ఆంజనాదేవి పూర్వజన్మ వృతాంతం....!!

P Madhav Kumar

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🌿ఆంజనేయుడు శివుని అంశ అయినప్పుడు ...అతను వాయునందనుడు అని ఎందుకు పిలువబడుతూ ఉన్నాడు..?


🌹🙏 ఆంజనాదేవి చరిత్ర🙏🌹


🌸ఈమె వానరుడైన కుంజరుడి కూతురు, కేసరి భార్య. ఈమెకు వాయుదేవుడి అంశతో హనుమంతుడు జన్మించాడు.


🙏🌹పూర్వ జన్మ : 🌹🙏


🌿పూర్వం ఒక మహర్షి శివుని కోసం కొన్ని వందల సంవత్సరాలపాటు ఘోర తపస్సును ఆచరిస్తాడు. 

అప్పుడు అమరావతీ నగరానికి రాజయిన ఇంద్రుడు.. ఆ ముని చేస్తున్న ఘోరతపస్సును చూసి ఎక్కడ తన అమరావతీ నగరాన్ని శివునితో వరంగా కోరుకుంటాడోనన్న భయం అతనిలో కలుగుతుంది.

దాంతో ఇంద్రుడు ఎలాగైనా ఆ మహర్షి తపస్సును భంగం కలిగించాలని నిర్ణయించుకుంటాడు.


🌸స్వర్గలోకములో ఇంద్రుని దగ్గర ఎందరో అందమైన అప్సరసలు ఉన్నారు. వారందరిలో మిక్కిలి అందముగా " పుంజికస్థల " అనే ఒక అప్సరస ఉంది .

ఆమె ఎంతటి అందకత్తో అంతటి చంచల స్వభావము గలది .


🌿ఇంద్రుడు  ‘‘పుంజికస్థల’’ అనే అప్సరసను ముని తపమును భంగం కలిగించాల్సిందిగా ఆజ్ఞాపించి, పంపిస్తాడు. 

మునిని చూసి ఆ అప్సరస లోలోపల భయపడుతున్నప్పటికీ  అతని తపమును భంగం కలిగించడానికి అహర్నిశలు ప్రయత్నిస్తుంది.

 తన అందాచందాలతో, నృత్యగీతాలతో ఆ మహర్షి తపస్సును భంగం కలిగిస్తుంది. 


🌸తన తపస్సును భంగం కలిగించిందన్న కోపంతో మహర్షి ఆమెను.. ‘‘నువ్వు వానర యోనియందు జన్మించుగాక’’ అని శపిస్తాడు.అప్పుడు ఆ అప్సరస భయంతో ఎలాగైనా తనను ఈ శాపం నుంచి విముక్తి కలిగించాల్సిందిగా కోరుకుంటూ.. వినయభావంతో అనేక రకాలుగా ప్రార్థిస్తుంది. చివరికి ఆ ముని ఆమెను అనుగ్రహించి.. ‘‘నువ్వు ఎప్పుడు ఏ రూపంలో ధరించాలని అనుకుంటావో.. అప్పుడు ఆ రూపాన్ని నువ్వు పొందవచ్చు’’ అని వరాన్ని ప్రసాదిస్తాడు.


🌿 కొన్నాళ్ల తరువాత ముని విధించిన శాపం మేరకు ఆ పుంజికస్థల అనే అప్సరస వానరిగా జన్మిస్తుంది. 

మహర్షి శాపం నిజమైంది. పుంజకాస్థల సుమేరు పర్వత గుహలో ఒక వానరిగా జన్మించింది. 


🌸భూలోకములో వుండే వానర జాతి మాదిరి జాతి కాదు . 

ఇది ఉపదేవతలలోని కింపురుష జాతికిచెందినది . వీరు అభీష్ట రూపధారులు.

వీరి ఆకృతి మానవాకృతి మాదిరిగానే ఉంటుంది . కానీ తోక  ఉంటుంది.


🌿ఈమే ‘‘అంజనాదేవి’’. 

ఈమె వానర రాజు అయిన కేసరిని వివాహం చేసుకుంది. ఎంతో అందగత్తె అయిన అంజనాదేవిని కేసరి చాలా అనురాగంతో చూసుకునేవాడు. ఆమెకు అన్ని విధాలుగా సౌకర్యాలను కల్పించేవాడు.


🌸ఒకానొకరోజు ఈ వానర దంపతులు మానవ రూపాలను ధరించి తమ రాజ్యంలోనే విహరించసాగారు. సంతోషంగా విహరిస్తున్న సమయంలో వాయువు చాలా వేగంగా వీస్తుంది. అప్పుడు ఒక వాయువుతరంగం అంజనాదేవి చీర చెంగును ఎగరగొడుతుంది. దాంతో ఆమెను ఎవరో స్పృజించినట్లుగా అనిపిస్తుంది. దానికి మహా పతివ్రత అయిన ఆమె కోపంతో.. ‘‘నా పాతవ్రత్యాన్ని భంగం కలిగించడానికి సాహసించింది ఎవరు? నేనిప్పుడే వారిని శపిస్తాను’’ అని చెబుతుంది.


🌿అందుకు సమాధానంగా వాయుదేవుడు.. ‘‘దేవీ! నేను వాయుదేవుడిని. నా స్పర్శవల్ల నీ పాతివ్రత్యము భంగం కాలేదు. అయితే శక్తిలో నాతో సమానమైన ఒక సుపుత్రుడు నీకు కలుగుతాడు. నేను అతనిని అన్నివేళలా రక్షిస్తాను. అంతేకాదు.. బాలల నుంచి పెద్దలవరకు అందరూ అతనిని ఆధ్యాత్మికంగా ఆదరిస్తానరు. అతడు భగవంతునికి సేవ చేసుకుంటూ.. ఆదర్శమార్గంలో సత్కీర్తిని పొందుతాడు’’ అని చెబుతాడు.


🌸స్త్రీలకు సహజముగా తల్లి కావాలని,పుత్రుడు కలగాలని కోరిక ఉంటుంది . అంజనా పుత్ర ప్రాప్తికి శులపాణి అయిన శివుని ఆరాధించింది.


🌿శ్రీరాముడు అవతరించనున్నాడు. తానుగూడ అవనిపై అవతరించి శ్రీరామునికి సేవచేద్దామని శంకరునకు కోరిక గలిగినది . శంకరుడు యొక్క ఏకాదశరుద్రరూపుడు. పదకొండవ అవతారమే అంజనేయుడు.


🌸అంజన కొడుకు కావడంతో హనుమంతుడిని ఆంజనేయ లేదా ఆంజనేయుడు, అంజనీపుత్ర అనే పేర్లతో కూడా పిలుస్తారు..

శివుని అంశంలో..తన శక్తి అంశని కలిపి అంజనాదేవి గర్భంలో నిక్షిప్తం చేసినందుకు హనుమంతుడిని వాయునందనుడు అని పిలుస్తారు.


🌿ఆంజనేయ స్వామి తల్లి అయిన అంజనా దేవి… జన్మ వృత్తాంతం గురించి విచిత్ర రామాయణంలో ఈ విదంగా వివరించిబడింది.

అహల్య, గౌతమ ముని కూతురే అంజనా దేవి అని చెప్పబడింది.


🌸అయితే ఎంతో అందగత్తె అయిన అహల్య దేవి వద్దకు సూర్యుడు గౌతముడు లేని సమయంలో వచ్చాడు.

ఆయన తేజస్సుకు అహల్య చూపు కోల్పోయింది.

అలా అహల్యకు సూర్యుడి వల్ల ఓ కుమారుడు జన్మించాడు.

ఆ తర్వాత కొన్నాళ్లకు మరొక కుమారుడు జన్మించాడు.

గౌతముడు వలన అహల్య కి ఒక కూతురు కూడా పుట్టింది.


🌿కొడుకుల నిజ జన్మ రహస్యం విషయం తెలియని గౌతముడు కుమారులను భుజాలపై ఎత్తుకొని.

కూతురైన అంజనా దేవిని నడిపించుకుంటూ సముద్ర తీరం వద్ద తిరుగుతున్నాడు.అంజనా దేవికి కాళ్లు నొప్పులు పుట్టడంతో… నీ కన్న కూతురిని నడిపించి తీసుకెళ్తూ… పరుల బిడ్డలను భుజాలపై ఎత్తుకుంటావా? అని ప్రశ్నించిందట.


🌸దీంతో కోపోద్రిక్తుడైన గౌతమ ముని.

మీరు పరుల బిడ్డలైతే మీ ముఖాలు వానరు ముఖాలు గాక అని శపించి వారిని సముద్రంలోకి తోసేశాడట.ఆ పిల్లలే వాళి, సుగ్రీవులుగా మారారని పురాణాలు చెబుతున్నాయి.


🌿ఈ విషయం తెలుసుకున్న అహల్య… కన్న కూతురే తన గుట్టు బయట పెట్టినందుకు అంజనా దేవిని శపించిందట.

నీకు వానరుడే కుమారుడుగా పుట్టాలని అందంట.అలా అంజనా దేవికి, కేసరికి వాయు దేవుడి అంశతో పుట్టిన వాడే ఆంజనేయ స్వామి.కానీ మామూలు రామాయణ కథలో మాత్రం అంజనా దేవి వానరుడైన కుంజరుడి కూతురని ఉంది....స్వస్తీ...🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat