రేకు. : 15-4
సంపుటము: 1-92
రాగము. : నాట
*గానము:శ్రీ సత్తిరాజు వేణుగోపాల్*
*పల్లవి*.
ఇటు గరుడని నీవెక్కినను
పటపట దిక్కులు బగ్గనఁ బగిలె॥ఇటు॥
*చరణం*
ఎగసిన గరుడని యేపున ‘ధా’ యని
జిగి దొలఁక చబుకు చేసినను
నిగమాంతంబులు నిగమసంఘములు
గగనము జగములు గడగడ వడఁకె॥ఇటు॥
*చరణం*
బిరుసుగ గరుడని పేరెము దోలుచు
బెరసి నీవు కోపించినను
సరుస నఖిలములు జర్జరితములై
తిరుపున నలుగడ దిరదిరఁ దిరిగె॥ఇటు॥
*చరణం*
పల్లించిన నీ పసిఁడి గరుడనిని
కెల్లున నీ వెక్కినయపుడు
ఝల్లనె రాక్షససమితి నీ మహిమ
వెల్లి మునుఁగుదురు వేంకటరమణా॥ఇటు॥
🌹🌹🌹🌹🌹🌹🌹
*వెంకట సత్యనారాయణరావు కలిగొట్ల*