కల్కి పురాణం - ఐదవ అధ్యయనం - రెండవ భాగం

P Madhav Kumar


ఐదవ అధ్యయనం - రెండవ భాగం


తత్రాయౌతా! నృపాః సర్వే వివాహకృత నిశ్చయా

నిజ సైన్యైః పరివృతాః స్వర్ణరత్న విభూషితాః

రథాన్ గజానశ్వవరాన్ సమారూఢా మహాబలాః

శ్వేత చ్ఛత్రకృతచ్ఛాయాః శ్వేతచామరవీజితాః


🌺అర్ధం:

పద్మావతిని వివాహమాడవలెనని రాజులు స్వర్ణభూషితులై తమతమ సైన్యములతో, గూడి సింహళదేశమునకు రథములను, గజములను, అశ్వముల నధిరోహించి బలవంతులగు రాజులు తెల్లని గొడుగులు ధరించి వచ్చిరి. ఆగొడుగుల నీడలో వారికి సేవకులు తెల్లని వింజామరలు వీచుచుండిరి.


శస్త్రోత్ర తేజసా దీప్తా దేవాః సేంద్రా ఇవాభవన్

రుచిరాశ్వః సుకర్మాద మదిరాజో దృఢకుగః

కృష్ణసారు పారదశ్చ జీమూతః క్రూరమర్దనః 

కాశః కుశాంబుర్వసుమాన్ కట్కః క్రథనసంజయా

గురుమిత్రః ప్రమాథీచ విజృమః సృంజయో క్రమా

ఏతే చాస్యేచ బహవః సమాయాతా మహాబలాః


🌺అర్ధం:

అస్త్రశస్త్రముల కాంతులతో ప్రకాశించెడి రాజులు ఇంద్రునితోగూడినదేవతలవలె నుండిరి. రుచిరాశ్వ, సుకర్మ, మదిరాక్ష, దృదాశుగ, కృష్ణసార, పారద, క్రూరమర్దన కాశ, కుశాంబు, బహుమాన, కంక, క్రథన, సంజయ, గురుమిత్ర, ప్రమాథి, విజృంభ, సంజయ, ఆశయములు మున్నగు పరా క్రమవంతులగు రాజులు సింహళదేశమునకు వచ్చిరి.


వివితు స్తే రంగగతాః స్వస్వస్థానేపుపూజితా

వాద్యతాండవ సంహృష్టాశ్చిత్రమాల్యాంబరాధరాః

నానాభోగ సుఖోద్రిత్తాః కామరామా రతిప్రదాః 

తానాలోక్య సింహలేశః స్వాం కన్యాం వరవర్ణినీమ్.


🌺అర్ధం:

చిత్రవిచిత్రములగు పుష్పమాలలను, వస్త్రములను ధరించి వేదికపై తమతమ ఆసనముల నలంకరించి రాజులు వాద్యతాండవములచే సంతుష్టులైరి. సుఖభోగములయందు ఆసక్తులయిన రాజులను చూచి సింహలేఖడు సౌందర్యవతియగు తన పుత్రికను సభకు రప్పించెను.


గౌరీం చంద్రాననాం శ్యామాం తారహారవిభూషితామ్

మణిముక్తా ప్రవాళైశ్చ సర్వాంగాలంకృతం శుభమ్

కిం మాయాం మోహజననీం కింవా కామప్రియాం భువి

రూపలావణ్యసంపత్స్య న చాన్యామిహ దృష్టవాన్.


🌺అర్ధం:

కన్యయు (గౌరి), చంద్రలింబము వంటి ముఖము గలది, శ్యామవర్ణముగలది, శుద్ధములగు ముత్యముల వాదములచే అలంకరింపబడినది, మణులు, ముత్యములు, పగడములచే పద్మావతి మోహమును కల్గించు మాయయా? భూమి యదవతరించిన మన్మథుని భార్యయగు రతీదేవియా? ఇంతటి రూపలావణ్యవతిని నేను (శుకము) మునుపెన్నడు చూడలేదు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat