*శ్రీ మహా విష్ణు దేవతలకు కల్కి అవతారం విశిష్టత గురించి చెప్పుట* 🌷
అత్యుదీరిత మాకర్ణ్య బ్రహ్మా దేవగణై ర్వృతః
జగామ బ్రహ్మసదనం దేవాశ్చ త్రిదివం యయుః
మహిమాం స్వస్య భగవాన్ నిజజన్మకృతోద్యమః
విప్రర శంభలగ్రామ మావివేళ పఠాత్మకః
🌺అర్ధం:
విష్ణుమూర్తి మాటలు వినిన పిమ్మట బ్రహ్మ బ్రహ్మలోకమునకు, దేవతలు స్వర్గలోకమునకు వెడలిరి. ఓ విప్రశ్రేష్ణా! విష్ణుభగవానుడు దేవతలకు చెప్పిన ప్రకారము శంభల గ్రామమున జన్మించునని చెప్పెను.
సుత క్యాం విష్ణుయశసా గర్భ మాధత్త వైష్ణవమ్
గ్రహనక్షత్ర రాశ్యాది సేవిత శ్రీపదాంబుజమ్.
సరిత్సముద్రా గిరియో లోకాః సస్థాణుజంగమా:
సహరా ఋషయో దేవా బారే విల్లా జగత్సతో.
బభూవుః సర్వసత్త్వానా మానంద వివిధాశ్రయాః
నృత్యంతి పితరో హృష్ణాస్తుష్టా దేవా జగుర్యశః
చక్రు ర్వాద్యాని గంధర్వా ననృతు శ్చాప్సరో గణాః
🌺అర్ధం:
శ్రీమహావిష్ణువు మానవ గర్భమున జన్మించగానే నదులు,సముద్రములు, పర్వతములు, లోకములు అనగా స్థావరజంగమములు, ఋషిగణము, దేవతలుమిక్కిలి ప్రసన్నులయిరి. సమస్తప్రాణులు తమ ఆనందమును ప్రకటించినవి. పితృదేవతలుఆనందముతో నృత్యము చేసిరి. దేవతలు సంతోషముతో విష్ణుమూర్తి యశస్సును గానము చేసిరి.గంధర్వులు వాద్యములు వాయించిరి.
ద్వాదశ్యాం శుక్లపక్షస్య మాధవే మాసి మాధవమ్
జాతం దదృశతుః పుత్రం పితరౌ హృష్టమానసా.
ధాతృమాతా మహాషష్ఠీ నాభిచ్చేత్రీ తదంబికా
గంగోదకర్లేదమోక్షా సావిత్రీ మార్జనోద్యతా.
🌺అర్ధం:
వైశాఖశుక్ల ద్వాదశి నాడు మాధవుడు భూమి యందు అవతరించెను. తండ్రి విష్ణుయశస్సు, తల్లి సుమతి మిక్కిలి ఆనందముతో పుత్రుని చూచిరి. మహాషష్ఠి (దుర్గాదేవి యొక్క ఒకమూర్తి పేరు ) బాలునికి ధాత్రి (రక్షకురాలు) అయ్యెను . అంబిక (దుర్గ) బాలుని బొడ్డు కోసెను. సావిత్రి గంగాజలముతో బాలునికి నీళ్లు పోసెను.
గాయత్రీ నామ పూర్వాహ్న సావిత్రీ మధ్యమే దినే
సరస్వతీ చ సాయాస్నే సైన సంధ్యా త్రిధా స్మృతా.
🌺అర్ధం:
కాలభేదముచే సంధ్యకు గాయత్రి, సావిత్రి, సరస్వతి అని పేర్లు. ఉదయమున గాయత్రి,మధ్యాహమున సావిత్రి, సాయంకాలమున సరస్వతి అని సంధ్యా దేవికి పేర్లు వచ్చెను.
🌺పైన సారాంశం బట్టి చూస్తే వ్యాస మహర్షి తన తపో శక్తీ తో ఈ భూమి మీద జరిగే పరిణామాలు మరియు భవిష్యత్తుని ,కల్కి చేబట్టిన ధర్మ కార్యాన్ని ముందుగానే గమనించి వ్రాసి నట్లుంది.