులచే పూజలందుకుంటూ - క్రమంగా శుంభ నిశుంభులనే రాక్షసుల్ని సంహరించి జగతిని కాపాడిందని 'దేవీమాహాత్మ్యం' (మార్కండేయపురాణం) చెబుతోంది. ఈ శక్తి పేర్లు నందాదేవి, వింధ్యవాసిని.