🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌿అతిథి దేవోభవ అనే మాటను మనం తరచూ వింటూనే వుంటాం. అతిథిని దైవంగా భావించి సేవించాలని పురాణాలు చెబుతున్నాయి.
🌸పూర్వకాలంలో మహర్షుల నుంచి సాధారణ ప్రజల వరకూ అతిథి లేకుండా ఏ పూటకూడా భోజనం చేసేవారు కాదు.
🌿తమ ఇంటికి అతిథి రాని రోజున ఊళ్లోకి వెళ్లి ఆకలితో వున్న ఎవరినో ఒకరిని వెతికి తీసుకువచ్చి మరీ భోజనం పెట్టేవాళ్లు.
🌸అతిథికి అర్పించకుండా భోజనం చేయకూడదనే నియమాన్ని అప్పట్లో అందరూ పాటించే వాళ్లు. భోజన సమయంలో దేవతలు తమ భక్తులను పరీక్షించడానికి అతిథుల రూపంలో వస్తుంటారనే విశ్వాసం కూడా ఇందుకు కారణమైంది.
🌿 పోతన భోజనానికి కూర్చున్న సమయంలో శ్రీరామచంద్రుడు మారువేషంలో అతిథిగా వస్తాడు. అప్పుడు పోతన తాను పస్తులు వుండి ఆ భోజనాన్ని అతిథికి వడ్డిస్తాడు.
🌸 ఫలితంగా ఆయన శ్రీరామచంద్రుడి అనుగ్రహాన్ని పొందడాన్ని ఇక్కడ మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
🌿భోజన సమయంలో ఆకలితో వచ్చిన అతిథిని మర్యాద పూర్వకంగా ఆహ్వానించి సంతృప్తికరంగా భోజనంపెట్టి పంపించాలి. అప్పుడు అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి.
🌸ఆకలితో వచ్చిన అతిథిని పట్టించుకోకుండా భోజనం చేసిన వారికి నరకలోకప్రాప్తి కలుగుతుంది. ఆకలితో తిరిగివెళ్ళే అతిథి ఆ కుటుంబీకుల పుణ్యఫలాలను తీసుకెళ్లిపోతాడని శాస్త్రం చెబుతోంది.
🌿 అందువలన అతిథిని ఆప్యాయంగా ఆహ్వానించాలి … ఆదరించాలి … రుచికరమైన వంటకాలతో సంతృప్తి పరచాలి. అప్పుడే ఆర్జించిన పుణ్యం స్థిరంగా వుంటుంది … అతిథిని సేవించిన పుణ్యం అనంతమవుతుంది.
హిందూ సాంప్రదాయాలు ఆచరిద్దాం-పాటిద్దాం..🚩🌞🙏🌹🎻
🙏🌹జై శ్రీమన్నారాయణ..🌹🙏
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿