త్రిగుణం తద్దంథియుక్తం వేద ప్రవర సంమితమ్
శిరోధరాన్నాభిమధ్యాత్ వృషార్థ పరిమాణకమ్
యజుర్విదాం నాభిమితం సామగానామయం విధిః
వామస్కంధేన విధృతం యజ్ఞసూత్రం బలప్రదమ్.
🌺అర్ధం:
మూడు పేటలుగ చేయబడి (మూడు దారములతో గూడిన) గ్రంథులతో గూడిన యజ్ఞసూత్రమును యజ్ఞో పవీతధారణయోగ్యములగు వేదప్రవరలతో గూడి ధారణచేయవలెను. కంఠదేశము నుండి.
మృద్బస్మచందనాద్యైస్తు ధారయేత్తిలకం ద్విజః
భాలే త్రిపుండ్రం కర్మాఙ్గం దేశపర్యంతముజ్ఞులమ్.
పుండ్రమంగుళిమానం తు త్రిపుండ్రం తత్రిధా కృతమ్
బ్రహ్మవిష్ణుశివావాసం దర్శనాత్ పాపనాశనమ్.
🌺అర్ధం:
బ్రాహ్మణుడు మట్టి, భస్మ, చందనాదులతో తిలకమును, ధారణము చేయవలెను. కేశపర్యంతము చేయబడిన ఉజ్వలనుగు త్రిపుండ్రము ధార్మికముగు కర్మకు అంగము.
అంగుళి పరిమాణకముగు పుండ్రమును మూడుసార్లు ధారణచేసిన త్రిపుండ్రమందురు. ఇందు బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు నివాసముందురు, త్రిపుండ్రదర్శనము పాపనాశకము.
బ్రాహ్మణానాం కరే స్వర్గా వాచో వేదాః కరే హరిః
గాత్రే తీర్ధాని రాగార నాడీషు ప్రకృతి శ్రీవృత్.
సావిత్రీ కంఠకుహరా హృదయం బ్రహ్మసంజ్ఞితమ్
తేషాం స్తనాంతరే ధర్మః పృష్టో ధర్మః ప్రకీర్తితః
🌺అర్ధం:
భాష బ్రాహ్మణుల వాక్కు లయందు వేదము హస్తమున స్వర్గము, శరీరనుందు తీవ్రములు, ప్రీతి నాధుల యందు త్రివత్ ప్రకృతి ( తేజస్సు జలము అన్నములను త్రివృతి ప్రకృతి యందురు.) కంఠదేశమున పావిత్రి విరాజిల్లుచున్నవి.
బ్రాహ్మణుని హృదయము బ్రహ్మస్వరూపము, వారి కంఠదేశమున సావిత్రి విరాజిల్లుచున్నవి. బ్రాహ్మణుని హృదయము బ్రహ్మస్వరూపము, వారి స్తనములనడుమ ధర్మము, స్పష్టభాగమున ఆధర్మము కలవు.
భూదేవా బ్రాహ్మణా రాజన్ ! పూజ్యా వంద్యాః సదుక్తిభిః
చతురా క్రమ్యకుళలా మమ ధర్మప్రవర్తకా
బాలాశ్చాపి జ్ఞానవృద్ధాస్తపోవృద్దా మమ ప్రియాః
తేషాం వచః పొలయితు మనతారాః కృతామయా.
🌺అర్ధం:
ఓ రాజా! భూదేవులగు బ్రాహ్మణులు బ్రహ్మచర్యము గాంస్యము, వానప్రష్టము, సన్యాసమను నాలుగు ఆశ్రమముల యందు నిపుణులు, సనాతనధర్మ ప్రవర్తకులు కనుక వారు సదుక్తులరే పూజ్యులు వంద్యులు; జ్ఞానవృద్దులు, తపోవృద్ధులగు బ్రాహ్మణులు బాలురయినను ప్రియులు. వారి ఆజ్ఞను పాలించుటకు నేను అవతరించెదను.
మహాభాగ్యం బ్రాహ్మణానాం సర్వపాప ప్రణాశనమ్
కలిదోషహరం శ్రుత్వా ముచ్యతే సర్వతో భయాత్.
ఇతి కల్కివచః శ్రుత్వా కలిదోషవిశాతనమ్
ప్రణమ్య తం శుద్ధమనాః ప్రయయౌ వైష్ణవాగ్రణీః
🌺అర్ధం:
బ్రాహ్మణుల నుండి ధర్మమును వినుట వలన సర్వపాపములును పోవును. కలిదోషములు దూరమగును. సమస్త భయములు నశించును. ఇది యెంతయో మహాభాగ్యము. కలిదోషములను పోగొట్టు కల్కి, వచనములు విని శుద్ధ మనస్కుడు, వైష్ణవాగ్ర గణ్యుడు వేగువచనములు విని శుద్ధ మనస్కుడు, వైష్ణనాగ్ర గణ్యుడు నగు విశాఖయూపుడు కల్కికి నమస్కరించి వెడలేను
🌹 తరువాయి భాగం