*ఓంకారం ప్రతి మంత్రానికి ముందు వాడుతూ బీజాక్షరాలను ఎలా పలకాలి* 🌹
*నవవ్యూహార్చన విధి పూజ:*
🌺తొమ్మది దేవతలు (వాసుదేవ, బలరామ, ప్రద్యుమ్న అనిరుద్ధ, నారాయణ, బ్రహ్మ, విష్ణు, నరసింహ, మహావరాహ) నవవ్యూహాధినాథులు. వీరి యొక్క వర్గాలు క్రమంగా తెలుపు, ఎరుపు, హరిద్ర పీఠం, నీలం, నలుపు, ఎరుపు, మబ్బు వంటి నలుపు, అగ్ని వంటి పసుపు, తేనెరంగు (రెండవ ఎరుపు గులాబీ రంగు) ఈ దేవతలంతా ఈ రంగుల తేజస్సులో వెలిగిపోతుంటారని అర్ధము
🌺ఓంకారం ప్రతి మంత్రానికి ముందు వాడుతూ విష్ణువు అంగాలుగా ప్రసిద్ధికెక్కిన ఈ క్రింది దేవతలకి ఈ బీజ మంత్రాలను (బీజాక్షరాలను) పలకాలి.
*ఓం కం టం పం శం - గరుడుడు
*ఓం జఖం వం - సుదర్శనం
*ఓం షం చం ఫం షం - గద
*ఓం వం లం మం క్షం - శంఖ
*ఓం ఘం దం భం హం - లక్ష్మి
*ఓం గం జం వం శం - పుష్టి
*ఓం ఘం వం - వనమాల
*ఓం దం సం -శ్రీవత్సం
*ఓం ఛం డం పం యం-కౌస్తుభం
🌺గరుడుడు కమలం వలె ఎఱ్ఱనివాడు. గద నల్లనిది. పుష్టి శిరీష పుష్ప వర్ణంలో, లక్ష్మి బంగారం వలె పచ్చని కాంతులతో వుంటారు. శంఖానికి పూర్ణచంద్రుని వర్ణకాంతి. కౌస్తుభమణి అప్పుడే వికసించిన సూర్యుని అరుణ వర్ణంలో వుంటుంది. సుదర్శునునిది సహస్ర సూర్యకాంతి. శ్రీ వశం కుందపుష్పసమాన వర్ణితం, అనగా శ్వేతం వనమాల పంచవర్ణశోభితం. అనంత భగవానుడు నీలమేఘశ్యాముడు. అస్త్రాలది విద్యుత్కాంతి 'పుండరీకాక్ష' విద్య సహాయంతో పద్ధతిని తెలుసుకొని విష్ణువు యొక్క ఈ సమస్తాంగాలకీ ఆర్ఘ్య పాద్యాదులను సమర్పించాలి.