*శక్తిస్వరూపులైన ఓ శివాదిదేవతలారా ! శ్రీలక్ష్మీ సిద్ధి ప్రాప్తి విధివిధానాలు* 🌸
శక్తిస్వరూపులైన ఓ శివాదిదేవతలారా! ఇక శ్రీలక్ష్మీ సిద్ధి ప్రాప్తి విధివిధానాలు చూద్దాం. ఏదైనా పుణ్యకార్యానికై ప్రత్యేకంగా నేలకి కాస్త ఎత్తులో నిర్మింపబడి చదును చేయబడి పవిత్రీకరింపడిన ప్రత్యేక ప్రదేశాన్ని స్థండిలమంటారు.
🌺ముందుగా ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మి నమః అని జపించి శ్రాం శ్రీం శ్రూం శ్రైం శ్రౌం శ్రఃఅనే బీజాక్షరాలను మంత్రానికి కోడిస్తూ క్రమంగా హృదయ, శిర, శిఖ, కవచ, నేత్ర, అస్త్రాలలో ఈ ప్రకారంగా షడంగన్యాసం చేసుకోవాలి.
*ఓం శ్రాం హృదయాయ నమః
*ఓం శ్రీం శిరసే స్వాహా
*ఓం శ్రూం శిఖాయై వషట్
*ఓం శ్రైం కవచాయ హుం
*ఓం శ్రౌం నేత్రత్రయాయ వౌషట్ :
*ఓం శ్రః అస్త్రాయ ఫట్ :
🌺సాధనారతుడైన భక్తుడు అంగన్యాసం తరువాత శ్రీమహాలక్ష్మిని పూజించాలి.
🌺తరువాత ఒక మండలాన్ని నిర్మించి నాలుగు రంగులు అద్ది గర్భస్థానంలో పద్మాన్ని, నిర్మించాలి, దానికి అరవై నాలుగు రేకులను కల్పించాలి. మధ్యలో లక్ష్మిని చిత్రించి ఒక వైపు దుర్గ నుంచి మిగతా అందరు దేవతలనూ విష్ణుపూజ వలే స్థాపించాలి. హవనమూ చేయాలి.
🌺తరువాత
*ఓం ఘం టం దం హం శ్రీ మహాలక్ష్మ్యై నమః అనే మహామంత్రంతో లక్ష్మీదేవిని పూజించాలి.
🌺ఇటు పిమ్మట సాధకుడు ఓం సౌం సరస్వత్యై నమః ..ఓంహ్రీం సౌం సరస్వత్యై నమః .. ఓం హ్రీం వద్ద వద వాగ్వాదిని స్వాహా.. ఓం హ్రీం సరస్వత్యై నమః .. అను మంత్రాలనుచ్చరించి సరస్వతీ దేవికి నమస్కరించాలి.