*గరుడ పురాణము* 🌺 *ఎనిమిదవ అధ్యయనం- మొదటి భాగం*

P Madhav Kumar

 

*కరన్యాస, దేహన్యాసాల ద్వారా యోగపీఠాన్ని ఎలా పూజించాలి* 🌷


*పూజా క్రమ విధానం:*

🌺రుద్రదేవా! ఏ పూజకైనా ఒక క్రమ విధానముంటుంది. దానిని వివరిస్తాను వినండి. సాధకుడు ముందుగా ఓం నమః మంత్రంతో పరమాత్మను స్మరించాలి. తరువాత యం రం వం లమ్ అనే బీజాక్షరాల ద్వారా శరీరాన్ని శుద్ధి చేసుకొని భగవానుడు చతుర్భుజుడువైన విష్ణువుని తనలోనే ఊహించుకోవాలి.

🌺తరువాత కరన్యాస, దేహన్యాసాలను చేసుకొని ఈ క్రింది మంత్రాల ద్వారా హృదయంలోనే యోగపీఠాన్ని పూజించాలి.

🌺ముందుగా నౌక కమలాన్ని స్థాపించి అందులోని భాగాలలో దేవతలను ఊహించుకొని.తరువాత కరవ్యాస, దేహన్యాసాలను చేసుకొని ఈ క్రింది మంత్రాలను పఠించాలి.

*ఓం అనంతాయ నమః
*ఓం ధర్మాయ నమః
*ఓం జ్ఞానాయ నమః
*ఓం వైరాగ్యాయ నమః
*ఓం ఐశ్వర్యాయ నమః
*ఓం అధర్మాయ నమః
*ఓం అజ్ఞానాయ నమః
*ఓం అవైరాగ్యాయ నమః
*ఓం అనైశ్వర్యాయ నమః
*ఓం పద్మాయ నమః
*ఓం ఆదిత్య మండలాయ నమః
*ఓం చంద్ర మండలాయ నమః
*ఓం వహ్ని మండలాయ నమః
*ఓం విమలాయై నమః
*ఓం ఉత్కర్షిణ్యై నమః
*ఓం జ్ఞానాయై నమః
*ఓం క్రియాయై నమః
*ఓం యోగాయై నమః
*ఓం ప్రహ్య నమః
*ఓం సత్యాయై నమః
*ఓం ఈశానాయై నమః
*ఓం సర్వతోముఖ్యై నమః
*ఓం సాంగోపాంగాయ హరేరాసనాయ నమః

🌺తరువాత సాధకుడు కర్ణిక మధ్యలో అం వాసుదేవాయ నమః అంటూ దేవునికి సమస్కరించి ఈ క్రింది మంత్రాలతో హృదయాది వ్యాసం చేయాలి.

🌹 తరువాయి భాగం రేపు చదువుదాం.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat