నీ రాకకై వినాయక

P Madhav Kumar

 ఓ తల్లి, తన పుత్రుడిని రాకకై రెండు యుగాలుగా వేచి ఉంది... ప్రతి రోజు ప్రతి క్షణం తలచుకుంటూ తన పుత్రుడు తిరిగి వస్తాడు అనే వేచి ఉంది..


భగవంతుడు భక్తులను కాపాడడానికి ప్రతి యుగం లోనూ అవతారాలు ధరించి ధర్మాన్ని నిలబెడతారు...


ప్రతియుగం లోనూ నారాయణుడే కాదు వినాయకుడు కూడా అవతారాలు ధరించారు...


మొదటి యుగం లో అనగా సత్య యుగం లో మహోత్కట్ వినాయకుడు


త్రేతా యుగం లో మయురేశర్వ గణపతి ద్వాపర యుగం లో మన అందరికీ నచ్చిన గణేశుడు ఇకపోతే కలియుగం లో దుమ్రకేతు


ఇక ఈ కథ అయితే ఒక విచిత్ర మైన స్వప్నం తో మొదలైంది...


- ఒక సాధ్వి ఒక ఆకర్షణమైన కాంతి వైపు తన అనుమతి లేకుండా అల నడుస్తూనే వెళ్తుంది.. చివరికి కాంతి దగ్గరికి చేరుకోగా ఆ కాంతి శ్రీ మహా గణాధిపతి గా మారింది.. అది చూసి ఆమె రెండు చేతులు జోడించి నమస్కారం చేసింది.. ఉన్నట్టు ఉండి మహా గణాధిపతి. అంతర్ధానం అయిపోయారు. ఇదేమి విచిత్రం అని ఆమె అనుకుంటూ ఉండగా ఎవరో తన చీర కొంగుని లాగినట్టు అనిపించి పక్కకి చూడగా ఒక చిన్న బుట్టలో ఒక చిన్న పిల్లాడు ఆకర్షణీయంగా వున్నాడు. ఒక్కసారిగా ఆమె నిద్ర లో నుంచి లేచింది. పక్కనే ఉన్న ఋషి కూడా నిద్ర లేచి దేవి అతిథి ఎం జరిగింది? మీరు ఏదైనా దుసకృన్నం చూసారా? అడిగాడు.

లేదు స్వామి! ఇది ఏ మాత్రం దుస్వప్నం కాదు. ఇదే కల నాకు ఇంతకు ముందు కూడా చాలా సార్లు వచ్చింది, నా కలలో ఒక చిన్న పిల్లాడు. నా చీర నీ పట్టుకున్నట్టు అనిపించింది అని అతిథి చెప్పగా.... నాకు అర్ధం అయింది. ఈ రోజు మీ పిల్లలు అందరూ భోజనానికి రాబోతున్నారు కదా! అందుకే మీకు ఈ స్వప్నం వచ్చినట్లు ఉంది అన్నారు కశ్యప ఋషి....


హా స్వామి! నేను ఆ సంగతే మరిచాను, ఇప్పుడే అన్ని ఏర్పాట్లు చేస్తాను అని లేచి.. పుత్రులందరికి ఇష్టమైన ఆహారం వండి అందరూ వచ్చే లోపు అన్ని ఏర్పాటు చేసింది అతిథి..


అతిథి పుత్రులు... సూర్యుడు,ఇంద్రుడు, వాయువు, అగ్ని అందరూ వచ్చి భోజనానికి కూర్చున్నారు... ఇంకా రెండు విస్తర్లు అధికంగా వేసి ఉండడం చూసి.. అమ్మ! మిగతా రెండు విస్తర్లు ఎవరి కోసం అడిగాడు ఇంద్రుడు..


నాకు ఎలా అనిపిస్తుంది అంటే నాకు ఇంకొక కుమారుడు ఉన్నట్లు తను రావడం ఇంకా బాకీ ఉన్నట్టు అనిపిస్తుంది అని మాట్లాడుతూ. ఉండగా... వామన దేవుడు వచ్చి మాత అతిథి ప్రణామాలు అంటారు. మిగతా దేవుళ్ళు అందరూ లేచి వామన దేవుడికి నమస్కరిస్తారు...


వామన దేవుడు కూడా బలి అహంకారాన్ని చంపడానికి దేవి అతిథి కడుపులోనే జన్మిస్తాడు.


రా! పుత్ర! నువ్వు కూడా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు కూడా విందులో పాల్గొను అని అతిథి అంటుంది...


బందరు కూర్చొని సరదాగా భోజనం చేస్తారు.. భోజనం పూర్తి బయ్యాక దేవుళ్ళు అందరూ తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకొని తిరిగి స్వర్గానికి వెళ్ళిపోతారు. కానీ వామన దేవుడు మాత్రం తల్లి దగ్గరికి వచ్చి.. అమ్మ ప్రతి మకర సంక్రాంతికి మీ పుత్రులందరికీ మనస్మూర్తిగా భోజనం- పెట్టి ఎంతో ఆనందంతో పంపిస్తారు కానీ ఈ సారి నేను మిమ్మలని అంత ఆనందంగా చూడలేదు. ఏం అయింది అని అడుగుతాడు.


నువ్వు సరిగా డెప్పాన్ పుత్ర, నాకు ఇంకా అలానే అనిపిస్తుంది. ఎలా అంటే నాకు ఇంకొక పుత్రుడు ఉన్నట్లు తను ఇంకా రాలేదు. అని అంటుంది.


ఇప్పటి వరకు రాలేదు కానీ భవిష్యత్తులో వస్తారు మిమ్మల్ని నిశరపరచరు అంటారు వామన దేవుడు.

ఎవరు? ఎవరు రాబోతున్నారు? అడిగారు కశ్యప ఋషి..


వారే! ఎవరిని అయితే మాత తన స్వప్నం లో చూసిందో వారే రాబోతున్నారు అన్నాడు...


నేను అయితే నా స్వప్నం లో శ్రీ మహా గణాధిపతిని చూసాను. తరువాత ఒక చిన్న బాలకుడు నా కొంగుని పట్టుకొని... అంటే అంటే అన్ని అతిథి ఆశ్చర్యపోతూ ఉండగా.


ఏ మాటలు అయితే మీరు సగం లో ఆపేశారు వాటిని నేను పూర్తి చేస్తాను.. శ్రీ మహా గణాధిపతి త్వరలో మీ పుత్రుడిగా వారి ప్రధమ అవతారాన్ని ధరించబోతున్నారు అని వామన దేవుడు చెప్పగా అతిథి సంతోషానికి అవధులు లేకుండా పోతాయి... మహా గణాధిపతి నా పుత్రుడిగా జన్మించబోతున్నరా అని.


ప్రతి అవకారం వెనుక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది మరి మహా గణాధిపతి అవతారం ధరించడం వెనుక అసలు కారణం ఏంటి ? అడిగారు కశ్యప ఋషి..


ఋషి రుద్రకేతు, దేవి శారద ల కవల పిల్లలు. వారంతకుడు దేవాంతకుడు. ఇద్దరు బ్రహ్మ దేవుని నుంచి వరం పొందారు. ఇప్పటి వరకు అవతారం ధరించిన యే దేవుడు కూడా వాళ్ళని సంహరించకుడదు అని. ఈ వరం కారణం గానే వారే దేవుళ్ళు అని వారికి చావే లేదు అని ముల్లోకాలను, భూమి మీద జీవుల్ని హింసిస్తూ ఉన్నారు.. అందుకే స్వయం గా విరబ్రహ్మ స్వరూపం అయిన శ్రీ మహాగణాధిపతి వారి ప్రథమ అవతారాన్ని ధరించబోతున్నారు అని చెప్పే వామన దేవుడు వెళ్ళిపోతారు.


ఆ రోజే అతిథి భక్తి భావం తో మహా గణాధిపతి విగ్రహాన్ని స్వయంగా తన చేత్తోనే చేసి ఆ విగ్రహానికి ప్రతి రోజు పూజలు చేస్తూ ఉంటుంది...


చాలా కాలాలు గడిచాయి. దేవతలు స్వర్గం పోగొట్టుకున్నారు. వారి పరిస్థితి చాలా దారుణం గా తయారు అయింది...


కాలం గడుస్తున్న కొద్ది తన ఆశ తీరదు ఏమో అని అతిథి బాధపడుతూ.. విగ్రహం ముందు కూర్చొని ఏడుస్తూ.. హే ప్రభు ! నా భక్తి లో ఏదైనా లోపం ఉందా? లేదా నేను మీకు తల్లిని అవ్వడానికి యోగ్యత లేని దాన్న? ఇంత వరకు మీ దర్శన భాగ్యం నాకు దొరకలేదు అంటే నేను యోగ్యత లేని దాన్ని అని బాధ పడుతూ ఉండగా.. స్వయం గా పరబ్రహ్మ మహా గణాధిపతి ప్రత్యక్షం అయి.. మాత! మీరు బాధ పడవద్దు, మీరు అన్ని విధాలుగా యోగ్యత కలవారు అంటారు మహా గణాధిపతి..


మరి ఇంత వరకు మీరు నా పుత్రుడిగా రాలేదు ఎందుకని అడుగుతుంది అతిధి..


నేను రాలేదు ఎందుకంటే నేను రావాల్సిన సమయం ఇంకా ఆసన్నమవలేదు, సమయం రాగానే మీరు నన్ను పుత్రుడిగా అవశ్యం పొందుతారు అని చెప్పి అంతర్ధానం అయిపోతారు.


ఓపిక తో ఇంకా చాలా కాలాలు వేచి ఉంది దేవి అతిథి...


ఒక రోజు గణాధిపతి విగ్రహం ముందు కూర్చొని. మీరు ఎప్పుడు అయితే వచ్చి నన్ను అమ్మ నీ పిలుస్తారో ఇప్పుడే నేను మళ్ళి తిరిగి చూస్తాను. . అని పూజ నుంచి లేచి వెళ్లిపోతుంటే. ఎవరో తన చీర కొంగు నీ లాగినట్లు అనిపించి స్వప్నం లో అదే జరిగింది కనుక వెంటనే వెనక్కి తిరిగి చూసింది అతిథి.. కానీ తన చీర కొంగు దీపపు ప్రమిదకి ఉంది అకస్మాత్తుగా తను లేవడం వల్ల అల అనిపించింది..


తను వెళ్లిపోతుంటే మళ్ళీ తన చీర కొంగును లాగినట్టు అనిపించిన అతిథి వెనక్కి తిరిగి చూడలేదు. ఒక చిన్న బాలుడు కిలకిలలు వినిపించడం తో మాతృ ప్రేమని ఆపుకోలేక ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది.. ఒక చిన్న బుట్టలో సూర్యుడి కన్న ఎక్కువ కాంతి తో మెరుస్తూ... ఎంతో ముద్దుగా ఏనుగు తలతో ఉన్న ఒక బుల్లి పిల్లాడిని చూసింది అతిది. తన ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఆ కాంతి సమస్త జగత్తు నీ విస్మయ పరించింది. ధ్యానం లో ఉన్న కశ్యప ఋషి కి కూడా ఆ కాంతి తగలగానే పరిగెత్తుకుంటూ అతిథి దగ్గరికి వస్తాడు..


చూస్తూ వుండగానే అక్కడే చిన్న పిల్లాడు అదే కాంతి తో ఒక ఒక బాలుడి రూపం లో సూరి అన్ము అని పిలుస్తారు..


త్రిమూర్తులు, త్రిదేవతలు, దేవతలు, అష్ట దిక్పాలకులు, నారదుడు అందరూ మహాగణాధిపతి పై పూల వర్షం కురిపిస్తూ ఉంటారు.

అతిథి సంతోషం గా వెళ్ళి పుత్రుడిని కౌగిలించుకుని ముద్దడుతుంది..


అప్పుడే ఆకాశవాణి... ముర్ఖులరా! మీ ఇద్దరినీ అంతం చెయ్యడానికి పరబ్రహ్మ స్వరూపుడు శ్రీ మహాగణాధిపతి అతని మొదటి అవతారం ధరించారు అని వారంతకుడు, దేవాంతకుడు గదిలో వినిపిస్తూ ఉంటుంది...


దేవాంతకుడు కోపం తో లేచి కత్తి నీ తీసుకొని ఇప్పుడే నేను నేను అతన్ని సంహరిస్తాను అని బయలు దేరతరు. అది చూసిన నరంతకుడు సోదరా ఇప్పుడే పుట్టిన బాలకుడు అంటే ఎంత ఉంటాడు చిన్న బాలకుడు అతన్ని చంపడానికి మనం ఎందుకు? మన అసురులు చాలు అని.. రకరకాల అసురుల్ని అన్ని దిశలవైపు పంపి మహా గణాధిపతి అవతారం యే బాలకుడో తెలుసుకొని చంపమని ఆదేశం ఇస్తారు. నరంతకుడు, దేవాంతకుడు....


అమ్మ నా మూర్త రూపాన్ని తాయారు చేసింది. తండ్రి మీరు నాకు నా నామకరణం చెయ్యండి అని అంటారు...


నీ రాక ఒక దివ్య ప్రకాశం తో జరిగింది... అది నీలోని అద్భుత కాంతికి కారణం.. నువ్వు బలం, బుద్ధి లో రెండిటిలో సమానం గా ఉంటావు. కనుక నువ్వు మహోత్కట్.. నీ దివ్య కాంతి కారణం గా అందరూ నిన్ను మహానాయకుడు అంటారు. అందుకే నీ పేరు మహోత్కట్ వినాయకుడు అని నామకరణం చేస్తారు కశ్యప ఋషి..


ఆ రోజు నుంచి వినాయకుల్తో కలిసి అతిథి ఋషి కశ్యప చాలా సంతోషం గా జీవిస్తారు... వినాయకుడు చేసే అల్లరి చేష్టలు పనులు అతిధి. మనసులో ముద్రణ పడతాయి. మరో పక్క మహా గణాధిపతి అవతారం వినాయకుడిగా కశ్యప ఋషి ఆశ్రమంలో జన్మించారు అని తెలుసుకున్న అసురులు రకరకాల రూపాల్లో వినాయకుడిని చంపడానికి వస్తారు కానీ వాళ్ళందరూ ఏమి చెయ్యలేక వినాయకుడి చేతిలో "చనిపోతారు....


ఒక రోజు వినాయకుడి ఉపనయన సంస్కారం జరుగుతూ ఉండగా కొందరు అసురులు ఋషి వేశం లో వచ్చి వినాయకుడిని చంపాలి. అనుకుంటారు.. అక్కడ మిగతా అతిథి పుత్రులు అందరూ ఉంటారు..!

ఉపనయన సంస్కారం పూర్తి అయ్యాక వినాయకుడు నడుచుకుంటూ వెళ్ళి అసురుల మీద తల చేతిలోఉన్న బియ్యాన్ని విసురుతాడు. అసురులు అందరూ చనిపోయి వినాయకుడిలో లీనం అయిపోతారు...


అది చూసి దేవి అతిథి కంగారు పడుతూ వినాయకుడి దగ్గరికి వచ్చి పుత్రః నీకేం కాలేదు కదా! అని కౌగిలించుకుంటుంది..


హే ప్రభు! మీరు మీ మహా గణాధిపతి స్వరూపాన్ని చూపించండి అని దేవతలు అందరూ కోరగా.. పూర్తి స్వరూపాన్ని చూసిస్తారు మహా గణాధిపతి అవతారం అయిన వినాయకుడు... దేవతలు అందరూ వారి వారి ఆయుధల్ని సమర్పిస్తారు.. త్రిమూర్తులు కూడా వచ్చి ఆయుధాన్ని ఇస్తారు..


మహోత్కట్ వినాయకుడు స్వయం గా పరబ్రహ్మ స్వరూపం.. మీ తల్లి కొడుకుల ప్రేమ చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉంది. మీకు నా వాహనం అయిన సోమనందిని ఇస్తున్నాను. ఇప్పటి నుంచి మీ వాహనం సోమ నంది అని బహుకరిస్తుంది. దేవి పార్వతి...


నరంతకుడు దేవాంతకుడు వీరి ఇద్దరి కాలం దగ్గర పడింది, వారిని సమయం వచ్చినప్పుడు నేనే సంహరిస్తాను అని చెప్పి మామూలు బలకుడి రూపం లో కి వచ్చేస్తాడు వినాయకుడు...


అది విన్న అతిథి అంటే ఈ అవతారం యొక్క ఆవిర్భావం వారి సంహారం అది పూర్తి అవ్వగానే నా పుత్రూడు నా నుంచి వెళ్ళిపోతాడు. ఆ నిజం తెలుసుకున్న అతిథి కన్నీటి పర్యంతం అవుతుంది.. అప్పటి నుంచి దిగులుగా ఉండేది.


అందరూ వెళ్ళిపోతారు. కొన్ని రోజుల తరువాత అప్పటి కాశీ నారేకుడు ఋషి ఆశ్రమనికి వచ్చి తన కొడుకు పెళ్లికి నిరాశ తో ఆహ్వానిస్తాడు. ఋషి ఆ నిరుస్తవానికి కారణం ఏంటి అని అడుగగా..


శివునికి ఇష్టమైన కాశీ నగరం లో ఆ ఇద్దరు దురమారులు వారి అధికారం స్థాపించారు, ఇక నా కొడుకు పెళ్లి జరగాలి అంటే మీ వంటి ఋషి అక్కడ ఉంటే ఎలాంటి విఘ్నాలు రావు అని మిమ్మలని తీసుకు వెళ్లడానికి వచ్చాను అంటారు కాశీ నరేశుడు.

మీతో నేను రాలేను కాశీ నరేష్.. నా బదులు మీతో నా పుత్రుడు వస్తారు తీసుకొని వెళ్ళండి అని అంటారు ఋషి...


వినాయకుడి మీద నమ్మకం లేకకుండ ఋషి కశ్యపుడు చెప్పాడు అని వినాయకుడిని వెంట తీసుకొని వెళ్ళడానికి సిద్ధ పడతాడు కాశీ


నరేశుడు..


తండ్రి, ఇప్పుడు నేను వెళ్ళాను అంటే మాత చాలా బాధ పడుతుంది కనుక నేను వెళ్ళను అని వినాయకుడు అనగా, లేదు పుత్ర. నరంతకుడు, దేవాంతకుడు ని సంహరించాల్సింది నువ్వే కనుక వెళ్ళి తీరాలి అని ఒప్పిస్తారు ఋషి. అతిథి కూడా మనసుని చంపుకొని పంపిస్తుంది.


కాశీ రాజు తో కలిసి తల్లి ఇచ్చిన లడ్డూలు పట్టుకొని కాశీ నగరానికి పయనం అవుతారు ఇద్దరు.


తల్లిని విడిచి వెళ్ళలేక వెళ్ళలేక వెళ్తూ ఉంటాడు వినాయకుడు అతిథి కూడా అంతే బాధ పడుతుంది కానీ ఇద్దరినీ సంహరించక ఒక్కసారి తన పుత్రుడు తిరిగి వస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటుంది.


కాశీ వెళ్ళి ఇద్దరినీ చంపి తిరిగి కాశీ నగరాన్ని రాజు కి అప్పజెప్పి ధర్మాన్ని నిలబెట్టి ఎంతో సంతోషం గా ఆనందంతో కశ్యప ఋషి ఆశ్రమం ముందుకి వస్తాడు వినాయకుడు.


బతిథి ఎన్నో అనలతో ఒక్కసారి అయినా కొడుకుని చూడాలి అని ఎదురు చూస్తూ ఉంటుంది.


ఆశ్రమంలోకి అడుగు పెట్టక ముందే శ్రీ మహా గణాధిపతి అక్కడ ప్రత్యక్షం అయి వినాయక నీ అవతారం యొక్క ముగింపు సమయం


వచ్చింది. ఇక నాలో ఐక్యం అవ్వు అంటారు...


హే ప్రభు ఒక్కసారి నేను మాత్ర ని కలిసేందుకు అనుమతి ఇవ్వండి అని అడుగగా, ఇప్పుడు కాదు భవిష్యత్తులో నీకు అనుమతి లభిస్తుంది. అని మహా గణాధిపతి అనడం తో వినాయకుడు అంతర్ధానం అయిపోతారు.


హే మా అతిథి మీ వలనే నాకు మాతృ ప్రేమ అంటే ఏంటో తెలిసింది.. మీ వినాయకుడు తన భవిష్యత్తు అవతారం లో కచ్చితంగా ఒక్కసారి మిమ్మల్ని కలవడానికి వస్తారు అని మాట ఇస్తారు మహా గణాధిపతి..


అలాగే ప్రభు! నా భాగ్యం లో ప్రతిక్షణే రాసి ఉంటే నేను జీవించి ఉన్నంత కాలం నా కుమారుడి రాకకై ఎదురు చూస్తాను అంటుంది అతిధి... మహా గణాధిపతి కూడా అదృశ్యం అవుతారు..


రెండు యుగాలు గడిచాయి.. మహా గణాధిపతి మూడో అవతారం శ్రీ గణేషుడి గా పార్వతి దేవికి జన్మిస్తారు..


ఒక రోజు కలలో తను ఒక ఆశ్రమంలో ఉన్నట్టు ఏవేవో కలలు గణేశుడికి రావడం తో పార్వతి దేవి కి చెప్తే చింతిస్తుంది అని మహా దేవుని దగ్గరికి వెళ్లి తన కలకి అర్ధం ఏమిటో అడుగుతాడు గణేశుడు..


తండ్రి చెప్పగా అన్ని గుర్తుకు వచ్చి వెంటనే దేని అతిథి ఆశ్రమానికి వెళ్తాడు. తల్లి నీ కలిసి మళ్ళీ ఆ ప్రేమని పొందుతాడు.. ఈ విషయం తెలుసుకున్న పార్వతి దేవి తన కుమారుడు ఇంకొక తల్లి ప్రేమకి దగ్గర అయి తనకి దూరం అవుతాడు అని బాధతో ఋషి ఆశ్రమానికి వెళ్ళి నేను ఒక తల్లినీ అయి ఉండి కూడా ఇంకొక తల్లి సొకనికి ఎలా కారణం కగలను అని తిరిగి వెళ్ళిపోతూ ఉంటే....


పార్వతి దేవి అక్కడ ఉండడం గమనించిన గణేశుడు.. మాత అని పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకుంటాడు..


అప్పుడు అతిథి కి అర్ధం అవుతుంది మహా గణాధిపతి ఈ అవతారానికి తల్లి పార్వతి దేవి అని. తనకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈ అవతారంలో వచ్చారు అని కానీ దూరం గా పంపలేక దేవి అతిథి పడిన బాధ నీ చూసి...


ప్రతి సంకష్టి చతుర్థి నాడు నా గణేశుడు మిమ్మల్ని చూడడానికి మీ వినాయకుడి గా మీ దగ్గరికి వస్తారు అని వరం ఇస్తుంది పార్వతీ దేవి...


ఈ కథ చాలా పెద్దది.. ఏదో షార్ట్ కట్ లో రాశాను.. తప్పులు ఉంటే క్షమించండి....


Choti


Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat