నాలుగవ అధ్యయనం - ఐదవ భాగం
శివసేవాపరా గౌరీ యథా పూజ్యా సుసమ్మతా
సఖీఖిః కన్యకాభిశ్చ జపధ్యాన పరాయణా
జ్ఞాత్వా తాంచ హరేర్లక్ష్మీం సముద్భూతాం వరాంగనామ్
హరః ప్రాదురభూత్ సాక్షాత్ పార్వత్యా సహ హర్షితః
🌺అర్ధం:
మిక్కలి గౌరవింపదగినది, పూజింపదగినదియగు పార్వతి శివ సేవా భక్తురాలైన పద్మావతి సఖులయిన కన్యకలతో జపధ్యానపరాయణురాలాయెను. లక్ష్మీదేవి భూమండలమున అవతరించినదని తెలిసి పార్వతీ పరమేశ్వరులు హర్షచిత్తులై సాక్షాత్కరించిరి.
సా తమాలోక్య వరదం శివం గౌరీసమన్వితమ్
లజ్జయాధోముఖీ కించిన్నోవాచ పురతః స్థితా.
హరస్తామాహ సుభగే తవ నారాయణః పతిః
పాణిం గ్రహీష్యతి ముదా నాన్యో యోగ్యో నృపాత్మజః
🌺అర్ధం:
పార్వతీదేవితో గూడిన శివుని చూచి పద్మావతి వారికి ఎదురుగ నున్నది సిగ్గుతో తలవంచుకున్నదై ఏమియు మాట్లాడలేదు. పరమేశ్వరుడు ఆమెతో ఓ పద్మావతి! నీ భర్తయగు విష్ణుమూర్తి నిన్ను పాణిగ్రహణము చేయగలడు. ఇతర రాజు కుమారులెవరు యోగ్యులు కారు.
కామభావన భువనే యే త్వాం పశ్యంతి మానవాః
తేనైవ వయసా నార్యో భవిష్యంతృప్తి తక్షణాత్.
దేవాసురాస్తథా నాగా గంధర్వాశ్చర ణాదయః
త్వయా రంతుం యథా భవిష్యంతి కిల ప్రియ
🌺అర్ధం:
లోకమున ఎవరు నిన్ను కామభావముతో చూచెదరో అట్టి పురుషులు తక్షణము నుండి సమవయస్కులగు స్త్రీలుగ మారగలరు. మానవ ,దేవ ,అసుర, నాగ, గంధర్వ ,చారణాదులు వెంటనే స్త్రీ రూపమును పొందుదురు.
వినా నారాయణం దేవం త్వత్పాణి గ్రహణార్డినమ్
గృహం యాహి తపస్త్యక్త్వా భోగాయతనముత్తమమ్.
మా శోభాయ హరేః పత్ని కమలే విమలం కురు
ఇతి దత్వా వరం సోమస్త తైవాంతర్దరే హరః
హరవరమితి సానిశమ్య పద్మా
సముచితమాత్య మునోరథ ప్రకారమ్
వికసితవదనా ప్రణమ్య సోయం
నిజజనకాలయ నవపేశ రామా.
🌺అర్ధం:
విష్ణుమూర్తి తప్ప మరెవరయినను వివాహమాడినచో ఇట్టి అవస్థనే పొందుదురు. తపస్సును విడిచి ఇంటికి వెళ్ళము. శరీరమును క్షోభ పాపరహితము చేయుము, పరమేశ్వరుడు పూర్వోక్త ప్రకారముగ పద్మావతికి వరమిచ్చి అంతర్ధానమయ్యెను. తన మనోభీష్టమునకు అనుకూలముగ పరమేశ్వరుడు వరమిచ్చుటను . తెలుసుకొని పద్మావతి వికసించిన వదన కమలము కలదై అతనికి నమస్కరించి పితృగృహమునకు వెడలెను.