🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔
*భగవంతుడంటే మొదటి నిర్వచనం*
*భగములు ఆరు*. అవి
1. ఐశ్వర్యము,
2. వీర్యము,
3. యశస్సు,
4. సంపద,
5. జ్ఞానము,
6. వైరాగ్యము.
*"ఐశ్వర్యస్యసమగ్రస్య వీర్యస్య యశస శ్శ్రియః I*
*వైరాగ్యస్యాథమోక్షస్య షణ్ణాం భగ ఇతీ రణా ॥"*
ఈ ఆరు గుణాలు కలవాడు *"భగవంతుడు".*
*రెండవ నిర్వచనం*
1. భూతముల పుట్టుకను,
2. నాశమును,
3. రాబోయెడి సంపత్తును,
4. రాబోయెడి ఆపత్తును,
5. అజ్ఞానమును,
6. జ్ఞానమును ఎఱుంగువాడు.
*"ఉత్పత్తిం ప్రళయం చైవ భూతానామాగతిం గతిం I*
*వేత్తి విద్యా మవిద్యాం చ సవాచ్యో భగవానితి॥"*
ఈ ఆరూ ఎవ్వరెరుగురో, ఆయన *"భగవంతుడు"* అనబడతాడు.
ఇప్పుడు "దేవుడు" అనే దానికి నిర్వచనం చూద్దాం.
*దేవుడు*
"దేవుడు" అనే శబ్దం పది అర్థాల సమూహం గా నిర్వచింపబడింది.
1.శుధ్ధమగు జగత్తును క్రీడింప చేయువాడు.
అ)తన స్వరూపమందు తానే ఆనందంతో క్రీడించువాడు,లేక,
ఆ)పర సహాయంలేకుండా,సహజ స్వభావంతో క్రీడలాగా సమస్త జగత్తునూ చేసేవాడు,లేక,
ఇ)సమస్త క్రీడలకు ఆధారమైనవాడు.
*"యో దీవ్యతి క్రీడతి స దేవః"*
2.ధార్మికులు జయించాలి అనే కోరిక కలవాడు.
అందరిను జయించేవాడు,అనగా అతనిని ఎవరూ జయించలేరు.
*"విజగీషతే స దేవః"*
3.అన్ని ప్రయత్నములకు సాధనోప సాధనములను ఇచ్చువాడు
న్యాయాన్యాయ రూప వ్యవహారములను తెలియువాడు.
*"వ్యవహారయతి స దేవః"*
4.స్వయం ప్రకాశ స్వరూపుడు,
అన్నిటికి చరాచర జగత్తు అంతటికి ప్రకాశకుడు.
*"యశ్చరాచరం జగద్ద్యోతయతి సదేవః"*
5.ఎల్లర ప్రశంసకు యోగ్యుడు.
.నిందింప దగనివాడు.
*"య స్త్యూయతే స దేవః"*
6.తాను స్వయమానంద స్వరూపుడు.ఇతరులకానందము కలుగజేయువాడు,దుఃఖము లేశమూ లేనివాడు.
*"యో మోదయతి స దేవః"*
7.మదోన్మత్తులను తాడించేవాడు.
సదాహర్షితుడు.శోకరహితుడు.ఇతరులనుహర్షింపజేయువాడు,దుఃఖమునుండి దూరము చేసేవాడు.
*"యో మాద్యతి స దేవః"*
8.అందరి శయనార్థము రాత్రిని,ప్రలయాన్ని చేసేవాడు.
.ప్రలయసమయమున
అవ్యక్తమందు సమస్తజీవులను నిద్రింపజేయువాడు.
*"యః స్వాపయతి స దేవః"*
9.కామించుటకు యోగ్యుడు.
సత్యకాముడు.శిష్టులకామమునకు లక్ష్యమగువాడు.
*"యః కామయతే కామ్యతే వా స దేవః"*
10.జ్ఞాన స్వరూపుడు.అన్నిటి యందు వ్వాప్తుడై, తెలియుటకు యోగ్యుడు.
*"యో గఛ్ఛతి గమ్యతే వా స దేవః"*
దేవః - అనే శబ్దం *"దివు క్రీడా విజగీషా వ్యవహార ద్యుతి స్తుతి మోద మద స్వప్న కాంతి గతిషు"* అనే ధాతువునుండి సిధ్ధ మవుతోంది.దాని నుంచీ వచ్చినవే పైన పేర్కొన్న పది అర్థాలు.
*సేకరణ*
🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍅